డైలీ సీరియల్

ష్‌...-20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునందరావు భార్యను తొందర పెట్టాడు. అతనికి ముందు.. ప్రద్యుమ్నకు బొకే ఇచ్చి కొత్త మొబైల్‌నుంచి ఆ దృశ్యాన్ని ఫొటో తీయాలని వుంది. అతని జేబులో అపరిచిత వ్యక్తి ఇచ్చిన డబ్బు పదిలంగా.. పడుకున్న పాములా వుంది. అది ఏ క్షణమైనా కాటువేయొచ్చు.. అనేలా..
కిరణ్మయి ముందుకు నడిచింది.
****
శర్మిష్ట తన ప్రయత్నాన్ని విరమించలేదు. గెలిచేవరకూ, అనుకున్నది సాధించేవరకూ.. అలుపులేని పోరాటాన్ని కొనసాగించాలన్న ప్రాథమిక యుద్ధ సూత్రాన్ని గుర్తుంచుకుంది.
గాజుముక్క తాడును మాత్రమే కాదు.. ఆమె వేలునూ కోసేస్తుంది. అయినా పంటి బిగువున బాధ భరిస్తోంది. క్షణాలు.. నిమిషాలు అవుతున్నాయి. ఆమె ముఖం స్వేదంతో తడిసిపోయింది. ఆమె ప్రయత్నం ఫలించింది. తన బంధనాలు తెంచుకుంది.
ఆమె కళ్ళు చీకటికి అలవాటు పడ్డాయి. మెల్లి మెల్లిగా అంతా అస్పష్టంగా కనిపిస్తోంది. అది స్టోర్ రూమ్‌గా గుర్తించింది. తన సెల్ కోసం వెతికింది. పెనుగులాటలో ఎక్కడో పడిపోయి వుంటుంది. అప్పుడే అనుకోని సంఘటన జరిగింది. ఎక్కడో సెల్ రింగ్ అవుతోంది. చెవులు రిక్కించి మరీ విన్నది. ఆ శబ్దం పాడుపడిన ఫర్నీచర్ దగ్గరినుంచి వస్తోంది.. తన చెవి నేలమీద ఆనించింది. ఓ మూలాన సెల్ రింగ్ అవుతూ కనిపించింది. శర్మిష్టలో కొత్త ఉత్సాహం.. వెంటనే పక్కనే వున్న పొడవాటి కర్ర తీసుకుంది. ఆది బూజు దులిపే కర్ర.. కర్రతో సెల్ బయటికి తీసింది.
డిస్‌ప్లేమీద.. కిరణ్మయి అనే పేరు కనిపించింది. తానే కిరణ్మయికి తన నెంబర్ ఇచ్చింది.
వెంటనే కాల్ అటెంట్ అయ్యింది.
‘‘మేడమ్. మీరెక్కడ ఉన్నారు?.. మీ కోసం చాలాసార్లు ట్రైచేశాను. మీకు ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి.. ప్రియంవద మేడం గురించి’’ అటువైపు నుంచి కిరణ్మయి గొంతులో కంగారు కనిపిస్తోంది.
‘‘ప్రియంవద ప్రవర్తనలో మార్పుగురించేనా?’’ శర్మిష్టి అడిగింది.
‘‘ఎస్.. మేడమ్.. మీరెలా కనిపెట్టారు?’’ విస్మయంగా అడిగింది కిరణ్మయి.
‘‘ఆ కారణం ఏమిటో నాకు తెలుసు. నువ్వు.. అర్జంట్‌గా ఏసీపీ కులకర్ణిగారికి ఫోన్ చేసి.. నేను చెప్పింది చెప్పు’’ అంటూ ఏసీపీకి ఏం చెప్పాలో చెప్పసాగింది.. శర్మిష్టి..
***
సునందరావ్ హాస్పిటల్ అడుగుపెట్టాడు. అతని మనసు గాలిలో విహరిస్తోంది. రాబోయే ఉపద్రవాన్ని తెలుసుకోలేకపోవడంవల్ల..
ప్రియంవదను చూసిన కిరణ్మయి మర్యాద పూర్వకంగా విష్ చేసింది.
ప్రియంవదలో ఆందోళన ఇంకా తగ్గలేదు.
ప్రద్యుమ్న అలసటగా లేచి కూచున్నాడు.. సంవత్సరాలు కోమాలో ఉన్నట్టు ఉండి..
అప్పుడే డోర్ తీసుకుని ప్రియంవద వచ్చింది.. ఆమె వెనుకే కిరణ్మయి.. ఆ వెనుక సులోచన, సునందరావ్.
ఒక్కడుగు ముందుకు వేశాడు సునందరావు.
అతని చేతిలోని బొకేని ప్రద్యుమ్నకు ఇవ్వబోతుండగా.. సుడిగాలిలా లోపలికి దూసుకువచ్చాడు ఏసీపీ కులకర్ణి.
సునందరావు చేతిలోని బొకేని లాక్కొని బయటకు పరుగెత్తి ఓపెన్ ప్లేస్‌లోకి విసిరేశాడు. కొద్దిక్షణాల తేడాతో పేలిపోయింది.
హాస్పిటల్‌లో ఒక్కసారిగా కలకలం..
అప్పటికే పోలీసులు హాస్పిటల్‌ను చుట్టుముట్టారు. సునందరావు ఒక్కసారిగా వణకిపోయాడు. అంటే తన చేతిలో వున్న పూలబొకేలో బాంబు ఉందా? మొదటిసారిగా భయం.. దానితోపాటు పశ్చాత్తాపం కలిగాయి.
ప్రియంవద వణికిపోయింది. ప్రద్యుమ్నను గట్టిగా పట్టేసుకుంది.
‘‘సర్.. ఏమిటిదంతా?’’ ఆశ్చర్యం.. భయం కలిసిన గొంతో అడిగింది కిరణ్మయి.
ఇంకా ఉంది
========================================================
భారతీయులకు దేశభక్తి లేకపోతే ?
దేశద్రోహానికి పాల్పడుతారా?
విదేశీయులకు
మన సంస్కృతిపై ప్రేమ ఉంటే ?
వారు భారతీయులు అయపోతారా?
అడుగడుగునా
ఉత్కంఠ కలిగించే
అత్యద్భుత అపరాధ పరిశోధక నవల
చారిత్రక నవలా చక్రవర్తి
ప్రొఫెసర్. ముదిగొండ శివప్రసాద్ గారి
లేఖిని నుండి వెలువడిన సస్పెన్స్ థ్రిల్లర్ విశ్వనాథ్ గోడ్బోలే
అతి త్వరలో ప్రారంభం

-ములుగు లక్ష్మి (మైథిలి) 9440088482