డైలీ సీరియల్

విషయవాంఛలే విషవలయానికి కారణం! (యయాతి -7)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యయాతీ చెప్పినమాటను కాదని ధర్మం తప్పావు కనుక నీవు స్ర్తిలు అసహ్యించుకునే ముసలితనాన్ని పొందుదుగాక!’ అని శపించాడు.
యయాతీ ఆ శాపాన్ని విని అప్రతిభుడయ్యాడు. శుక్రాచార్యా! నాకు ఇంకా ఈ శరీరం పై మమకారం వదలలేదు.

నాకు ఇంకా శృంగారేచ్ఛ వలదలలేదు. మీరు నన్ను శపించారు బాగానే ఉంది. కానీ ఇది మీ అమ్మాయి కి కూడా శిక్షే అవుతుంది. కేవలం నా ఒకడికి మాత్రం ఇది శిక్ష కాదు. మీ అమ్మాయికి కూడా ఇది శిక్షే అని యయాతీ అన్నాడు. అయినా కూతురుకోసం నన్ను శిక్షిస్తారా అని వాపోయాడు యయాతీ మహారాజు.
యయాతి మహారాజు ను చూసి దేవయానిని అపుడు దుఃఖం పొందింది. నిజమే మా తండ్రి ఇచ్చిన ఈ శాపం వల్ల నేను అపతిరో స్వర్గ సౌఖ్యాలనుపొందలేదు. దీనికేదైనా చేయాలి అనుకొన్నది. శుక్రాచార్యుని వంక దీనంగా చూసింది. యయాతీ మహారాజు శుక్రాచార్యుని మరీ మరీ వేడుకున్నాడు. తనకు తనివి తీరలేదని దానికోసం నాశరీరాన్ని నా కివ్వమని ఎంతో ప్రార్థించాడు.
అపుడు శుక్రాచార్యుడు సరే నీకీ ముసలితనం వద్దను అనుకుండే ఎవరైనా ఈ నీ ముసలి తనాన్ని తీసుకొని యవ్వనాన్ని ఇచ్చే వారుంటే చూడు వారికి ఈ ముసలితనం ఇచ్చి వారి యవ్వనాన్ని తీసుకొనుము. కోరికలూ అన్నీ తీరిన తరువాత వారి యవ్వన శరరాన్ని వారికి అప్ప చెప్పుము అన్నాడు.
గుడ్డిలో మెల్ల శ్రేష్ఠమన్నట్లు యయాతీ కాస్త నెమ్మదించి తనకు శర్మిష్ఠ కొడుకులతో పాటుగా ఐదుగురు కుమారులున్నారు. వారిలో ఎవరైనా ఈ శరీరాన్ని తీసుకొంటారులే అనుకొన్నాడు. అయినా దేవయానికి కూడ కోరికలు తీరలేదు కనుక నాకు శరీరరాన్ని ఇవ్వమని తన కొడుకులకు చెప్తుంది అనుకొన్నాడు.
దేవయాని యయాతీ ఇద్దరూ రాజ్యానికి వెళ్లారు. యయాతీ కొడుకులను పిలిచి తనకు జరిగిన కష్టాన్ని చెప్పుకున్నాడు. దేవయాని కుమారుడైన యదువుకు నీ యవ్వనాన్ని నాకు ఇవ్వమని తన వృదాధప్య శరీరాన్ని తీసుకొనమని చెప్పాడు.
కానీ ఆ యదువు ‘తండ్రీ ఈలోకంలో ఎవరికి వారే. ఎక్కడ తల్లి దండ్రీ నీవు ఇంత కాలమూ సుఖాలను అనుభవించినా ఇంకా అనుభవించాలనే ఆశ తీరక నన్నునా యవ్వనాన్ని అడుగుతున్నావు. ఇది ఏమన్నా సమంజసంగా ఉందా? నాకు కూడా ఎన్నో కోరికలున్నాయి. వాటిని తీర్చుకోవడానికి, దేనినైనా సాధించడానికి ఈ యవ్వనమే కదా కావాల్సింది. మీరు ఏమీ అనుకోకండి నా యవ్వనాన్ని మీకు ఇవ్వలేను’ అని చెప్పేశాడు.
ఆతరువాత మిగిలిన అంటే దేవయాని, శర్మిష్ఠల కొడుకులను కూడా వారి యవ్వనాన్ని యయాతీ అడగడమూ వారు ఇవ్వడానికి నిరాకరించడమూ జరిగిపోయాయి.
ఇక అందరికన్నా చిన్నవాడైన పూరువు తండ్రి దగ్గరకు వచ్చాడు. వానిని చూసి యయాతీ తన సమస్యను అతి దీనంగా చెప్పాడు. అతడు చిరునవ్వుతో ‘తండ్రీ దీనికి ఎందుకింత వ్యధ చెందుతున్నారు. మీ మామగారు, నాకు తాతగారు మంచి ఉపాయం కూడా చెప్పారు. కదా. తల్లీదండ్రీ ని సేవించని కుమారుడు కుమారుడు అవుతాడా ఎక్కడైనా నేను నా యవ్వనాన్ని మీకు ఇస్తాను. మీరు యథేచ్ఛగా మీకాలాన్ని అనుభవించండి. మీరు చేయాలనుకొన్న యాగాలు, మీరు పొందాలనుకొన్న సుఖాలు వేటినైనా నిరభ్యంతరంగా పొందండి. నాకు ఈ యవ్వనంతో పని లేదు. దీనిని నేను మీకు ఎంతో సంతోషంగా ఇచ్చివేస్తాను అని అన్నాడు. అన్నమాట అన్నట్లుగానే పూరుని శరీరం యయాతికి, యయాతి శరీరాన్ని పూరుడు బదలాయించుకున్నారు.
పూరుడు ఇచ్చిన శరీరంతో యయాతీ మిక్కిలి సంతోషించాడు. దేవయాని ఈ విషయం చూసి చాలా ఆశ్చర్యపడింది. ఆమె తన భర్తతో కలసి పూర్వం లాగా ఎన్నో యాగాలు, యజ్ఞాలు చేస్తూ సంతోషంగా కాలం గడుపుసాగింది. ఇలా ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి.
***
చివరకు ఒక రోజు యయాతికి జీవితం పట్ల విరక్తి కలిగింది. ఎన్నాళ్లు జీవించినా, ఎనే్నళ్లు సుఖ భోగాలు అనుభవించినా ఏముంది ? నేను పొందినది పొందబోయేది ఏదీలేదు. ఉంది అనుకొన్నది క్షణ మాత్రం కూడా లేకుండా పోతోంది. లేదు అనుకొన్నది లేకుండాను లేదు. ఇది ఏమిటి.?

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి