డైలీ సీరియల్

తాపసి ప్రేమకానుక! (శంకుతల -7)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుకొన్నదే తడవుగా లేచాడు. కమండలాన్ని కోలను పక్కను పెట్టాడు.
కోమలి కొలువుకు బయలుదేరాడు. ఇంద్రుడు జరుగుతున్నదంతా చూశాడు. ఇక నేను నిశ్చింతగా ఉండవచ్చు అనుకొన్నాడు. హాయిగా కూర్చున్నాడు.
***
మేనక ఇంకా భయపడుతున్నట్టుగానే నటిస్తూ విశ్వామిత్రుని సాన్నిధ్యం ఎవరైనా కాదనుకొంటారా? కాదనుకొనే వారు అభాగ్యులను తేల్చింది. వద్దు వద్దు మీ తపస్సు కొనసాగించండి అంటూనే విశ్వామిత్రుని మనస్సును తన సొంతం చేసుకొంది. ఇక ఏముంది మేనకా విశ్వామిత్రులు రతికేళీ విలాసాల్లో మునిగి తేలారు.
***
అదిగో ఆ ఘటన వల్లే నాకీ జన్మ లభ్యమైంది. నా తల్లిదండ్రులు మేనకా విశ్వామిత్రులు. నా పుట్టుక తరువాత పదివేల యేండ్లు నా తపస్సు వ్యర్థమైపోయిందనుకొన్న నా తండ్రి నా తల్లిని నన్ను రక్షించమని చెప్పి తపోవాటికకు తరలిపోవడానికి యత్నించాడు. అపుడు మాతల్లి నేను నా పూర్వనివాసానికి వెళ్లాల్సిన దానిని కదా. ఈ శిశువులను శాకుంతలములు పోషిస్తాయిలే విధి ననుసరించి ఈ శిశువు భవిష్యత్తు సాగుతుంది.
అయినా మీ వంటి తపోధనులకు పుట్టిన ఈ శిశువు శాకుంతలములే నా సాకేది అంది. అదిగో అపుడే నా తండ్రి నా భవిష్యత్తును అవలోకించి కణ్వుడు తండ్రి అవుతాడు. ఇక భయమేమీ లేదు. కణ్వుడు వచ్చేవరకు ఈ చిట్టితల్లిని శాకుంతలాలే పెంచి పోషిస్తాయి. కనుకనే శకుంతల అన్న నామాన్ని ధరిస్తుంది అని మా అమ్మకు స్వాంతన కలిగించి ఆయన పూర్వాశ్రమానికి వెళ్లాడు.
నన్ను వదలలేక మాతృప్రేమను పంచి ఇవ్వలేక రాజాజ్ఞకు బద్ధురాలై మా అమ్మ శాకుంతలకు నన్ను అప్పగించి తను ఇంద్రుని అమరావతికి వెళ్లింది.
కాసేపటికి ఈ తండ్రి కణ్వుడు వచ్చి నన్ను తీసుకొని దైవం ఇచ్చిన బిడ్డగా భావించి నన్ను తీసుకొని వచ్చి ఇక్కడే పెంచుకుంటున్నాడు. ఇదే నా గత చరిత్ర అంటూ తన పూర్వచారిత్రాన్నంతా దుష్యంతునికి శకుంతల చెప్పింది.
శకుంతల పూర్వజన్మ వృత్తాంతము విన్న దుష్యంతుడు ఆశ్చర్యమూ ఆనందం పొందాడు. ఒక్క క్షణం తన్ను తాను మరిచిపోయినట్లు ఊరుకున్నాడు. తరువాత దృష్టి మరల్చకుండా శకుంతలనే చూశాడు. భగవంతుడు తనకోసమే సృష్టించినట్లు అపూర్వ లావణ్యవతి కదా ఈమెను నేను వివాహం చేసుకొంటే ఆనందమూ దైవకృప నాపై మెండుగా ఉంటాయి అనుకొన్నాడు. తను చెప్పినదంతా విని మిన్నకుండిపోయిన దుష్యంతుని చూసి శకుంతలకు ఏమి చేయాలో పాలుపోలేదు. తాను చెప్పింది అంతా కథ అనుకొంటున్నాడు. లేక నిజమని అనుకొంటున్నాడు. నిజమో అబద్ధమో తేల్చుకోలేక నన్ను కన్నార్పకుండా చూస్తున్నాడా ఏమిటి అని చూసింది. అయినా దుష్యంతునిలో మార్పు కలుగలేదు. ఏం చేయాలో తోచలేదు శకుంతలకు. లోపలికి వెళ్లి కాసిని చల్లనీళ్లు తీసుకొని వచ్చింది. దుష్యంతునికి ఇచ్చింది.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804