డైలీ సీరియల్

కాలం తీరిన కాలయవనుడు (కాలయవనుడు -4 )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవు అలా పరుగెత్తుతుంటే నాకు నీ వెనుకనే వచ్చి నిన్ను ఒంటి చేత్తో పట్టుకొని ‘ఓరీ అర్భకా! ఇంతకుముందు వచ్చిన వారి కాలం బాగలేక వారు వెనుకడుగు వేసి ఉంటారు. లేదా వాళ్లు కాలం తీరి యముని దగ్గరకు వెళ్లి ఉంటారు. నేను అట్లా కాదురా బుడతా! ’అని చెప్పాలని పిస్తోంది. అనుకొన్నాడు కాల యవనుడు
కాలయవనుని మాటలు విని కృష్ణుడు...
‘అవునా! నిజమా! ననే్నమీ చేయవా! నీవు మాత్రమే వీరాధివీరునివా! అయితే నన్ను పట్టుకొనుము..’ దా దా ’ అంటూ మరింత జోరుగా పరుగెత్తాడు కృష్ణుడు.
ఇలా కాలయవనుడు, కృష్ణుడు పరుగు పందెం కాచినట్టు ఒకరి వెనుక ఒకరు పరుగెత్తుతున్నారు. కాలయవనుడు అలసి పోతున్నాడు. నీరసం ముంచుకొస్తోంది. కాని కృష్ణుడిని మాత్రం ఎట్లాగైనా పట్టుకోవాలనుకొన్నాడు. దగ్గరగా ఉన్నట్లే ఉంటాడు.
దొరికినట్టే అనిపిస్తాడు. ఇదిగో చిక్కాడులే అని చేతిని చాచే లోపు అందనంత దూరానికి పరుగెత్తిపోయే కృష్ణుని పట్టుకోలేక పట్టుకోకుండా ఉండలేక కాలయవనుడు ఒంట్లో సత్తువనంతా పైకి తీసి మరీ పరుగెత్తుతున్నాడు.
ఆ నారదుడు చెప్పినది నిజమేనేమో .. ఇతడు ఎవరికీ చిక్కడా అందుకే ఇంతగా పరుగు లంకించుకున్నాడు అని కాలయవనుడు హృదయంలో అనుకొన్నాడు. ఇదేమీ లేదు. చూస్తే చిన్నవాడిలాగే ఉన్నాడు కదా అందుకే పరుగులో ముందున్నాడు. అంతే నేను ఇట్టే పట్టేసుకుంటాను అని మరల తన్ను తాను జాగృత పరుచుకుని కృష్ణుని వెంట పరుగు పెడుతున్నాడు కాలయవనుడు.
కొండలు, వాగులు, వంకలు, చెట్లు పుట్టలు అన్నీ ఎక్కుతున్నాడు. దిగుతున్నాడు. కొండగుహల్లోను దూరుతున్నారు. ఆవలవైపుకు బయటకు వస్తున్నారు.
అట్లా పరుగెత్తుతున్న కృష్ణుడు దొరికినట్లే దొరికి చేతికి అందినట్లే అంది చటుక్కున ఓ కొండ గుహలోకి దూరాడు. ఆలోచించకుండా కాలయవనుడు కూడా అదేకొండ గుహలోకి దూరాడు.
అక్కడంతా చీకటి మయం. అజ్ఞానాంధకారంగా ఉంది. కళ్లుబొడుచుకున్నా కానరానంత చీకటిలో ఎక్కడ నక్కాడీ నల్లవాడు అనుకొంటూ మెల్లగా శబ్దమేమీ రాకుండా మెల్లగా కాలయవనుడు అడుగులు వేస్తున్నాడు. కృష్ణుడు అపుడే కాలయవనుడిని చూసినట్లు ‘యే..అమ్మో ...’అని చిన్న పాటి కేక ఒకటి పెట్టి వచ్చినంత వేగంగా ముందుకు కదిలాడు కృష్ణుడు. ‘ఓరీ ఇక్కడ ఉన్నావా’అంటూ కాలయవనుడు వేగంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్లాడు.
ఓ చోట హాయిగా నిద్రపోతున్న ముచికుందుని చూశాడు. పెద్దగా గురక పెడుతున్న ముచికుందుని చూసి ‘‘ఓరీ పిరికి పందా! ఇక్కడ నిద్రపోతున్నట్లు నటిస్తున్నావా..పురుషాధమా! నాతో యుద్ధం చేయలేక ఇట్లా పరుగు లంకించుకుని తీరా ఇక్కడ నిద్ర నటిస్తున్నావా... ఈ చీకటి గుహలో పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, ఆఖరికి చీమలు కూడా భయపడేంత చీకటి ఆవరించిన ఈ గుహలోకి వచ్చి నిద్రపోతావా.. ఇక్కడికైతే రాననుకున్నావా.. లేక వచ్చినా లోపలికి రాలేక వెనక్కు వెళ్తానని అనుకొన్నావా.. ’ అంటూ అతి కోపంతో పెద్ద పాన్పు పైన హాయిగా నిద్రపోతున్న ముచికుందని కాలితో బలంగా తన్నాడు. అంతే ఎన్నో ఏళ్లనుంచి నిద్రపోతున్న ముచిందనికి నిద్రాభంగం అయింది.
ఏమీ జరిగిందా అనుకొంటూ కళ్లు తెరిచాడు ఆయన. అంతా చీకటి తన కన్నులు నలుపుకుంటూ తిరిగి నలుమూలలా కళ్లతోనే వెతికాడు. అంతే తన ఎదురుగా నిల్చున్న కాలయవనుడు మాట పలుకు లేకుండా ఆ ముచికుందుని కళ్లమంటలకు కాలి బూడిద అయినాడు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు పెదిరి పెదిరి మాట్లాడిన మాటలన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి. ముచికుందుని వర ప్రభావం వల్ల ఆయన కంటినుంచి వెలువడిని ఆగ్రహోజ్వాలలు కాలయవనుని కాలి బూడిద చేశాయి. ఆ తరువాత కృష్ణుడు ముచికుందునికి దర్శనం ఇచ్చాడు.
- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి