డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘్భక్త తపస్వి. అందువలన ఋషులు, యోగులు మాట అంటే చాలు అది వరమో శాపమో అవుతుందని మన పురాణాలు చెబుతున్నాయి’’ అని తంగిరాలవారు ఉదంకోపాఖ్యానంలో -
‘‘నిండు మనంబు నవ్యనవనీత సమానము’’ అని నన్నయభట్టు వ్రాసిన పద్యం చదివాడు.
పార్థు ఇలా అన్నాడు -
‘‘సిద్ధాంతిగారూ! ఇలా కాదు. కథలో మంచి సస్పెన్సు ఉండాలి. రేప్ ఉండాలి. కొరకంచులు (కాగడాలు) పట్టుకొని ఊరేగుతారే అలాంటి కథలుండాలి. లేకుంటే బాలీవుడ్ సినిమాలకు పనికిరావు. లేదా హాస్పిటల్‌లో బిడ్డ తారుమారు కావాలి. దొంగ కొడుకు జడ్జి కావాలి. జడ్జి కొడుకు దొంగ కావాలి. రొట్టె దొంగిలించిన నేరానికి ఒకణ్ణి జైలులో పెట్టినట్లు చూపించాలి.’’
‘‘పార్థూ! అన్ని కథలూ నీవే చెప్పావు. ఇక నేను ఏమీ చెప్పనక్కరలేదు. హిందీలో రాజ్ కపూర్, నర్గిస్‌లతో తీసిన సినిమా కథలు చాలా ఉన్నాయి. వాటినే మార్చి మార్చి మళ్లీ సినిమా తీసుకోండి, పొండి’’ అన్నాడు సిద్ధాంతి.
‘‘సిద్ధాంతి గారూ! పార్థుమీద కోపగించుకోకండి. ఏదైనా దయ్యం కథ చెప్పండి.’’
తంగిరాల శ్రీరామశర్మ ఒక దయ్యం కథ చెప్పాడు.
‘‘ఒకామె కాపురానికి వచ్చింది. ఆమెను కట్నం తీసుకొని రావలసిం దిగా భర్త సతాయిస్తున్నాడు. ఆమె తండ్రి మహమూద్ పేదవాడు. ఏవో కూరలు, పండ్లు అమ్ముకొనే వ్యాపారం చేసుకుంటాడు. అందుకని వీరు అడిగినంత డబ్బు మళ్లీ మళ్లీ ఇవ్వలేకపోయాడు. దానితో షాజహానా మీద ఇంట్లో వారికి కోపం వచ్చింది. అమ్మాయికి సైతాన్ పట్టిందని జనాలను నమ్మించారు. దానితో షాజహానా తల్లిదండ్రులు ఆ అమ్మాయి ని నా దగ్గరికి తీసుకు వచ్చారు. నాకు అసలు సంగతి అర్థమై పోయింది.
సరేనని ఆ అమ్మాయికి భూతవైద్యం చేశాను. చేశానా అంటే చేయలేదు. చేయలేదా అంటే చేశాను.
తద్వారా ఇలా చెప్పాను
‘దయ్యం షాజహానాను వదలి ఆమె అత్తగారిని పట్టుకుంది. జాగ్రత్తగా ఉండండి’ అని చెప్పి పంపాను.’’
విశ్వనాథ్ గోడ్బోలే పెద్దగా నవ్వాడు.
‘‘ఈ కథ సినిమాకు పనికి వస్తుంది కాని ఇందులో నాలాంటి వారికి హీరోయిజం చూపే అవకాశం లేదు కదా!’’ అన్నాడు పార్థు.
‘‘దానిదేముంది? దయ్యం పాత్రను పెంచుదాము. నీవే దయ్యంలాగా గెంతవచ్చు. అంటే ఈ సినిమాలో హీరో దయ్య మన్నమాట!’’
దీపక్‌చంద్ గారి సుపుత్రునికి ఈ కథ నచ్చినట్లే ఉంది.
అప్పుడు విశ్వనాథ్ గోడ్బోలే ఇలా అన్నాడు -
‘‘సిద్ధాంతి గారూ! ఏదైనా సామాజిక స్పృహ గల కథ చెప్పండి, వినాలని వుంది’’
‘‘అలాగే విను! అనగనగా బజ్జి అనే ఓ కార్మికుడు మాల్దాలో పనిచేస్తూ ఉండేవాడు. అతనికి చంద్రావతి అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది.
అతడి తల్లిదండ్రులు సంతోషించారు.
వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇంటిని సర్వాంగసుం దరంగా అలంకరించారు. రంగుల ముగ్గులు పెట్టారు, తోరణాలు కట్టారు.
బంధుమిత్రులందరికీ ఆహ్వానాలు పం పారు.విందుభోజనాలకు కాటరింగ్ సర్వీస్‌కు చెప్పారు.
చంద్రావతిని మెహందీ (గోరింటాకు)తో అలంకరించారు. ఆమెకు నగలు కొన్నారు. తమ స్థాయికి తగ్గట్లే కొత్త బట్టలు ఖరీదు చేశారు. కళ్యాణమంటపం బుక్ చేశారు.
చంద్రావతి తన స్నేహితురాలు రేష్మాతో కలిసి దేవాలయానికి వెళ్లింది. అక్కడ పూజా దికములు నిర్వహించింది. రేష్మా చంద్రావతితో పరాచికాలాడుతున్నది. నర్మగర్భోక్తులతో రేష్మా చంద్రావతిని ఉత్సాహ పరుస్తున్నది.
ఉద్రేక పరుస్తున్నది.
గుడిలో పూజాపాఠం ముగిసిన తర్వాత ఓ ఆటోలో చంద్రావతి, రేష్మా ఇంటికి బయలు దేరారు. ఆటో కొద్ది దూరం పోగానే ఆగి పోయింది.
‘‘గ్యాస్ అయిపోయింది మేడమ్!’’ అన్నాడు డ్రైవర్.
‘‘మరేం చేయాలి?’’
‘‘నడుచుకుంటూ పొండి’’
రేష్మా డ్రైవర్‌తో దెబ్బలాటకు దిగింది.
చూస్తుండగానే చీకట్లో ఎవరో నలుగురు పరుగెత్తుకుంటూ వచ్చి చంద్రావతిని, రేష్మాను అవతలి చెట్ల చాటుకు లాక్కుపోయారు. ఏవేవో ఆర్తనాదాలు ‘రక్షించండి రక్షించండి’ అనే కేకలు. ఐనా ఎవరూ కాపాడడానికి రాలేదు.
రాత్రి చంద్రావతి కుటుంబానికి కాళరాత్రిగా మారింది.
ఆ మరునాడు చంద్రావతి కళావిహీనంగా చెట్టుపక్క గుట్టల వద్ద పడి ఉంది. రేష్మా ఏమయిందో తెలియదు.
మరునాడు వీరి తల్లిదండ్రులు పోలీసు రిపోర్టు ఇచ్చారు. పోలీసులు ఎంక్వైరీ మొదలుపెట్టారు.
డ్రైవర్ ఖురేషీని అరెస్టు చేశారు.
అతడు తన నిస్సహాయతను ప్రకటించాడు.
ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేశారు.
ఈ దుర్మార్గం ఇబ్రహీం ముఠాయే చేసి ఉంటుంది అని చెప్పాడు ఖురేషీ.
బండిలో జసిత కర్కట్టే (జార్ఖండ్) రచించిన అంగోర్ అనే పుస్తకం లభించింది. ఇది ఆ ప్రాంతానికి చెందిన చైనా ప్రేరేపిత ఉగ్రవాదుల సాహిత్యం’’
అంటే ఈ పని చేసింది మావోయిష్టులు అని పోలీసులు అభిప్రాయపడ్డారు. ఐతే బెంగాల్ రాష్ట్రంలో కమ్యూనిస్టు ప్రభుత్వం అధికారం లో ఉంది. వారు పోలీసు అధికారు లకు ముందుగానే స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఎవరైనా వామపక్ష కార్యకర్త ఏదైనా పొరపాట్లు చేస్తే వారి మీద ఎంక్వైరీ చేయవద్దు.
- ఇంకా ఉంది

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలా చక్రవర్తి