డైలీ సీరియల్

ష్...19

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలి వేలిని కదిలిస్తోంది.. రక్తం కారుతోంది. కట్టు దగ్గరికి వచ్చేసింది గాజుముక్క.
***
కిరణ్మయి తయారవుతోంది. వెంటనే ఆల్కహాల్ వాసన గుప్పుమంది. అంటే బావ వచ్చేసాడు. ఆమెకు ఆ ఆలోచనే కంపరంగా వుంది. అక్క గుర్తుకువచ్చి కోపాన్ని, అసహ్యాన్ని అణచుకుంది.
‘‘వచ్చేసావా.. నా మరదల్ పిల్లా.. నీ యక్క నా మందుకు డబ్బు ఇవ్వడంలేదు. అడిగితే నా రక్తం తాగు అంటోంది. నువ్వైనా చెప్పు.. నాకు నీ డబ్బు కావాలి.. కానీ రకతం ఎందుకు.. పోనీ ఓ పని చేయ్... నీ బాస్‌ను అడిగి పది లక్షలు ఇప్పించు. ఓ బార్ పెట్టుకుంటాను.. హాయిగా నీ యక్క, నేను బార్‌లోనే కాపురం ఉంటాం..’’
కిరణ్మయికి కోపం తన్నుకువస్తుంది. అయినా తమాయించుకుంది. ఈరోజే బాస్‌ను డిశ్చార్జ్ చేయవచ్చు. పైగా ప్రియంవద మేడమ్‌తో మాట్లాడాలి. తన ప్రవర్తన వింతగా వుంటుంది. అలా ఆలోచిస్తూ ఉండగానే...
***
అదే సమయంలో సునందరావు మొదటిసారి ఆటో ఎక్కాడు.. బొకేతో భార్యను ఎక్కించుకుని.. తన వెహికల్ ఎక్కటానికి వీలుకాదు. ఎందుకంటే.. తను వచ్చేటపుడు బోల్డు డబ్బుతో వస్తాడు. అన్నింటికన్నా ముఖ్యం.. హాస్పిటల్‌కు అజ్ఞాత వ్యక్తి వస్తాడు. తనకు మొబైల్ గిఫ్ట్‌గా ఇస్తాడు. అవౌంట్ కూడా ముందే ఇస్తాడు.
ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ ఆటో ఎక్కాడు.
ఎక్కువ షాక్‌లో వున్నది సులోచన మాత్రమే.. జరగబోయే పరిణామం తెలియక..
***
అదే సమయంలో కమీషనర్ ఆఫీసులోవున్న ఏసీపీ కులకర్ణికి ఫోన్ వచ్చింది.. ఆ ఫోన్‌లో అవతలి వైపు చెప్పేది విన్నాక వెంటనే ఎలర్ట్ అయ్యాడు..
ఏసీపీ కారు హాస్పిటల్ వైపు వెళుతోంది..
***
ఒక సంతోషం వెనుక ఒక తృప్తి వుంటుంది కానీ ఆ సంతోషంలో అమాయకత్వం వుంటే.. అత్యాశ వుంటే.. సునందరావు చాలా సంతోషంగా ఉన్నాడు. ఈజీమనీ అంటే ఇదే కాబోలు.. అనుకుంటున్నాడు. ప్రతీ ఈజీమనీ వెనుక ఉండే సమస్యలు.. తెలిసే అవకాశం ఇంతవరకు రాలేదు.
భర్తతో వెళ్తున్నా ఆమెలో ఆలోచనలు.. భర్తలో కలిగిన మార్పు పట్ల ఎన్నో సందేహాలు. ఎందుకంటే ప్రద్యుమ్నగారిని చూడాలనుకుంటున్నాడు. ఎన్నోసార్లు బాస్ ఏదో ఒక అకేషన్‌కు స్ట్ఫాను, స్ట్ఫా ఫ్యామిలీకి పార్టీలు కూడా ఇచ్చారు. తన ఆఫీసుకు రావటానికి ఆటో ఛార్జి అవుతుందని రాననేవాడు. ఇప్పుడెందుకో.. ఏమిటో?..
***
ప్రద్యుమ్న అలసటగా కళ్ళు మూసుకున్నాడు. అతనికి కొన్ని విషయాలు లీలగా గుర్తుకువస్తున్నాయి. ఎక్కువగా జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేయడంలేదు. తనకు చివరిసారిగా వచ్చిన కాల్ గుర్తుకొచ్చింది. తను ఇంటికి వెళ్దామని అనుకునే సమయంలో తన మొబైల్‌కు వచ్చిన లాస్ట్‌కాల్.. అర్జెంట్‌గా వచ్చి కలవాలని.. ఆ కాల్ సారాంశం.. ఎవరిని కలవాలి? ఎందుకు కలవాలి? తను వెళ్తుంటే.. తనను ఎవరో ఫాలో చేస్తున్నట్లు అనిపించటం.. తన కారుకు ఎదురుగా ఎవరో రావడం.. తనను షూట్ చేయడం. తల గట్టిగా పట్టుకున్నాడు ప్రద్యుమ్న. ఆలోచిస్తుంటే.. బుర్ర వేడెక్కిపోతుంది.
అసలు ఏం జరుగుతుంది? తన మీద హత్యాప్రయత్నం ఏమిటి? హాస్పిటల్ కూడా? ప్రియంవద ఎలా వుంది? డాక్టర్ ఎక్కువగా మాట్లాడకూడదు అన్నాడు.
***
అదే సమయంలో ప్రియంవద ఇంటినుంచి కారు డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్ వైపు వస్తోంది.. కిరణ్మయి ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చి ఆటో ఎక్కి హాస్పిటల్ అడ్రెస్ చెప్పింది..
సునందారావు ఎక్కిన ఆటో హాస్పిటల్ దగ్గరికి వస్తోంది..
ఏసీపీ కులకర్ణి ప్రద్యుమ్నను కలవాలని హాస్పిటల్‌కు బయల్దేరాడు.
***
సునందరావ్ ఎక్కిన ఆటో హాస్పిటల్ ముందు ఆగింది.
అతని చేతిలో బొకే.. మరో చేతిలో మొబైల్ ఫోన్.. చూస్తుంటే ముద్దు వచ్చేలా వున్న ఆ ఫోన్‌కు.. ఫస్ట్ కాల్ చేసి విషెస్ చెబుతానన్నాడు.. ఆ అజ్ఞాత వ్యక్తి.
సులోచన ఆటో దిగుతూండగానే కిరణ్మయి అక్కడికి వచ్చింది. సులోచన తన భర్తతో కలిసి రావటం చూసి ఆశ్చర్యపోయింది కిరణ్మయి.
‘‘ఏమిటీ విశేషం... మొదటిసారి...? అంటూ సునందరావువైపు చూసి..’’ అంది కిరణ్మయి.
అర్థమైంది అన్నట్లు నవ్వి ‘‘నాకూ షాకింగ్‌గానే వుంది.. ఏం చేయను? అధికార పక్షం, ప్రతిపక్షం కలిసిపోయినాయి అన్ని నమ్మగలను. కానీ.. నామొగుడు... మారాడు అంటే నేనే నమ్మలేకపోతున్నాను’’ అంది సులోచన.
అప్పుడే ప్రియంవద అక్కడికి వచ్చింది. ఆమె మొహంలో కూడా కొత్త మార్పు గమనించింది కిరణ్మయి.

ఇంకావుంది

-ములుగు లక్ష్మి (మైథిలి)