డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-7

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘గోడ్బోలే! నీవిక వెళ్లు. మరో విషయం - నాకెందుకో నిరీక్షణానంద స్వామి వారి ఆశ్రమంలో ఏద జరుగకూడనిది జరుగ బోతున్నదని తోస్తున్నదయ్యా!’’
‘‘అంటే ఏమిటి స్వామీ?’’
‘‘ఏమో తెలియడం లేదు. ఏదో అపశకునం కన్పడుతున్నది. సరే నీవు వెళ్లు’’
గోడ్బోలే బేగంబజార్‌కు వచ్చి చేవెళ్ళ స్థలం కొనవద్దని తంగిరాల సిద్ధాంతి గారు చెప్పినట్లు చెప్పాడు. అక్కడ దయ్యాలు ఉన్నమాట వాస్తవమేనని ఆయన నిర్ధారించారు.
‘‘స్వయంగా నా కళ్లతో నేను చూచాను. సిద్ధాంతి గారు భూతవైద్యం చేస్తున్నాడు’’
దీపక్ చంద్ ‘‘సరే అలాగే చేద్దాం’’ అని ఊరుకున్నాడు.
ఆ తర్వాత కొద్దిరోజులకే నిరీక్షణానంద స్వామివారి ఆశ్రమంలోని సెక్రటరీని దయ్యాలు పీక్కు తిన్నాయని వార్త వచ్చింది.
గోడ్బోలే దిగ్భ్రాంతుడైనాడు. ‘‘ఈ తంగిరాల సిద్ధాంతి నిజంగానే త్రికాలజ్ఞుడు. తాను వెళ్లి హెచ్చరించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదు.
ఐనా ఏమని చెప్పగలడు? సిద్ధాంతి తనకు ఏదో సూచనప్రాయంగా చెప్పాడే కాని ఏం జరుగబోతున్నదో చెప్పలేదు కదా!’’
ఆశ్రమంలో పోలీసుల ఎంక్వైరీ జరిగింది. వారికీ ఎటువంటి సాక్ష్యాధారాలు లభించలేదు.
ఎవరు చంపారో తెలియటం లేదు. కాకుంటే పోలీసు డిపార్ట్‌మెంటు ఇది దయ్యాలు చేసిన పని అని నమ్మడానికి సుముఖంగా లేదు. మరి ఎవరు చేసినట్లు? ఎందుకు చేసినట్లు?
*****
బేగంబజార్, మహారాజ్ గంజ్, పత్తర్‌గట్టి, జాంబాగ్ ప్రాంతాల్లో ఎన్నో వ్యాపార సంస్థలున్నాయి. ఇందులో రాజస్థానీలు, గుజరాతీలు, ముస్లిములు, మహారాష్ట్రులు కీలక పాత్ర పోషిస్తున్నారు.
వివేకవర్ధని వంటి విద్యాసంస్థలను మహారాష్ట్రులు స్థాపించారు. వీరిపై ఆర్య సమాజం ప్రభావం ఉంది. ఇక జాంబాగ్‌లో పూలు, పండ్ల వ్యాపారం చేసేవారిలో ఎక్కువమంది. చార్మినార్ పరిసర ప్రాంతాలకు చెందిన ముస్లిములు ఇక్కడ తోపుడుబండి నడుపుకునేవారు, సైకిళ్ల మీద, ట్రాలీల మీద వ్యాపారాలు చేసుకునేవారూ పెద్ద సంఖ్యలో ఉన్నారు. ట్రేడ్ యూనియన్ ఉద్యమనాయకులు రాజబహదూర్ గౌడ్, మఖ్దూం మొహియుద్దీన్ వంటివారు ప్రపంచ కార్మికులంతా ఒక్కటే. పోరాడితే మనకు పోయేదేమీ లేదు సంకెళ్లు తప్ప అంటూ ఉద్యమాలు నడిపారు. పేదవాడికి కులం లేదు, మతం లేదు, జాతిలేదు, స్ర్తి పురుష లింగభేదం లేదు. ఉన్నది ఒక ఆర్థిక అసమానతయే అని సిద్ధాంతీకరించారు. ఈ ఉద్యమం బెంగాల్, కేరళలో, విజయవాడలో, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో బలంగా ఉంది.
1948లో పోలీసు చర్య తర్వాత హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం అయింది. అప్పటికి తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వారీ, భూస్వామ్య వ్యవస్థ ఉండేది. ఒక్కొక్క భూస్వామికి వెయ్యి ఎకరాల భూమి ఉంటే ఆ పొలాల గట్టు మీద నిరుపేదలు గుడిసెలు వేసుకొని ఉండేవారు. ఈ ఆర్థిక అంతరాల కారణం ఏమిటి? అంటే తంగిరాల శ్రీరామకృష్ణ పూర్వజన్మ కర్మ అని చెప్పేవాడు. ఈ కర్మ సిద్ధాంతాన్ని ఆధునిక మార్క్సిస్టులు సవాలు చేశారు. శ్రమజీవుల రాజ్యం తీసుకురావాలని వారు దేశవ్యాప్తంగా పోరాటాలు మొదలుపెట్టారు.
బేగంబజార్‌లోని ట్రేడ్ యూనియన్ నాయకులు దీపక్‌చంద్ దగ్గరికి వచ్చి తాము ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో సభలు జరుపబోతున్నట్లు చెప్పారు.
‘‘సంతోషం! నా వంతు విరాళం తీసుకొని వెళ్లండి’’ అన్నాడు దీపక్‌చంద్.
‘‘మీరు సభలకు వచ్చి మీ సందేశం ఇవ్వాలి’’ అని కోరారు.
‘‘నేను రాను. నాకు ఉపన్యాసాలు చేయడం చేతకాదు. నా దగ్గర విశ్వనాథ్ గోడ్బోలే అనే గుమాస్తా ఉన్నాడు. అతనిని తీసుకుపొండి’’ అన్నాడు దీపక్‌చంద్.
వాళ్లు సరేనని ఒప్పుకున్నారు.
ఎందుకంటే ట్రేడ్‌యూనియన్ సభల్లో పెట్టుబడిదారులకన్నా గుమాస్తాలు, నౌకర్లు, తోపుడుబండి వ్యాపారులు ఉండటమే సముచితంగా ఉంటుంది.
‘‘గోడ్బోలే! నిన్ను వక్తగా కరపత్రంలో వేస్తున్నాము’’ అన్నారు నాయకులు.
‘నా ముఖం వక్తృత్వం!నేను ఉపన్యాసాలివ్వలేను. కావాలనుకుంటే మా పార్థును తీసుకొని పొండి’’ అన్నాడు గోడ్బోలే.
నాయకులు ఆలోచించారు. పార్థూ యువకుడు. ఇలాంటివారిని తాము ఉద్యమాలకు ఆకర్షిస్తే భవిష్యత్తులో ప్రయోజనం ఉంటుంది. అందుకని గోడ్బోలే పేరు, పార్థూ పేరు కూడా వేశారు.
సభలకు బాగానే వర్కర్లు వచ్చారు. ఎగిరిందోయ్! ఎగిరిందోయ్ ఎర్రెర్ర జెండా! అంటూ ప్రచార గీతాలు పాడారు.
ఆ తర్వాత గోడ్బోలే మాట్లా డాడు.
హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ భేదాలు లేకుండా అందరూ భారతజాతి అభివృద్ధి కోసం కృషి చేయాలి అని చెప్పాడు. పేదవారు అన్ని మతాలల్లోనూ ఉంటారు. అన్ని కులాలల్లోనూ ఉంటారు. శ్రీలంకలో ఉన్నా, శ్రీనగర్‌లో ఉన్నా పేదవాడు పేదవాడే’’ అని విశ్వనాథ్ గోడ్బోలే చెప్పాడు.
మానవునికి ఆర్థిక శక్తులతో పాటు ఆధ్యాత్మిక శక్తులు కూడా కావాలని చెప్పాడు. దీపక్‌చంద్ నుండి తాను చాలా నేర్చుకున్నానని ఆయన జీవితం ఆదర్శం అని చెప్పాడు.
మనిషి అంటే కేవలం డబ్బు మేసే జంతువు కాదు. అతనికి నైతిక విలువలు విశ్వమానవ దృక్పథం ఉండాలని చెప్పాడు. సంఘర్షణ వలన కాక సమన్వయంతో మానవులు జీవించాలని గోడ్బోలే బోధించాడు.
- ఇంకా ఉంది

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలా చక్రవర్తి