డైలీ సీరియల్

ష్‌...-13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండిడ్లీకు సాంబారు ఫ్రీ అని కప్పుల కొద్దీ సాంబారు తాగే కక్కుర్తి మొగుడు అని తిట్టుకుంటూ కిచెన్‌లోకి వెళుతున్నావు కదూ’’ అన్నాడు.
సులోచనకు నవ్వాలో.. ఏడవాలో అర్థం కాలేదు కానీ గ్యాస్‌స్టౌ మీద మొగుడ్ని కూచోబెట్టాలని కసి మాత్రం పెరిగింది.
ఒక్క క్షణం ఆ దృశ్యాన్ని ఊహించుకుంది. తెరలు తెరలుగా నవ్వు వచ్చింది.
సునందారావు భార్య భుజాలు పట్టుకుని ముఖం తనవైపు తిప్పుకుని ‘‘నీకు.. నన్ను ఆ గ్యాస్‌స్టౌమీద కూర్చోబెట్టాలన్నంత కసి ఉంది కదూ’’అన్నాడు.
తన మాటలను చదివే వెధవ తెలివితేటలు వీడికి బోలెడున్నాయి అనుకుని.. పైకి మాత్రం ‘‘అవేం మాటలండీ’’అంది బుద్ధిగా.
సునందారావు భార్య కళ్ళల్లోకి ‘‘నీకు సావిత్రి దూరపు చుట్టమా అడిగాడు.. ఎంత బాగా నటిస్తున్నావు’’అని అడిగాడు. పైగా నాకు ఫేస్ రీడింగ్ తెలుసని తిట్టుకుంటున్నావు కదా’’అన్నాడు.
రెండు చేతులతో నోరు మూసుకుంది సులోచన..
వెంటనే సునందారావు ‘‘నన్ను చూస్తే నవ్వాలనిపించట్లేదు కదూ’’ అన్నాడు.
ఆ క్షణం మొగుడ్ని తలకిందులుగా ప్యానుకు వేలాడదీసి, ఫ్యాను ఫుల్ స్పీడులో పెట్టాలన్నంత కోపమొచ్చింది. ఆ క్షణం తనకు తన ఫ్రెండ్ అన్న మాటలు గుర్తువచ్చాయి. అప్పటికే మొగుడు సాధింపు ఎక్కువైంది. స్టౌమీద కుక్కర్ పెట్టి.. కిచెన్ ఫ్లాట్‌ఫాం నీట్‌గా చేసి ఉల్లిపాయలు తరుగుతుంటే కళ్ళలో నీళ్లువచ్చాయి.
‘‘మొగుడు వెనుకే ఉన్నట్టు తెలుస్తుంది. ఒక దృశ్యం రెండు కోణాల్లో కనిపించటమంటే ఏంటో అర్థమవుతుంది’’
ఒక కథలోని వాక్యం గుర్తుకొచ్చింది.
‘‘కిచెన్‌లో కూరలు తరుగుతున్న భార్య వెనుక భర్త వచ్చి నడుము చుట్టూ చెయ్యి వేసి భుజంపై చుబుకాన్ని ఆన్చి తనవైపు తిప్పుకున్న హీరో జ్ఞాపకంలో.. తను హీరోయిన్ అయితే అన్న ఇష్టం కథలో తప్ప నిజ జీవితంలో కానరాదేది.
ఈలోగా సునందారావు ‘‘కూరల్లో ఉల్లిపాయలు తక్కువేస్తే ఆరోగ్యానికి మంచిదట.. అసలే ఆమధ్య ఉల్లి రేటు ఢిల్లీదాకా వెళ్లింది. పొదుపు నేర్చుకో’’ అంటూ సాగదీస్తూ అన్నాడు.
సులోచన మారు మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోతుంది.
***
పైడితల్లి ఉరఫ్ శర్మిష్టి ఆ ఇంట్లోని స్టోర్ రూమ్‌లోకి వెళ్లింది. చెల్లాచెదురుగా వున్న ఫర్నీచర్, దుమ్ము నిండి వున్న గది. ఆమె కళ్ళు దేనికోసమో వెతుకుతున్నాయి. పైన పడగ్గదిలో ప్రియంవద వుంది.
స్టోర్‌రూమ్‌ని అంగుళం అంగుళం గాలించింది. ఆమెకు కావలసినది దొరకలేదు. వెంటనే వెనక్కు తిరిగి స్టోర్‌రూమ్ తలుపు వేయబోతుండగా తన వెనుక ఏదో అలికిడి అయింది. తల తిప్పిచూసేలోగా బరువైన వస్తువు తలమీద పడింది.
ఓ చేయి ఆమె నోటిని గట్టిగా అదిమిపెట్టింది. క్లోరోఫాం కర్చ్ఫీ వున్న చెయ్యి అది.
క్రమక్రమంగా శర్మిష్టి స్పృహ తప్పుతోంది. స్పృహ తప్పిన ఆమె శరీరాన్ని రెండు చేతులు బలంగా లాక్కెళుతున్నాయి.
అదే సమయంలో గేటు బయట ఆటోలో కిరణ్మయి దిగింది. గేటు తీసుకుని లోపలికి వచ్చింది. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది. ఆమె మనసు కీడును శంకిస్తుంది.
ఒక్క అంగలో గబగబా బెడ్‌రూమ్ వైపు వెళ్లింది. బెడ్‌రూమ్ తలుపులు తోసింది.
అక్కడ మంచం మధ్యలో మోకాళ్ళమీద తలపెట్టి కూచుని ఉంది ప్రియంవద. ఆమె తలనుంచి రక్తం కారుతుంది.
తలుపు శబ్దం కావడంతో కిరణ్మయి వైపు చూసింది.
కిరణ్మయి కంగారుగా ప్రియంవద వద్దకు వచ్చి ‘ఏం జరిగింది మేడమ్’?
ప్రియంవద భయం భయంగా అటూ ఇటూ చూస్తూ.. ‘‘పైడితల్లి నన్ను చంపటానికి ప్రయత్నించింది. తనచేతిలో రివాల్వర్ కూడా ఉంది. నేను పెనుగులాడి గట్టిగా అరిచేసరికి పారిపోయింది’’చెప్పింది.
సరిగ్గా అదే సమయంలో శర్మిష్టిను ఆ ఇంట్లో నేలమాళిగలో ఓ కుర్చీకి తాళ్ళతో కట్టేస్తున్నారు.
గదిలో వాళ్ళిద్దరే ఉన్నారు. ప్రియంవద వంక కిరణ్మయి రెప్పార్పకుండా చూస్తుంది.
మంచానికి దూరంగా రివాల్వర్, ప్రియంవద తలమీద రక్తచారికలు.
ఒకవేళ ఆ గదిలో ఒక సైకో వున్నాడని తెలిసినపుడు.. ఒక మనిషి ఫీలింగ్ ఎలా వుంటుంది?
కిరణ్మయికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆమెకు ఇదంతా కన్‌ఫ్యూజన్‌లా వుంది. అర్థంకాని విషయం, అర్థం చేసుకోలేనంత విషయం!
సడెన్‌గా కిరణ్మయికి కులకర్ణి గుర్తొచ్చాడు. ఈ సమస్యను సాల్వ్ చేయగలిగేది అతను మాత్రమే. ఈ ఆలోచన రాగానే అదే విషయాన్ని ప్రియంవదతో చెప్పింది.
ప్రియంవద కొద్ది క్షణాలు ఆలోచించి ‘‘ఇపుడే వద్దు.. మనం చెప్పిన విషయాన్ని ఆయన నమ్మకపోవచ్చు.. లేదా ననే్న అనుమానించవచ్చు’’ అంది.
ఇంకావుంది

-ములుగు లక్ష్మి (మైథిలి) 9440088482