డైలీ సీరియల్

తాను మెచ్చింది.. దైవం తలచింది! (శకుంతల -8)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుష్యంతునిలో కదలిక లేకపోవడంతో మీరు ఏమి ఇంతగా ఆలోచిస్తున్నారు అని తానే ప్రశ్నించింది.
అపుడే వింటున్నట్లు త్రుళ్లిపడిన దుష్యంతుడు ‘దేవీ! ఇదంతా నిజమా లేక కలనా అని నాకు అనిపిస్తోంది. నా మనసు ఈ ఆశ్రమంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచినీపై లగ్నం అయింది. నీవేమో బ్రాహ్మణ పుత్రికవు అయి ఉంటావు. నేను తప్పు చేస్తున్నాన్న భావన నన్ను ముందుకు అడుగువేయనీయలేదు. కానీ ఇపుడు నీవు చెప్పిన వృత్తాంతం విన్న తరువాత మనసు ఆగకుండా ఉరకలు వేస్తోంది. దానివల్లనే నేను ఆనందంతో తబ్బిబ్బు అవుతున్నాను. ఇక మన వివాహానికి ఏ అడ్డంకి రాదనుకొంటాను. నేను కణ్వమహర్షిని అభ్యర్థిస్తాను. నా వంశం నిలుపమని దానికోసం నిన్ను నాకిచ్చి పెండ్లి చేయమని కోరుతాను అన్నాడు.
దుష్యంతుని మాటలకు శకుంతలకు సిగ్గువేసింది. ఆమె కళ్లు కిందకు వాలిపోయాయి. తన మనస్సు కూడా ఆ అందగాడినే కోరుకుంటోంది. కానీ దుష్యంతుడు చెప్పినట్లుగా తాను బయటకుచెప్పలేకపోయింది. ఇపుడు ఆ మహారాజే తన్ను చేపడుతానని చెప్పితే ఎంతో ఆనందించింది.
కాని తన తండ్రి ఇపుడు లేడు కదా. ఆయన వచ్చేదాక ఈ మహారాజు ఇక్కడే ఉంటే బాగుండు అనుకొంది.
అందుకోసం బాగా ఆలోచించి మీకు కావల్సిన సదుపాయాలను నేను చూస్తాను అని చెప్పింది.
ఇంకాసేపు వారిద్దరి మధ్య మాటలు సాగాయి. నేను ఇపుడే వస్తాను అని దుష్యంతుడు తన పరివారం దగ్గరకు వెళ్లాడు. అక్కడ తనకోసం చూస్తున్న తన పరివారంతో మీరంతా రాజధానికి వెళ్లిపొండి. ఈ ఆశ్రమంలో మహర్షులవారు లేరు. వారి దర్శనం చేసుకొని నేను రాజధానికి వస్తాను. అప్పటిదాకా మీరంతా కూడా ఇక్కడ ఎందుకు? మీరు రాజధానికి వెళ్లి అక్కడ మీరు చేయవలసిన కార్యక్రమాలను కొనసాగించండి అని చెప్పి వారినంతా రాజధానికి పంపివేశాడు.
తిరిగి శకుంతల దగ్గరకు వచ్చాడు. అపుడు శకుంతల ఆయనకోసం పలు రకాల పండ్లను సిద్ధం చేసింది. వేడి వేడి గా పానీయాలు తయారు చేసింది. ఇన్నింటిని చూసిన దుష్యంతుడు ఈమె నాపై అనురాగంతో ఉంది కనుక నేను గాంధర్వవిధిని పెళ్లిచేసుకొని ఆ తరువాత రాజధానికి వెళ్లి మహర్షులు వచ్చిన తరువాత ఇక్కడకు వచ్చి ఈమె నా రాజాంతఃపురానికి తీసుకొని వెళ్లవచ్చు అనుకొన్నాడు.
స్నానసంధ్యలు నిర్వర్తించి శకుంతల పెట్టిన ఆహారాన్ని ఎంతో ప్రేమగా తిన్నాడు దుష్యంతుడు. వారిద్దరూ చిలుకా గోరింకల్లాగా ఆ ఆశ్రమ తోటలో తిరిగారు. అక్కడ ఉన్న ప్రకృతి వీరిద్దరినీ ఆశీర్వదించింది. చూడచక్కని జంట మీరు సీతారాముల్లా యశస్సును పొందండి అని వనదేవత ఆశీర్వదించింది.
మాటల మధ్యలో తాను ఎంతో రాచకార్యాల్లో ఉన్నానని త్వరగా రాజధానికి వెళ్లాలని దుష్యంతుడు శకుంతలకు చెప్పాడు. మరి మీరు అపుడే వెళ్లిపోతారా అని ఎంతో బాధగా అడుగుతున్న శకుంతలను దగ్గర తీసుకొని లాలించి మనిద్దరమూ ఇపుడు గాంధర్వవిధిని పెళ్లాడుదాము. తరువాత నేను మహర్షుల వారు వచ్చాక వచ్చి విషయాన్ని వివరించి వారి ఆశీర్వాదంతో నిన్ను నా రాజధానికి తీసుకొని వెళ్తాను అని చెప్పాడు.
శకుంతల గాంధర్వం వద్దు అంటూ నిరాకరించింది.

- ఇంకా ఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804