డైలీ సీరియల్

చిన్నతప్పు... పెద్ద శిక్షకు కారణమా? ( యయాతి - 3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నీవు అర్థరహితంగా మాట్లాడడమే కాక ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టి అపమార్గంలో నడుస్తూ తిరిగి ననే్న శపించావు కనుక నిన్ను బ్రాహ్మణులెవరూ వివాహం చేసుకోరు’’ అని కచుడు నన్ను శపించాడు. అతని శాపానికి ఎదురులేదు కనుక నన్ను ఇతరులెవరైనా వివాహం చేసుకుంటారు. అంటే నేడు మీరు క్షత్రియులు కనుక మీరు మీ చేతిని నాకు అందించారు పైగా .అందుకే మీరు నిరభ్యంతరంగా నన్నువివాహమాడవచ్చు అని దేవయాని యయాతితో చెప్పింది.
ఆమె మాటలు అన్నీ విన్నా కూడా యయాతి ధర్మ విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను. మీరు ఎన్ని చెప్పినా మిమ్ములను పెళ్లిచేసుకోవడం అనేది అధర్మమే. దాన్ని నేను ఆచరించను అని అన్నాడు. సరే అటులనే కానిండు అని అంటూనే ‘‘సరే మీరు ధర్మానికి ప్రాధాన్యాన్ని ఇస్తుంటే నేను కాదని ఎందుకంటాను. మీకు అధర్మం అంటకుండా ఉండేలా మా తండ్రిగారి చేత చెప్పిస్తాను. మాతండ్రి మనిద్దరి వివాహం ధర్మసమ్మతమే అని అంటే మీకు నన్ను వివాహం చేసుకోవడానికి అభ్యంతరం ఏమీ ఉండదు కదా’’అని దేవయాని యయాతి ని అడిగింది.
అతడు దానికి సమాధానమివ్వకుండానే అక్కడ నుంచి కదలిపోయాడు.
ఇదేమిటి ఒక బ్రాహ్మణ కన్య నన్ను వివాహం చేసుకోమని ఇంత ఒత్తిడి తెస్తుంది. ఇది ఏ సంఘటనకు దారితీస్తుందో ఏమిటో విధి లీలలు చాలా విచిత్రమైనవి కదా అనుకొన్నాడు. యయాతి తన పరివారంతో తన రాజ్యానికి వెళ్లిపోయాడు.
***
యయాతి వెళ్లిపోయిన తరువాత దేవయానికి చాలా కోపం వచ్చింది. అక్కసు కలిగింది. నేను బ్రాహ్మణ వంశంలో పుట్టినదానిని. మా తండ్రి చెబితే కానీ తిథి వార నక్షత్రాలు తెలియని వంశంలో పుట్టినది. పైగా మా తండ్రి ఆశీర్వదిస్తే కానీ విజయం చేకూరని వంశంలో పుట్టినది. పుట్టినా, చచ్చినా మా తండ్రి ఉంటేనే కానీ పూట గడవని వంశంలో పుట్టిన దీనికి ఇంత పొగరా? ననే్న అవమానిస్తుందా? నా వస్త్రాలు నా చీరలు ముట్టుకోవడానికి కూడా అర్హత లేని వంశంలో పుట్టి నన్ను నన్ను ఈ దిగుడు బావిలో తోసివేస్తుందా ఎంత పొగరు?
శివుడు వచ్చినంత మాత్రాన గబగబా గుడ్టలు చుట్టు కుంటున్నాము అనుకొన్నా కూడా కళ్లు కనిపిస్తూనే ఉంటాయి కదా. మరి అటువంటపుడు నా చీర కళ్లకు కనిపించలేదా ఏమిటి? కళ్లు అంత పొరలు కమ్మినాయా? అహంకారపు పొరలు.. ఇదిగో ఇపుడు ఆ అహంకారపు పొరలను చీల్చివేస్తాను. నేనంటే ఏమిటో తెలియజేస్తాను అనుకొంటే కానీ దేవయానికి మనసు స్థిమితం కాలేదు. అక్కడే ఉన్న ఒక్క చెట్టు కింద కూర్చున్నది. నాకోసం ఎవరూ ఇంతవరకు రాలేదేమి? నా గురించిన చింత ఎవరికీ లేదా? నా తండ్రి ఆ వృషపర్వుని సేవలోనే మునిగి పోయాడా? అందుకే కదా ఆ వృషపర్వుని కూతురికి ఇంత పొగరు పట్టింది. ఆ వృషపర్వునికి, అతని కూతురుకు పట్టిన అహంకారం నేను పారద్రోలుతాను. అపుడు తెలుస్తుంది ఈ దేవయానిని బావిలోకి తోసేస్తే ఏం జరుగుతుందో అని మరోసారి దేవయాని మనసు ఆక్రోశించింది.
అంతలో ఎదురుగా దేవయాని చెలికత్తె వెతుకుతూ వస్తోంది. ఆమెను చూసి పెద్దశబ్దంతో దేవయాని మూలిగింది. దెబ్బ తాలుకూ నొప్పిని భరించలేకపోతున్నట్టుగా మూలిగింది. ఆ మూలుగు శబ్దం విని దేవయాని చెలికత్తె రివ్వున శబ్దంవచ్చిన దిక్కుగా అడుగులు వేస్తూ దేవయానిని పిలుస్తూ ముందుకు వచ్చింది.
‘అమ్మా ! మీరా ఇక్కడ ఉన్నారేమిటి? మీతో కూడా వచ్చిన వారందరూ వచ్చేశారు. ఆ యువరాణి శర్మిష్ఠ కూడా వచ్చేసింది. మీరు రాలేదేమి అని నేను ఆమెను అడిగితే నాకు తెలియదు. వెళ్లు ఇక్కడ నుంచి అని గట్టిగా కోప్పడింది. దాంతో నాకు ఏదో శంక కలిగి మిమ్ములను వెతుక్కుంటూ వచ్చాను. అసలు ఏం జరిగిందమ్మా. మీరు ఎందుకు ఇక్కడే ఉన్నారు. రండి ఇంటికి వెళ్దాం. ’’ అంది.
‘లేదు లేదు నేను ఇక్కడ నుంచి రాను.’ అని మరింత భీష్మించుకుని కూర్చున్న దేవయానిని ఆ చెలికత్తె ఎన్నో విధాలుగా జరిగిందేమిటో చెప్పమని బతిమాలింది. తాను వెళ్లి దేవయాని తండ్రిని కూడా తీసుకొని వస్తాను అని చెప్పింది. అపుడు దేవయాని ఇలా చెప్పుకొచ్చింది.

- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి