డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఇదెలా సాధ్యమవుతుంది?’’
‘‘మానసిక శిక్షణ వల్ల’’
‘మానసిక శిక్షణ ఎలా లభిస్తుంది?’’
‘‘ఒకటి ధ్యానం వలన, రెండు సత్కర్మా చరణం వలన - ధ్యానం, కర్మం ఒకే నాణెమునేకు రెండు ముఖాలు.
‘‘సిద్ధాంతి గారూ! అందరూ భారతీయ ధర్మానే్న ఎందుకు విమర్శిస్తున్నారు?’’
‘‘ఇందుకు రెండు కారణాలు - మొదటిది ఇది రాజకీయ ప్రేరణతో జరుగుతున్నది. ఇండియాను చిన్న చిన్న ముక్కలుగా చేయాలని విదేశీయులు ప్రయత్నిస్తున్నారు. అందుకు యుద్ధాలు చేయటం ఒక పద్ధతి. ఆ పని బ్రిటీషువారు చాలా శతాబ్దాలు చేశారు. అరబ్బులూ, ఫ్రెంచివారూ చేశారు. అంతకంటే ముఖ్యమైనది స్థానిక సంస్కృతిని నిర్మూలించడం. ఈ దేశంలో ప్రజలకు తమ నాగరికత, భాష, మతం, జీవనవిధానం నీచమైనవి అనే భావన కల్గించడం. అందుకోసం ఇండియాపై సాంస్కృతిక పరమైన దాడులు జరిగాయి.
ఇక రెండవ అంశం గంగానది, గంగోత్రిలో పుట్టి కలకత్తా వద్ద గంగాసాగర్ వరకు చేరేలోగా ఎంతో కశ్మలాన్ని తనలో కలుపు కుంటుంది. అలాగే ఒక జాతి జీవనం కూడా ఉంటుంది.
అధ్వరం అంటే యజ్ఞం. ఇది అహింసాత్మకం. అలాంటి యజ్ఞ క్రతువులోకి మేకను బలి ఇవ్వటం ఎలా ప్రవేశించింది? సతీ సహగమనం దారుణమైన దురాచారం. కన్యాశుల్కం, వరశుల్కం అశాస్ర్తియమైనవి. విదేశీయానం చేయకూడదు అన్నారు.
ఇలా భారతీయ సంస్కృతి కుంచించుకొని పోయింది. భక్తి పేరుతో సత్కర్మాచరణ మృగ్యమయింది. ఫలితంగా చిరుతలు పట్టుకొని ఎగిరే వందిమాగధ వైతాళికులు మిగిలిపోయారు. కన్నుల ముందు కన్పడే జగత్తును నిర్లక్ష్యం చేసి మోక్ష పురుషార్థం వెంట పడ్డారు’’
‘‘మరి మరణానంతర జీవితం మాటేమిటి?’’
‘‘నిజమే! కాని ఇహము పరము రెండూ ఉండాలి. దేశభక్తి, దైవభక్తి రెండూ కావాలి. కాని రాజభక్తిని దేశభక్తి అని మన ప్రజలు మధ్యయుగాల్లో భ్రమించారు.’’
గోడ్బోలో, దీపక్‌చంద్ ఈ ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు.
క్షీరసాగరంలో హంసలు విహరిస్తున్నాయే గాని క్షారసాగరంలో కాదు. మామిడిచెట్టు మీద కోయిలలు వాలి మధురగీతాలు ఆలపిస్తాయేకాని వేపచెట్టు మీద కాదు.
మనం ఉదాత్త కార్యాచరణతోనే ఉత్తమ సంస్కారాలు నిర్మింపగలము. హింసతో హంసలు రావు. ఇదే భారతీయ, చైనా జీవన విధానాలలోని ప్రధాన భేదం.’’
‘‘తిరుగుబాటు వలన సామాజిక రుగ్మతలు పరిష్కారం కాజాలవా?’’
‘‘కాజాలవు. ఎప్పుడూ ఆందోళనలు, హింస, అలజడి, అనార్కీ, పోరుబాట, కొట్లాట ఉన్నచోట అభివృద్ధి అసాధ్యం. సంస్కరణ అవసరమే కాని అది ఋషులు చేయాలే కాని రాక్షసులు చేయకూడదు. రాముడు యజ్ఞం చేసినట్లే రావణుడు చేశాడు. బలి చక్రవర్తి బ్రాహ్మణులకు భూరి విరాళాలు ఇచ్చి వశపరచుకొన్నాడు. దానాలు చేసినవారు దేవాలయాలు కట్టించినవారు అంతా ధర్మప్రభువులు కానక్కరలేదు. పాపం చేసినందుకు పరిహారార్థం చేసే దానాలు సాత్వికమైనవి కావు. ప్రతిఫలాపేక్ష లేకుండా చేసే సమాజసేవ, దానధర్మాలే, ఈశ్వరునికి ప్రీతి.
ఇవ్వాళ రౌడీలు రాడికల్స్ అంటూ తీవ్రవాదాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇది మానవాళికి మహమ్మారి లాంటిది.’’
‘‘దేవుడు మంచివాళ్ళను పుట్టించినట్లే చెడ్డవాణ్ణి కూడా పుట్టించాడు కదా స్వామీ!’’
‘‘దీనినే మూర్ఖత్వం అంటారు. పుట్టిం చడం వరకే ప్రకృతి తన పని తాను చేసుకుంటూ పోతున్నది. మంచి చెడులకు ప్రకృతి బాధ్యత లేదు. ఇది వ్యక్తుల స్వీయ సంస్కారాల మీద ఆధారపడి ఉంది. అర్థమయిందా?’’
‘‘ఈ సిద్ధాంతం అంతా నమ్ముతారా?’’
‘‘నమ్మనీ నమ్మకపోనీ- పురుషార్థం వదిలి భరన్యాసం వెంట పడటం అవైదికం’’
***
పోలీస్ కంట్రోల్ రూంలోని ఉన్నతాధికారి జోషీ శ్రీ్ధర్‌ను పిలిచాడు.
శ్రీ్ధర్ సెల్యూట్ చేసి నిలబడ్డాడు.
‘‘సిట్‌డౌన్ బాయ్’’
శ్రీ్ధర్ కూర్చున్నాడు.
అప్పుడు ఉన్నతాధికారి జోషీ శ్రీ్ధర్ చేతికి ఒక మెస్సేజ్ ఇచ్చాడు. అందులో ఏదో సంభాషణ ఉంది.
‘‘గడ్డిమోపులు ఎంతకు కొంటున్నారు?’’
‘‘సరసమైన రేటుకే లభిస్తున్నాయి. మూసీ పక్కన గడ్డి పొలాల నుండి తెప్పిస్తున్నాము’’
‘‘గేదెలకు ఈ గడ్డి సరిపోకపోతే చేవెళ్ల నుండి తెప్పించండి’’
‘‘అలాగే’’
‘‘ఎండుగడ్డికి ఒక రేటు, పచ్చిగడ్డికి మరో రేటు గమనించారా?’’
‘‘గమనించాము. అన్ని సరుకులకు ఒకే రేటు ఉండదు కదా!’’
‘‘గాస్‌మండీలో గడ్డి దొరుకు తుందా?’’
నవ్వు
‘‘గాస్‌మండీలో గడ్డి లేదు. సీతాఫల్‌మండిలో సీతాఫలాలూ లేవు. సైదాబాద్‌లోని సపోటాబాగ్‌లో సపోటాలు లేవు. జాంబాగ్‌లో జామపండ్లూ లేవు. ఊరికే పేర్లు అలా ఉంటాయి. పూర్వమెప్పుడో మండీలు ఉండేవి’’
‘‘జాగ్రత్త’’
మెస్సేజ్ ఓవర్.
‘‘అర్థమయిందా?’’ అధికారి ప్రశ్నించాడు.
శ్రీ్ధర్ ఒక్క క్షణం ఆగి ‘‘ఆ అర్థమయింది సార్. ఈ మెస్సేజ్ దుబాయి నుండి వచ్చింది’’
‘‘అదేరా నాయనా అసలు సంగతి - గోషామహల్‌లో గడ్డి కొనుగోళ్ళకు పశువుల పోషణకు దుబాయికి ఏమిటి సంబంధం? పోనీ ఏదైనా ఫాంహౌస్ ఈ ఓనర్ నడుపుతున్నాడని భావించాలి’’
‘‘ఔను సర్’’
‘‘ఇందులో చేవెళ్ల పేరు వచ్చింది చూచావా?’’
‘‘ఔను సర్’’
- ఇంకా ఉంది

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలా చక్రవర్తి