డైలీ సీరియల్

ష్‌...-11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సులోచన ఇంకా ఆ షాక్‌లోనుంచి కోలుకోలేదు. ఆమెకు కలిగిన పెద్దషాక్... తన భర్త... తన బాస్‌ను చంపడానికి ప్రయత్నించడం..
భర్త పిసినారితనాన్ని అర్థం చేసుకుంది.. కానీ.. ఒక హంతకుడుగా మారడం.. మొట్టమొదిసారిగా ఆమెలో సహనం బరస్ట్ అయ్యింది. భర్త చెంపమీద గట్టిగాకొట్టింది.
‘‘ఒట్టు సులోచన.. ఇందులో బాంబు వున్న విషయం నాకు తెలియదు.. డబ్బుకోసం కక్కుర్తిపడతాను కానీ.. హత్యచేసేంత చెడ్డవాడిని కాను..’’ ఏడుస్తూ భార్య చేతులు పట్టుకున్నాడు సునందరావు.
‘‘నాకు మిమ్మల్ని చూస్తుంటేనే అసహ్యంవేస్తుంది. సర్.. నా భర్తను అరెస్టు చేయండి’’ ఏడుస్తూ అంది సులోచన.
‘‘నీ భర్త అమాయకుడు సులోచన’’ అన్న మాటలు వినిపించాయి.
‘‘శర్మిష్టి అక్కడికివచ్చింది... ఆమెతోబాటు దొంగబాబా ఉన్నాడు.
‘‘మేడమ్.. ఏమిటి మీరంటున్నది?’’ కొంత సంతోషం, మరికొంత విస్మయంతో అడిగింది సులోచన.
శర్మిష్టి ప్రియంవద వైపుచూసి చెప్పడం మొదలుపెట్టింది..
‘‘ఈ దొంగబాబా పేరు దుర్జనరావు.. ప్రద్యుమ్న చిన్నాన్న కొడుకు.
తమ్ముడు చెడు వ్యసనాలకు బానిస కావడంతో ప్రద్యుమ్న తండ్రి అతడిని దూరం పెట్టాడు. అయినా తమ్ముడి కొడుకు బాధ్యతలు స్వీకరించాడు.
ప్రద్యుమ్న చిన్నాన్న చనిపోయాడు. అప్పటికే పెద్దవాడైన దుర్జనరావు.. తన చెడు వ్యసనాలు వదులుకోలేదు. ఆస్తికోసం పెదనాన్న కొడుకునే చంపాలనుకున్నాడు. ప్రద్యుమ్న తండ్రి తన ఆస్తిని ప్రద్యుమ్నకు.. తమ్ముడి కొడుక్కీ సమానంగా రాశాడు. ఆ మంచితనాన్ని అర్థం చేసుకోకుండా.. దుర్జనరావు.. అన్నను, వదినను చంపేయాలని.. అప్పుడు ఆ ఆస్తికి.. పెద్దనాన్న ఆస్తికి తానే వారసుడు కావచ్చని పన్నాగం పన్నాడు. అందులో భాగంగా ప్రద్యుమ్నపై హత్యాప్రయత్నం..
ప్రియంవదను మానసికంగా హింసిస్తూ.. భర్తను చంపుతానని బెదిరించడం చేసేవాడు.
కిరణ్మయి ద్వారా ఆఫీసు రహస్యాలు తెలుసుకొనే ప్రయత్నం చేశాడు. నన్ను కిడ్నాప్ చేశాడు. సులోచన భర్తను పావులా వాడుకుని ప్రద్యుమ్నను చంపాలని ప్రయత్నించాడు. కానీ ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది’’.
శర్మిష్టి ‘ష్..’రహస్యాన్ని చెప్పేసింది.

***
కిరణ్మయి బావను రీహాబిలిటేషన్ సెంటర్‌కు తరలించారు. సునందరావు డబ్బును కాకుండా భార్యను ప్రేమించడం మొదలుపెట్టాడు.
కిరణ్మయికి ప్రమోషన్ ఇచ్చాడు ప్రద్యుమ్న.. చాలాకాలం తరువాత భార్యతో కలిసి డిన్నర్ చేశాడు ప్రద్యుమ్న. నెల రోజులపాటు విదేశాలకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు.
దుర్జనరావు జైలులో శిక్ష అనుభవిస్తూనే బయటకు వచ్చాక.. మళ్లీ ప్రద్యుమ్నను ఎలా చంపాలా అని ప్లాన్ చేస్తున్నాడు.

అయపోయంది
=================================================================
భారతీయులకు దేశభక్తి లేకపోతే ?
దేశద్రోహానికి పాల్పడుతారా?
విదేశీయులకు
మన సంస్కృతిపై ప్రేమ ఉంటే ?
వారు భారతీయులు అయపోతారా?
అడుగడుగునా
ఉత్కంఠ కలిగించే
అత్యద్భుత అపరాధ పరిశోధక నవల
చారిత్రక నవలా చక్రవర్తి
ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ గారి
లేఖిని నుండి వెలువడిన
సస్పెన్స్ థ్రిల్లర్ విశ్వనాథ్ గోడ్బోలే రేపే ప్రారంభం ప్రారంభం

-ములుగు లక్ష్మి (మైథిలి) 9440088482