డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్తనిష్టా అంటే అమ్మవారు తేజో రూపంలో ఓజస్సుగా మన రక్తంలోకి ప్రవేశిస్తుంది. పెసరపప్పు పాయసం ఒక ఔషధం. సత్యనారాయణ స్వామి ప్రసాదం మరో ఔషధం.
‘‘అన్ని మతములూ, ధర్మములు సమానమేనా సిద్ధాంతిగారూ?’’
‘‘కావు. ఎవరి మంచిచెడులు వారివే. మనుషులను జంతువులను చంపాలి అంటే మన తెలివి తెల్లవారినట్లే అవుతుంది.
అజ్ఞానం, అహంకారం అక్కాచెల్లెళ్లు.
ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్
ఆధునిక సమాజం సాంకేతికంగా ముందుకు పోయింది. మరి మానవీయమైన విలువల మాటే మిటి? మనిషిలోని మనీషి ఎందుకు అదృశ్యమైనాడు? ఈ దోపిడీలు, హత్యలు, అత్యాచారాలు, వైదిక నింద, తాగుడు, వ్యభిచారం, దొంగతనం, అనార్కీ, సాధువులను హింసించడం, జంతుహింస, వ్ఢ్యౌ మతం పేరుతో మారణ కాండ, మితిమీరిన భోగలాల సత్వం, విశృంఖలత్వం, పరదారా ధనాపహరణం, బాధ్యతా రాహిత్యం, కమ్యూనిజం ఈ దుర్మార్గాలన్నీ మానవ సమాజంలోకి ఎలా ప్రవేశించాయి? ధర్మం పూర్తిగా లుప్తమయింది. కలియుగ ప్రారంభంలో ధర్మధేనువు ఒంటికాలిపై కుంటుతూ ఉండేది. ఇవ్వాళ నాలుగు పాదాలు విరిగిపోవటంతో చతికిలబడింది. అందుకే బ్రతికే ఉన్న గోవును కబేళాకు తరలిస్తున్నారు’’
‘‘్ధర్మాచార్యులు కొందరు అక్కడక్కడా ప్రచారం చేస్తున్నారు కదా స్వామీ!’’
‘‘దీపక్‌చంద్‌గారూ! ఈ ధర్మాచార్యులు అర్థకామములవెంట పడ్డారు. వీరిది మిడిమిడి జ్ఞానం. సృష్టి రహస్యం తెలియదు. ఏవో నాలుగైదు శ్లోకాలు చిలుక పలుకుల్లా వల్లిస్తూ ఉంటారు. వీళ్లు బోధ గురువులు కాదు బాధగురువులు. ఆశ్రమాల పేరుతో వందల ఎకరాల ఫాంహవుసు నిర్మాణం, హెలీప్యాడ్స్, దాస దాసీజనం ఇదొక సన్యాస రాజకీయం!!’’
దీపక్‌చంద్ నవ్వాడు.
‘‘ఐతే ఏం చేయాలంటారు?’’
‘‘కర్తవ్యం చేయాలి అంటాను’’
‘‘సిద్ధాంతి గారూ! నేను ధర్మబద్ధంగానే జీవిస్తున్నాను. ఐనా ఇతరులు మోసం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? నాకీ తత్త్వం బోధపడడం లేదు’’
‘‘దీపక్‌జీ! మీరు రెండు ప్రశ్నలు అడిగారు. మొదటిది మీరు ధార్మికులుగా జీవించినంత మాత్రాన మొత్తం సమాజం ధర్మబద్ధంగా ఉండాలని ఏమీ లేదు కదా! జింక మంచిగా ఉంటే పులి దానిని కబళించదా ఏమిటి? ఇది సృష్ట్ధిర్మం. ఎలుకను పాము తింటుంది. అలా కొన్ని శతాబ్దాలు గడిచాయి. అప్పుడొక ఎలుక తిరుగబడింది. అదే ముంగీసగా మారిందని డార్విన్ అనేవాడు చెప్పాడు. ఐతే ఈ తిరుగుబాటు ఆర్థికపరమైనదిగా కారల్‌మార్క్స్ వ్యాఖ్యానిం చాడు. అందుకే పప్పులో కాలేశాడు. నిన్న పీడితుడిగా ఉన్న వ్యక్తి నాలుగు రాళ్లు సంపాదించుకొన్న వెంటనే బూర్జువా గా మారి తానే సమాజపీడకుడుగా కాపిటలిస్టుగా మారాడు. ఇవ్వాళ చైనా, పాకిస్తానులు ఇలాంటి పరపీడనాదేశాలు. ఒక చోట మతవ్ఢ్యౌం ఉంది. మరొకచోట సామ్యవాద ఫండమెంటలిజం ఉంది. ఒకే బుక్ ఒకే ప్రవక్త ఒకే విముక్తిమార్గం - దీనిని ఫండమెంటలిజం అంటారు. ఇది ఇస్లాంలో, క్రైస్తవంలో, కమ్యూనిజంలో, చివరకు బౌద్ధంలో కూడా ఉంది. హిందువులలో వందలాది దేవీదేవతలు ఉండడానికి కారణం ఇది ఫండమెంటలిస్టు ఆలోచన కాకపోవడమే.’’
దీపక్‌చంద్ కన్నా ఈ వ్యాఖ్యానానికి ఎక్కువగా విశ్వనాథ్ సంతోషించాడు.
‘‘్భన్నత్వంలో ఏకత్వం భారతీయ విశేషత’’ అని చెప్పాడు శ్రీరామశర్మ.
గోడ్బోలే ఇలా అడిగాడు -
‘‘శివశివ అని శ్రీరామ శ్రీరామ అని కోటిసార్లు వ్రాస్తే ముక్తి వస్తుందా?’’
‘‘రాదు. సత్కార్మాచరణ వల్ల మాత్రమే ముక్తి లభిస్తుంది. కాని ఇలా వ్రాయటం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది’’
‘‘మీరు ఇన్ని ధర్మాలు చెబుతున్నారు. మరి మరణాన్ని ఎందుకు జయించలేక పోతున్నాము?’’
‘‘ఎందుకంటే సృష్టిరహస్యం తెలియదు కనుక. కేవలం తెలిసినట్లు మేము నటిస్తున్నాము కనుక. నడుము వంగిన ముసలివాడు, రోగి, మృతజీవి ఇవి గౌతముడు చూసి నివ్వెరపోయాడు. ఏదో ధర్మం బోధించాడు. ఇవ్వాళ్టికి బౌద్ధం పుట్టి రెండు వేల సంవత్సరాలు దాటింది. అంతమాత్రాన జరరుజ మృత్యువు ఆగిపోయాయా? లేదు కదా!
ఇదే సృష్టిక్రమం.
దీనిని అధిగమించినవాడు లేడు.
అవగతం చేసుకున్నవాడు అంతకన్నా లేడు. లేదా నాటకాలే’’
‘‘సిద్ధాంతిగారూ! దయ్యాలు ఉన్నట్లా? లేనట్టా?’’
‘‘కన్పడని సూక్ష్మజీవులు యంత్ర సహాయంతో దర్శిస్తున్నాము. అలాగే అతీంద్రియ శక్తులను కలిగి ఉన్నవారు కంటికి కన్పడని రూపాలను చూస్తారు. కంటికి కన్పడనివన్నీ లేవు అని కాని, ఉన్నవి అని కాని చెప్పలేము’’
‘‘సిద్ధాంతి గారూ! కమ్యూ నిస్టులు ఎందుకంత మందిని చంపుతున్నారు? ఇంత రక్త దాహానికి కారణం ఏమిటి?’’
‘‘అది వారి సిద్ధాంతంలో ఉంది. తుపాకి గొట్టం ద్వారా రాజ్యాధికారం సంపాదించాలని వారు నమ్ముతు న్నారు. ఇంకొక విషయం గమనిం చండి. పరిణామ సిద్ధాంతంలో మనిషి కోతి నుండి వచ్చాడని చెబుతున్నారు. ఐతే మనిషిలో గత జన్మ వాసనలు పోలేదు. అంటే ఇంకా నరావతారంలో పాము లక్షణాలు, పులి లక్షణాలు, నక్క లక్షణాలు మిగిలిపోయాయి. అందుకే మానవకోటిలో జంతు ప్రవృత్తి కన్పడుతున్నది.
భౌతిక మానవుడు సంపదలను కూడబెట్టుకుంటూ ఉంటాడు. అది సహజం. ఆంగ్లంలో ఇన్‌స్టింక్ట్స్ అంటారు. ఇక తేజస్వులైన మానవులు ఒంటిపూట తింటారు. భౌతికావసరాలను తగ్గించుకుంటారు. వీరినే సిద్ధపురుషులు అని అవతారపురుషులు అని కారణజన్ములని ఆధ్యాత్మిక విభూతులు అని పిలుస్తుంటాము’’.

- ఇంకా ఉంది

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలా చక్రవర్తి