డైలీ సీరియల్

భవిత ముందే తెలిస్తే...? ( ప్రద్యుమ్నుడు -1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవతలంతా పార్వతీ కళ్యాణం జరగాలని అనుకొన్నారు. కానీ పార్వతీ దేవి హిమవంతుని పుత్రికగా పుట్టి పరమేశ్వరుని కోసం తపస్సు చేస్తూ ఉంది. మరో ప్రక్క సతీదేవిని దూరం చేసుకొని పరమశివుడు అత్యుగ్రమైన తపోభూమిలో సమాధిలో ఉండిపోయాడు.వీరిద్దరికీ వివాహం చేయాలని దేవతలు అనుకొన్నారు.
దానికోసం మన్మథుణ్ణి శివుని దగ్గరకు వెళ్లమన్నారు. మన్మథుడు తన పూలబాణాలను వేసి పరమశివుని తపోనిష్ఠను భంగం చేయమని చెప్పారు. మన్మథుడు పరమశివుని చెంతకు వెళ్లడానికి భయపడ్డాడు. కానీ దేవతలు ఆయనకు అభయం ఇచ్చి మరీ పరమశివుని దగ్గరకు పంపించారు.
శివునిపై మన్మథబాణం ఎక్కుపెట్టగానే ప్రకృతి అంతా పరవశించి వసంతోత్సవం జరుపుకుంది. కానీ త్రినేత్రుడు తన మూడో నేత్రం తెరిచాడు. ఎదురుగా ఉన్న మన్మథుడు వెంటనే శివాగ్నిలో కాలి బూడిదయ్యాడు.
అక్కడే దేవతలతోపాటు ఉన్న రతీదేవి మూర్ఛపోయింది. కొద్దిసేపటికి తెలివి తెచ్చుకుని శివుని తపోదీక్షను విరమించని పరమశివుని పాదాలను ఆశ్రయించింది. తనకు పతి భిక్ష పెట్టమని వేడుకుంది. సకల జనుల కళ్యాణం కోసం మన్మథుడు మీపై పూలబాణాలు వేసాడని లోకం అంతా రాక్షసులతో అరాచకం పాలైందని చెప్పింది. దీనికి మీరు తిరిగి సంసార చక్రంలోకి రావాలని, పార్వతీ దేవిని పక్కన కూర్చోబెట్టుకొంటే కానీ ప్రకృతి వైపరీత్యాలు ఆగవని చెప్పింది.
రాక్షసులకు దండన విధించాలంటే పార్వతీ పరమేశ్వరుడు కావాలని దేవతలు కోరారని అందుకే మన్మథుడు ఈ సాహసం చేశాడని చెప్పింది. తన భర్త తనతో లేకపోతే తాను నిలువలేనని దీనంగా చెప్పింది.
ఆమె దీనాలాపనలను విని దయాళువు, కృపారసం ఉండేవాడు అయిన పరమశివుడు రతీదేవిని అనుగ్రహించాడు. అందరికీ అనంగుడిగా కనిపించినా నీకు మాత్రం మరుడు మాన్యుడై శరీరసహితంగా కనిపిస్తాడు. నీకోరికలు తీరుస్తాడనే వరం ప్రసాదించాడు.
***
‘‘ఆ మన్మథుడే రుక్మిణీ కృష్ణులకు ప్రద్యుమ్నుడుగా పుట్టబోతున్నాడు. కానీ శంబరాసురుడు ఆ ప్రద్యుముని వల్ల ప్రమాద బారిన పడతాడు. ఈసంగతి తెలసుకొన్న శంబరాసురుడు ఈ ప్రద్యుమ్నుడు పురిటి పసికందుగా ఉన్నపుడే అపహరిస్తాడు సుమా. వానిని నీవు కాపాడుకో’’ అని నారదుడు రతీదేవికి చెప్పాడు.
అప్పటినుంచి భవిష్యత్తులోజరగబోయే దానిని తలుచుకుంటూ రుక్మిణీదేవి ఎప్పుడెప్పుడు గర్భవతి అవుతుందా అని రతీదేవి ఎదురుచూసింది.
రతీ దేవి ఎదురుచూపులు, కృష్ణుని అనుగ్రహం వల్ల రుక్మిణీ దేవి ఓ శుభమూహూర్తంలో గర్భవతి అయింది.
తొమ్మిది నెలలు నిండాక పండండి బిడ్డడిని కనింది. తనకు కుమారుడు పుట్టాడని రుక్మిణీదేవి ఎంతో సంతోషించింది. రుక్మిణీకృష్ణులు ఊరంతా కుమారోదయం జరిగిందని వేడుకలు చేస్తున్నారు.
***
ఆ విషయం తెలుసుకొంది రతీదేవి. వెంటనే తన భర్తను తానే కాపాడుకోదలిచి శంబరాసురుని దగ్గరకు వెళ్లింది. తాను ఒంటరిగా ఉన్నానని గౌరవప్రదంగా నీతిగా జీవించాలనుకొంటున్నానని తనకు ఏదైనా ఉపాధిని చూపించమని అడిగింది.
శంబరాసురుడు ఆమె కథ విని నీవు ఏమి పని చేయగలవో చెప్పుమని అడిగాడు.

- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి