డైలీ సీరియల్

..మృత్యువు దూరమయినట్లేనా? (ప్రద్యుమ్నుడు -2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాను వంటలు బాగా చేస్తానని తనకు వంట పనిని అప్పగించమని చెప్పింది. శంబరాసురుడు మాయావతి పేరుతో ఉన్న రతీదేవికి తన వంటశాలలో ఉపాధి కలిగించాడు. కాలం నెమ్మదిగా సాగుతోంది.
***
అంగరంగ వైభోగంగా కృష్ణుడు నగరమంతా పందిళ్లు వేయించి రంగురంగు పుష్పమాలికతో నగరాన్ని అలంకరించి తన కుమారుని జనన వేడుకలను జరిపిస్తున్నాడు.
పొత్తిళ్లలో పసిపాపడు అందగాళ్లకే అందంగా ఉన్నాడు. శిశువును చూడడానికి వచ్చినవాళ్లు రుక్మిణీ అందం అంతా కుమారుడికి వచ్చింది అంటూ ముద్దులు కురిపిస్తున్నారు. మరికొందరు కృష్ణుడు చాలా నేర్పరి, అందగాడు ఆయన అందం, అమ్మ చూడబోతే కుసుమకోమల సౌందర్యవతి ఈ ఇద్దరి అందాలను పుణికి పుచ్చుకుని మరీ అందంగా పుట్టాడీ బాలుడు అని ఎత్తుకుని ముద్దాడుతున్నారు.
వచ్చిన వారంతా రుక్మిణీ పుత్రుని గురించే మాట్లాడుతున్నారు.
రుక్మిణి తన కొడుకు అందాన్ని చూసుకొని ఎంతో సంతోషించింది. కృష్ణుని ప్రతిరూపుగా ఉన్నాడనుకొంటూ అందరి దిష్టి తగులుతుంది అనుకొని బాలుడికి దిష్టి తీసేయించింది.
రుక్మీణీకృష్ణులు బాలునికి నామకరణాది ఉత్సవాలు జరిపించారు. ప్రద్యుమ్నుడన్న పేరుపెట్టారు. ఇల్లంతా బంధువులు, స్నేహితులతో నిండిపోయింది. ఎక్కడ చూసినా జనం తండోపతండాలు వస్తూనే ఉన్నారు. ప్రద్యుమ్నుని చూసి ఆనందం తో ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు.
రుక్మిణీ కృష్ణులిద్దరూ ఆ బంధువుల హాడావుడిలో ఉన్నారు. బుజ్జివాని దగ్గర ఎవరూ లేని సమయం కోసం శంబరాసురుడు ఎదురుచూస్తున్నాడు.
ఆ సమయం వచ్చేసింది. పెనుగాలిలాగా విసురుగా వచ్చి ఊయల్లో పడుకుని నిద్రపోతున్న చిట్టి పాపడిని తీసుకొని వచ్చినంత వేగంగా శంబరాసురుడు అక్కడ నుంచి పారిపోయాడు. వీని వల్లనే నాకు ప్రాణాపాయం కనుక వీడిని కళ్లు తెరవకముందే చంపేస్తే ఇక నాకు ఏ బాధ ఉండదు అనుకొన్నాడు శంబరాసురుడు.
ఏ విధంగా ఈ పిల్లవాడిని చంపేయాలి అని ఆలోచించి ఆలోచించి చివరకు సముద్రంలో పడవేస్తే చేపలు, తిమింగలాలు తినేస్తాయి. రూపు లేకుండా పోతాడు అనుకొని అది పనిగా రూపుతెచ్చుకున్న అనంగుడిని సముద్రంలో పారేశాడు శంబరాసురుడు.
ఆ తరువాత హాయిగా మనస్థిమితంగా వెళ్లిపోయాడు. తన మృత్యువును తానే సంహరించివేశానని అనుకొని మనస్థిమితంగా హాయిగా శంబరాసురుడు తన నగరానికి వెళ్లిపోయాడు.
***
సముద్రం చేరిన ప్రద్యుముడిని ఒక పెద్ద చేప ఆహారం అనుకొని మింగేసింది. ఆ నగరంలో ఉండే జాలర్లు చేపలు పట్టడానికి సముద్రానికి వెళ్లారు. వారికి వారి వలల్లో ఈ ప్రద్యుమ్నుడిని మింగేసిన చేప దొరికింది. వారు దాన్ని చూసి చాలా పెద్దదిగా ఉంది. దీన్ని బజారులో అమ్మినా ఏమి ప్రయోజనం ఉండదు. దీనితో ఏమి చేస్తే లాభం బాగుంటుందా అని ఆలోచనలో పడ్డారు.

- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి