డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేసులు నమోదు చేయవద్దు. ఏదో నాలుగు రోజులు హడావుడి ఉంటుంది. ఆ తర్వాత నేరం ప్రజలు మరిచిపోతారు’’ అని చెప్పారు.
చంద్రావతి విషయంలోనూ ఇలాగే జరిగింది. రెండు మూడు రోజులు పత్రికలలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత షరామామూలే. కేసులు లేవు, ఎంక్వైరీ లేదు. ఇబ్రహీం ముఠా ఏమైందో తెలియదు. కొన్నాళ్ల తర్వాత ఖురేషీ బెయిల్ మీద విడుదల అయినాడు. చంద్రావతి ఆత్మహత్య చేసుకుంది. రేష్మా ఏమయిందో నాటికీ నేటికీ తెలియదు. ఇట్లా ఈ విషాదగాధ ముగిసింది’’.
తంగిరాల శ్రీరామశర్మ కథను ముగించాడు.
‘‘మీ కల్పన చాలా బాగుంది’’ అన్నాడు పార్థు.
‘‘ఇది కల్పన కాదు. నిజంగా జరిగిన కథయే. ఇలాంటివి చాలా ఉన్నాయి. కొన్ని వెలుగులోకి వస్తాయి మరికొన్ని రావు.
అంతా రాజకీయ పద్మవ్యూహం. ఇదొక దౌర్భాగ్యపు సమాజం. ఎవ్వడూ అదుపు చేయలేకపోతున్నాడు. ప్రతివాడూ కర్మసిద్ధాం తం నమ్ముకొని ‘సంభవామి యుగే యుగే’ అంటూ ఎవడో అవతరిస్తాడని, ఏదో సహాయం చేస్తాడని ఎదురుచూస్తూ మోసపోతూ ఉంటాడు.
చిన్నసేటూ! ఇలాంటి ఎదురుచూపులు అన్ని మతాల్లోనూ ఉన్నాయి. క్రైస్తవులు ఏసు ప్రభువు మళ్ళీ అవతరిస్తాడని, రెండువేల సంవత్సరాలుగా ఎదురుచూస్తూనే ఉన్నారు. ముస్లిములు మళ్లీ మహమ్మద్ ప్రవక్త వచ్చి వాహిబ్ (్ధ్యన) సామ్రాజ్యం నిర్మిస్తాడని నమ్ముతున్నారు.
‘యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్’’
పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే’’
ఈ శ్లోకాలను హిందువులు చాలా శతాబ్దాలుగా నమ్మి మోసపోయారు.
ఫలితంగా జాతిలో పురుష ప్రయత్నం నశించింది. ఎవడో వచ్చి మనలను కాపాడ తాడనే దుర్మార్గ ఆలోచన జాతి నరనరాల్లోను ప్రవేశించింది’’
‘‘పక్కింట్లో పుట్టాలి వీరశివాజీ
పప్పన్నం భుజించాలి మా చిన్నారి’’ అని ప్రతి తల్లి ప్రతి తండ్రీ అనుకుంటున్నారు సిద్ధాంతిగారూ’’ అన్నాడు పార్థు.
విశ్వనాథ్ గోడ్బోలే నిట్టూర్చాడు.
అహింస, సత్యం, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం - యమనియమ ప్రాణాయామ ప్రత్యాహారధారణ సమాధినిష్ఠులు-
అతిమనోబుధ్యహంకృతులౌనిషదులాత్తగండూషికత్రయులు
ఔర్వవహ్ని గర్భితాంతః తపస్వులు - ఋషులు ఋషికలు.
ఒకనాడు ఈ భూమిలో యజ్ఞాగ్నులు వెలిగేవి.
గోపూజ జరిగేది.
వేదర్షులు సహనావవతు మంత్రాక్షరాలతో విశ్వశాంతి పారావతాలు, ఐరావతాలు దశదిశలా ప్రయాణం చేసేవి.
దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. కాని ఋతంభరత్వం నితాంత సత్వం - దేవునికన్నా మిన్న అయిన ఋషిపుత్రుల పాదస్పర్శతో ఈ శాద్వలవాటికలు పరవశించి పులకించి పలుకరించేవి.
శాంతి, సహనం, త్యాగం, దయ, ప్రేమ, సమన్వయం, కరుణ వంటి సాత్వికగుణ సంపత్తితో శిష్టులు, విశిష్టులు వశిష్టులు గాధేయులు నచికేతులు కపిలురు సాంఖ్యాయనులూ గౌతములూ శాక్యము నులూ త్రిశరణ తీర్థంకరులూ శివంకరులూ భూమిని పున్నమిగా మార్చారు. స్వర్గాన్ని భూమార్గం పట్టించారు. అలాంటి రత్నగర్భ యోగభూమి త్యాగభూమి మాతృభూమి దేవభూమిలో ఈ వికలశకల కరాళ ధ్వనులెక్కడివి?
ఎందుకు దర్భలు జ్వలించడం లేదు?
ఎందుకు హవిస్సు ఫలించడం లేదు?
ఏవీ ఆనాటి శిరీషకుసుమపేశల సుధామ యోక్తులు? ఏవీ కాళిదాసభాసవ్యాసవాల్మీక శుకపికాలాపాలు?
ఎవరు చేసిన పాపమిది?
ఎవరు పెట్టిన శాపమిది?
స్వయంకృతాపరాధం కొంత, శత్రుపదాహతి కొంత-
వెరసి అభాగ్యభారతం - అవైదిక జీవనం’’ శ్రీరామశర్మ నిట్టూర్చాడు.
‘‘ఏదోరుూ ఆ భారతదేశం? ఎక్కడికేగెను ఋగ్వీధి?’’
‘‘మాకు శలవు ఇప్పించండి’’ అన్నాడు.
‘‘మంచిది శుభం కలుగుతుంది’’ అన్నాడు శ్రీరామశర్మ.
దీపక్‌చంద్‌కు బాబాయి మాణిక్ చంద్. ఆయన సాధువుగా మారి ధర్మప్రచారం చేస్తుంటాడు.సికింద్రాబాద్ పారడైజ్ సెంటర్ లో రాజస్థానీ భవన్ ఉంది. అక్కడ మార్వాడీల వివాహ కార్యకలాపాలు, సభలు, సమావేశాలు జరుగుతూ ఉంటాయి.
‘‘మాణిక్ చంద్ మహారాజ్ ధర్మ ప్రవచనాలు అక్కడ ఉన్నాయి’’ అని శ్రీరామశర్మతో పార్థు అన్నాడు.
‘‘అలాగే, వీలైతే వచ్చి వింటాను’’అన్నాడు శ్రీరామశర్మ.
***
సిఐడి అధికారి శ్రీ్ధర్ వచ్చి దీపక్‌చంద్‌ను కలిశాడు.
దీపక్ చంద్ శ్రీ్ధర్‌ను ఆదరించి మిఠాయి పెట్టాడు.
‘‘నేనొక చిన్న పనిమీద వచ్చాను’’ అన్నాడు శ్రీ్ధర్‌జీ.
‘‘మీ పోలీసు అసోసియేషన్ వారి వార్షికోత్సవానికి విరాళం కోసమే కదా!’’ అన్నాడు దీపక్.
‘‘అది కాదు మీ నుండి ఓ సహాయం కావాలి’’
‘‘పోలీసులకు నేను సహాయం చేయగలనా?’’
‘‘తప్పకుండా చేయగలరు. మాకు ఒక సందేశం అందింది. అది కోడ్ లాంగ్వేజీలో ఉంది. దానిని డీకోడ్ చేస్తున్నాము. ఈ విషయంలో మాకొక నమ్మకమైన మనిషి కావాలి’’
‘‘మీరేం చెబుతున్నారో నాకు అర్థం కాలేదు’’
శ్రీ్ధర్ నవ్వి ‘‘నాకు మాత్రం అర్థం అయింది కనుకనా?’’ అని ఒక టెలిగ్రామ్ మెసెజ్‌ని దీపక్‌చంద్‌కు చూపించాడు.
అందులో ఇలా ఉంది.
‘‘పెళ్లి ముహూర్తం నిర్ణయ మైందా?’’
‘‘అయింది. పందొమ్మిదవతేదీ రాత్రి ఏడు గంటలకు’’
‘‘అబ్బాయి సకాలంలో వస్తున్నాడా?’’
‘‘వస్తున్నాడు దుబాయి నుండి’’
‘‘మరి పెళ్లి ఖర్చులు ఎంత? కట్నం ఎంత?’’
‘‘ఖర్చులు పది లక్షలు. కట్నం కోటి రూపాయలు’’
- ఇంకా ఉంది

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలా చక్రవర్తి