డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-15

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పుడు దీపక్‌చంద్ ఇలా అన్నాడు -
‘‘మన కంపెనీకి ఇలాంటి ఎసైన్‌మెంట్లు ఎప్పుడైనా వచ్చాయా విశ్వనాథ్?’’
‘‘రాలేదండీ! కాని యిలాంటివి బుక్ చేసేవాళ్లున్నారు. వారి వెనుక రౌడీగాంగులు ఉన్నాయి. ఈ విషయం మన బిజినెస్ ఫీల్డులో అనుకుంటున్న విషయమే’’
దీపక్‌చంద్ తల ఊపాడు.
‘‘సరే! శ్రీ్ధర్ అడిగిన సమాచారం రహస్యంగా వారికి అందించు. నీవు చెబుతున్నది రాణీగంజ్ కంపెనీ గురించి కావచ్చు’’
‘‘ఔనండీ!’’
‘‘వాళ్లు కిరాతకులు -
బంజారాహిల్స్‌లో ఒక మసాజ్ సెంటర్ ఉంది. అందులో బ్రోతల్ హవుస్ నడుపుతున్నారు. ఓ కిరాణా దుకాణం ఉంది. అక్కడ దొంగనోట్ల వ్యాపారం జరుగుతుంది. టీ షాప్‌లో డ్రగ్స్ అమ్ముతున్నారు. రహస్యంగా డాలర్లు, పౌండ్లు మారకం చేస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వం చూడవలసిన పనులు. మన మీదికి తెస్తే సాక్ష్యాధారాలతో ఎలా నిరూపించగలము?’’
‘‘మనం తెలిసిన సమాచారం పోలీసుశాఖకు అందిస్తే తప్పేముంది సార్?’’
‘‘పిచ్చివాడా! ఈ వ్యాపారస్థులు పోలీసులకు, రాజకీయవేత్తలకు డబ్బులు ఇవ్వలేరని అనుకుంటు న్నావా? ఇదొక పద్మవ్యూహం’’
విశ్వనాథ్ గోడ్బోలే ఏమీ మాట్లాడలేదు.
‘‘నిన్న చిక్కడపల్లి, వివేకనగర్, నల్లకుంట ప్రాంతాలల్లో వరుస చైన్‌స్నాచింగ్‌లు జరిగాయి. ఆ ముఠాను పట్టుకున్నారు. అయినా వారికి బెయిల్ దొరికింది. అంటే ఈ దొంగతనాల వెనుక పెద్దల హస్తం ఉన్నది తాత్పర్యం. మధ్యప్రదేశ్ చంబల్‌వాలీలో కొందరు బందిపోటు దొంగలున్నారు. వారిని అక్కడి రాజకీయ నాయకులే పోషిస్తున్నారు. వారికి వాటాలుంటాయి. పూర్వం ఈ దుర్మార్గంలేదు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పెచ్చుమీరింది. బ్రిటీషువారి కాలంలో పితూరీలు, అల్లరిమూకలు అణిచివేయ బడ్డాయి’’
విశ్వనాథ్ గోడ్బోలే నిశ్శబ్దంగా వింటున్నాడు.
‘‘విశ్వనాథ్! నా మనస్సు ఏదో కీడు శంకిస్తున్నది. ఏదైనా జరుగరానిది జరుగవచ్చునని అనిపిస్తున్నది. సరే నీవు పోయి పోలీసులు చెప్పిన పని చేయి. ఇంతకూ పార్థు ఎక్కడికి వెళ్లాడు?’’
‘‘తెలియదు సార్’’
విశ్వనాథ్ గోడ్బోలే స్టేషన్ ఘన్‌పూర్ నుండి వస్తున్న గంజాయి బస్తాల విశ్వనాథ్ గోడ్బోలే స్టేషన్ ఘన్‌పూర్ నుండి వస్తున్న గంజాయి బస్తాల వివరాలు తెలుసుకున్నాడు. అక్కడ కొన్ని తాండాలలో పైకి కంది, మొక్కజొన్న పంటలు కన్పడుతాయి. ఆకుల మధ్య గంజాయి సాగు జరుగుతుంది. అక్కడికి ఎవ్వరూ రారు. ఎందుకంటే వాటి సాగు, విక్రయం, ఎగుమతులు అన్నీ రహస్యంగా సాగుతాయి. ఒకటి రెండు సార్లు వరంగల్, విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లలో ఈ మూటలు పట్టుబడ్డాయి. అక్కడి నుండి వారు జాగ్రత్త పడ్డారు. ప్రైవేట్ వాహనాల్లో సీట్ల కింద దాచి పెట్టి పంపుతున్నారు.
ఇక ట్రాన్స్‌పోర్టు కంపెనీల్లో బియ్యం బస్తాల మధ్య గంజాయి దాచి పెట్టి పంపుతున్నారు. ఒకవేళ ఎవరైనా పట్టుకుంటే వారికి ముడుపులు చెల్లిస్తున్నారు. ఇది జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న వ్యాపారం. ఛత్తీస్‌గఢ్ లోతట్టు ప్రాంతాలలో నిరాఘాటకంగా గంజాయి సాగు జరుగుతున్నది.
హైదరాబాద్ ఫిలింనగర్‌లోకి నైజీరియా దేశస్థులు ఎలా ప్రవేశించారు? కొందరు టూరిస్టులుగా, కళాకారులుగా, మరికొందరు విద్యార్థులుగా వచ్చారు. వారు అమ్మే డ్రగ్స్ కోట్లు విలువ చేస్తాయి. కాలేజీ విద్యార్థులకు చాక్‌లెట్ల రూపంలో అందిస్తున్నారు. దీనివలన డబ్బులు రావటంతో పాటు విద్యార్థులను నిర్వీర్యం చేయడం కూడా జరుగుతుంది. అంటే దేశానికి సహజ సంపద మానవ వనరులే. వీరిలో మరొక వివేకానంద, మరొక శ్రీనివాస రామానుజన్ పుట్టకుండా అవుతుంది.
విశ్వనాథ్ గోడ్బోలే తనకు అందిన సమాచారం ముందుగా దీపక్‌చంద్‌కు చెప్పి ఆ తర్వాత పోలీసులకు అందజేశాడు.
నైజీరియన్ల అరెస్టులు కొన్ని జరిగాయి. ఐనా మాదకద్రవ్యాల వ్యాపారం ఆగలేదు.
*****
దీపక్‌చంద్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగింది.
బంధుమిత్రులంతా వచ్చి పూజాదికములు ముగిసిన తర్వాత భోజనం చేసి వెళ్లిపోయారు.
గోడ్బోలే మాత్రం ఉండిపోయాడు.
కార్యక్రమం శ్రీరామశర్మ జరిపించాడు.
ఆయన ఈ వ్రతములు, హోమములు, పూజలు వీటి అంతరార్థం వివరించాడు.
‘‘వ్రతం చేయించడం వలన దేవతలు సంతోషిస్తారు. దేవతలు అంటే పంచభూతములు. అంత రిక్షము, నక్షత్రములు కంటికి కన్పడని అదృశ్యశక్తులు. ఇవన్నీ శాంతిని వర్షిస్తాయి. అంతేకాదు మడి కట్టుకోవడం మంగళస్నానాలు చేయ డం, శుచి శుభ్రతలకు, ఆరోగ్యానికి కారణభూతములు.
మతం పేరుతో మనవాళ్లు ఆరోగ్య సూత్రాలు ఏర్పరిచారు. తెల్లవారు జామున నీళ్లలో విద్యుత్తు ఉంటుంది. అప్పుడు స్నానం చేస్తే మన శరీరంలోకి జలవిద్యుత్తు ప్రవేశి స్తుంది. ఏకాదశి నాడు ఉపవసిస్తే దేహానికి విశ్రాంతి, మనస్సుకు ప్రశాంతి లభిస్తుంది. పండుగనాడు పదిమందికీ భోజనాలు పెడితే సంపద ఒక చోట పోగుపడకుండా అందరికీ వితరణ చేసినట్లవుతుంది. నందికేశ్వర వ్రతం, కేదారేశ్వర వ్రతం ఇలా రకరకాల పేర్లు పెట్టారు. రాజులకు సత్రయాగాలు చేయాలని చెప్పారు. ఋతువులను బట్టి పండుగలు వస్తాయి. సంక్రాంతికి నేతితో చేసిన వేడిపులగం, నువ్వుల ఉండలు అమ్మవారికి నైవేద్యం పెట్టడం దానిని ప్రసాదంగా భుజించడం ఆరోగ్యసూత్రం.
శరత్కాలంలో కౌముదీ మహోత్సవాలు, కావ్యగానాలు ప్రకృతిపూజలో అంతర్భాగమే. లలితా సహస్రనామములలో దేవతకు గారెలు, పులిహోర, పాయసం, కొబ్బరి ముక్కలు ఇలా రకరకాల నైవేద్యాలున్నాయి. ఇవన్నీ ఆయుర్వేద ఔషధాలు. - ఇంకా ఉంది

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలా చక్రవర్తి