డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘పెళ్లికూతురును అలంకరించారా? పెళ్లి తర్వాత ఆమె దుబాయి వెళ్లడానికి వీసా ఏర్పాటు చేశారా?’’’
‘‘ప్రయత్నాలు మొదలైనాయి. అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఏమీ ఆందోళన చెందవద్దు (్ఫకర్ మత్ కరో)’’
ఇదీ సందేశం -
దీపక్‌చంద్ దీనిని చూసి సంతోషపడ్డాడు.
‘‘శుభకార్యం! మనం ఆనందించి ఆశీర్వదించాలి’’ అన్నాడు దీపక్.
‘‘నా పిండాకూడు! ఇది శుభకార్యం కాదు. మారణకార్యం. ఇందులో ఏదో కోడ్‌లాం గ్వేజ్‌లో శత్రువులు సందేశం పంపారు.
ఇక్కడ పెళ్లిముహూర్తం అంటే వారు సృష్టించాలని అనుకుంటున్న విధ్వంసానికి ముహూర్తం. పెళ్లి కొడుకు దుబాయి నుండి వస్తున్నాడు అంటే విధ్వంసకర్త దుబాయి నుండి హైదరాబాద్ పాతబస్తీకి వస్తున్నాడని అర్థం. కట్నం అంటే ఆ విధ్వంసానికి పారితోషికం’’
దీపక్ ఒక్క క్షణం నిశే్చష్టుడై ఉండిపోయాడు.
‘‘ఇదంతా నిజమేనా?’’ అని ప్రశ్నించాడు.
‘‘నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఒక్కొక్కప్పుడు మనల్ని భయపెట్టడానికి ఇలాంటి మెస్సేజ్ విడుదల చేయవచ్చు. ఏమైనా ఎంక్వైరీ చేయడం మా ధర్మం. మా పనిలో మేము ఉన్నాము. ఈ విషయం రహస్యంగా ఉంచండి’’
‘‘అలాగే నేనేమి సహాయం చేయగలను?’’
‘‘మీ పార్థును, విశ్వనాథ్ గోడ్బోలేను మాకు సహాయం చేయాలని చెప్పండి’’
‘‘పార్థు పిల్లవాడు. అస్థిరుడు. విశ్వనాథ్ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో గుమాస్తా. ఈ చిన్నవాళ్లు మీ కెలా సహాయపడగలరు?’’
‘‘రాముడు వారధి కట్టడానికి ఉడుత కూడా సహాయం చేసిందని మనం పురాణాల్లో చదువుకున్నాము. వారు మాకు ఏం సహాయం చేయాలో మేము చెబుతాము. వారిని పిలిపించండి’’
దీపక్‌చంద్ వెంటనే విశ్వనాథ్‌ను, పార్థును పిలిపించాడు. వారికి శ్రీ్ధర్‌ను పరిచయం చేశాడు.
‘చాలా సంతోషం. మీ దగ్గర చాలా సిఐడి ఫైల్సు ఉంటాయి కదా! అందులో అందమైన కథలు చెబితే వాటిని బాలీవుడ్ సినిమాగా మార్చుకుంటాము’’ అన్నాడు పార్థు.
‘‘అలాగే - పాత కథలెందుకు? నీవే హీరోగా కొత్త కథ మొదలుపెట్టు. ఇదిగో టెలిగ్రాం’’ అని శ్రీ్ధర్ తాను తెచ్చిన మెస్సేజ్‌ను పార్థుకు వినిపించాడు.
పార్థు సంతోషపడి ‘‘వివాహ భోజనంబు, వింతైన వంటకంబు’’ అని ఓ సినిమా పాట పాడాడు.
‘‘వివాహం లేదు నా పిండాకూడు లేదు. ఇదంతా కుట్ర’’ అన్నాడు శ్రీ్ధర్.
‘‘అంటే ఏమిటి?’’
‘‘చెపుతాను నా వెంట రండి’’
‘‘వచ్చి ఏం చేయాలి?’’
‘‘అది కూడా చెబుతాము రండి’’ అని విశ్వనాథ్ గోడ్బోలేను, పార్థును శ్రీ్ధర్ తన వెంట తీసుకొని పోయాడు.
దీపక్‌చంద్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు.
ఈ అమాయకులిద్దరూ ఇలాంటి కేసులను ఎలా పరిష్కరించగలరో దీపక్‌చంద్‌కు అర్థం కాలేదు.
*****
మాణిక్ చంద్ ధర్మప్రసంగానికి పెద్ద సంఖ్యలో సికిందరాబాద్ నుండి భక్తులు వచ్చారు. వారిలో మార్వాడీలు, జైనమతస్థులు అధికంగా ఉన్నారు. దీపక్‌చంద్ తంగిరాల శ్రీరామశర్మ, విశ్వనాథ్ గోడ్బోలే సతీసమేతంగా వచ్చారు.
మాణిక్‌చంద్ మహరాజ్ చేసినది ఒక నైతిక ప్రసంగం. ఆయనకు హిందీ, రాజస్థానీ, ఇంగ్లీషు కూడా వచ్చు. మధ్య మధ్య ఆంగ్లం నుండి కొటేషన్లు ఇస్తుంటాడు.
హిరో క్లిటస్ అనే గ్రీకుతత్త్త్వవేత్త అన్నాడట ‘‘నీవు జీవితకాలంలో ఒక నదిలో ఒకసారి కూడా స్నానం చేయలేవు. ఎందుకంటే నీవు కాళ్లు పెట్టినప్పుడు ఉన్న నది వేరు, చేతులు పెట్టినప్పుడున్న నది వేరు. తల పెట్టినప్పుడున్న నది వేరు’’ అని. అంటే ఇది జగత్తులోని పరిణామ తత్త్వాన్ని ప్రతిపాదిస్తున్నది. మిస్టిక్ ఈజ్ నెక్ట్స్ టు అబ్జల్యూట్ అన్నాడు.
బెస్ట్ రైటింగ్ ఈజ్ నెక్ట్స్ టు బెస్ట్ యాక్షన్ అన్నాడు కీట్స్.
ఇలా సందర్భోచితంగా మాణిక్‌చంద్ తన ప్రసంగాన్ని జాతీయ, అంతర్జాతీయ వేదికలకు పనికి వచ్చేటట్లు తీర్చిదిద్దుకున్నాడు.
జైనమతం ప్రధానంగా ప్రకృతిని అంగీకరిస్తుంది. జీవుణ్ణి అంగీకరిస్తుంది. కానీ ప్రకృతి పరిణామానికి ఈశ్వరుడే కారణం అని ఒప్పుకోదు. అంటే ప్రకృతి స్వయసిద్ధమైన జలయంత్రమా? (ఆటోమోషన్)?
మాణిక్‌చంద్ మహారాజ్ ప్రసంగం అందరికీ నచ్చింది. తంగిరాల శ్రీరామశర్మ సిద్ధాంతికి తప్ప.
ఎందుకంటే శ్రీరామశర్మ శ్రుతి ప్రామాణ్యాన్ని నమ్మినవాడు. వేదములు ఈశ్వరుని యొక్క నిత్యత్వాన్ని ప్రతిపాదించాయి. ఈశ్వరుడు ఆనీపోటెంట్ అమీసెంట్ అండ్ అనీ ప్రజెంట్.
ఐతే మర్యాద కోసం శ్రీరామశర్మ ఎట్టి వాగ్వివాదానికి దిగలేదు.
మాణిక్‌చంద్ మధ్య మధ్య చిన్న చిన్న పిట్టకథలు చెప్పాడు. అవి విశ్వనాథ్ గోడ్బోలేను బాగా ఆకర్షించాయి.
అందులో ఒకటి అందరికీ తెలిసినదే.
గౌతమ బుద్ధుడు - మిరియాలు కథ.
ఒక తల్లి తన కుమారుణ్ణి బ్రతికించవలసినదిగా గౌతముని వద్దకు వెళ్తుంది.
‘‘అమ్మా! ఒక గరిటెడు మిరియాలు దుఃఖం లేని వారింటి నుండి తీసుకొనిరా!’’ అని చెప్పాడు గౌతముడు.
ఆమె ఎక్కడికి వెళ్లినా దుఃఖం లేదు అనే మాట వినపడలేదు. రిక్తహస్తాలతో ఆ మహిళ తిరిగి వచ్చింది. అప్పుడు గౌతముడు ఆమెతో ఇలా అన్నాడు.
‘‘నీకు ప్రపంచం దుఃఖమయం అని నిరూపించేం దుకే ఇలా చేశాను. అంతేకాని నీ కొడుకును ఎవరూ బ్రతికించ లేరు’’
జైనులు అహింసా వ్రతులు. చీమకు దోమలకు కూడా అపకారం చేయరు. దీపంలో పురుగులు పడి చచ్చిపోతాయి అని సంధ్యాసమయానికి ముందే భోజనం చేస్తారు. యుద్ధాలు మాని వ్యవసాయం, వ్యాపారం చేస్తారు. దాదాపు జైనులంతా శాకాహారులే. దీపక్‌చంద్ తన పరివారాన్ని మాణిక్‌చంద్ మహరాజ్‌కు పరిచయం చేశాడు.
- ఇంకా ఉంది

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలా చక్రవర్తి