డైలీ సీరియల్

దారి తప్పిన మనస్సు... (శకుంతల -6)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వామిత్రుడు చిరునవ్వుతో ‘ప్రియా! దేవీ! ఏమిటీ పనులు? ఏదైనా దెబ్బతగిలితే ఏమైపోను. నన్ను చూసి ఎందుకంతగా భయపడుతున్నావు’అన్నాడు.
‘లేదు లేదు స్వామీ మీరు అపారమైన శక్తితో, దృఢదీక్షతో తపోగ్నిలో రగిలిపోతున్నారు. కానీ ఆ దేవేంద్రుడు మీ తపస్సును భగ్నం చేయాలనుకొంటున్నాడు. నన్నూ నియోగిస్తే కాదనలేక ఇటు వచ్చాను. కానీ నాకు మాత్రం మీ దీక్షను భగ్నం చేయాలని లేదు. మీరు నిరభ్యంతరంగా తపస్సు కొనసాగించండి. నేను మీ చెంతకు రాను. కొన్నాళ్లు ఇక్కడే గడిపి తిరిగి వెళ్లిపోతాను. దానితో నేను రాజాజ్ఞను పాటించినట్లు అవుతుంది. మీకు ఏ కీడు చేయకుండా ఉన్నట్టు నా మనస్సు ఆనందిస్తుంది. అంతే స్వామీ మీరు నిశ్చింతగా తపస్సుకు తిరిగి ఉపక్రమించండి ’ అంది.
మేనక మాటలు విన్న విశ్వామిత్రుడు మేనకపై అభిమానాన్ని పెంచుకున్నాడు. దేవేంద్రుని కుట్రలను గర్హించాడు. ఆ సమయంలోనే నాపై కోపాన్ని తెచ్చుకుని నన్ను శపించకండి. మీ అభిమానాన్ని మాత్రమే నేనుకోరుకుంటాను కానీ మీ కోపాన్ని నేను భరించలేను అంది మేనక. ఆ మాటలతో విశ్వామిత్రునిలో అభిమానం కాస్త ప్రేమగా చిగురు తొడిగింది. ‘్భమామణీ నీపై నాకు అణువంత కోపం కూడా లేదు. నీవు నిరభ్యతరంగా ఇక్కడ వసించు. నేను నా తపస్సును కొనసాగిస్తాను. ఆ దేవేంద్రుని గురించి ఆలోచించకు. వాని పని భగవంతుడు చూసుకొంటాడులే. నేను వెళ్తున్నాను. నీవు హాయిగా ప్రకృతి అందాలను చూసి పరవశించుము’ అంటూ విశ్వామిత్రుడు వెనుకకు అడుగులు వేశాడు. కానీ ఆయన మనస్సు మాత్రం మేనకపై నిలిచిపోయింది. దేహాన్ని మాత్రమే తీసుకొని వెళ్లిన విశ్వామిత్రుడు తనతో మనస్సు ఉందనుకొన్నాడు. కాసేపు మంత్ర జపం చేశాడు. మంత్ర పఠనంలో తప్పులు దొర్లుతున్నాయి. ఏకాగ్రత కుదరడంలేదు అనుకొన్నాడు. తిరిగి ఆలోచనలను నియంత్రించుదామనుకొన్నాడు. నియంత్రించాలంటే మంత్రజపం ఒక్కటే మార్గం అని తిరిగి జపం కొనసాగించాడు. కొద్దిసేపు మంత్రమే పఠించాడు. కాని విశ్వామిత్రునిలో మేనకపై నిలిచిన మనస్సు వచ్చి చేరింది. తెలియకుండానే మేనక అందచందాల గురించి ఆలోచనలు వచ్చాయి. ఎంత అందమో ఒక్కసారి స్పృశిస్తే ఎంత బాగుండు అనుకొన్నాడు. స్పృశించినట్లు కలలు కన్నాడు. ఆమె కూడ తన సాన్నిధ్యాన్ని కోరుకుంటోదేమో అనుకొన్నాడు. తన్ను చూసి ఎంత ఆనందించిందో ఆ కళ్లల్లో ఆనందం భయం రెండూ కనిపించాయి, పాపం అమాయకురాలు తన తపస్సు ఏవౌతుందో అనుకొంది. తపస్సు రేపటి నుంచి చేసుకోవచ్చు. మంత్ర పఠనం కూడా రేపట్నుంచి నిరవధికంగా చేసుకోవచ్చు. పాపం ఆ కుసుమ కోమల మూర్తిని అనునయించి వద్దాం ఒకసారి. లేడి కన్నుల వలె నన్ను చూసి భయపడి నాకు కనపడకుండా ఉండాలని పరుగెత్తి వెళ్లుతూ వెళ్లుతూ కొలనులో జారి పడిపోయింది. అయ్యో అక్కడ కొనదేలిన రాళ్లు ఆమె మేనికి గుచ్చుకున్నాయోమో, లేక అక్కడ అడ్డదిడ్డంగా పెరిగిన ముళ్లు, గడ్డి ఆమెను ఎంతబాధించాయో ఒకే ఒకసారి పలుకరించి అనునయించి తనకు ఆమె పై గల అభిమానాన్ని ప్రకటించి భయపడవద్దని అప్యాయంగా చెప్పి తిరిగి వద్దాం ఆపై మన రోజువారి కార్యక్రమాన్ని సజావుగా సాగించవచ్చు. మనస్సును అప్పుడైతే నియంత్రించుకోవచ్చు అనుకొన్నాడు.

- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి