డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శ్రీ్ధర్! ఈ మొత్తం వ్యవహారం వెనుక చేవెళ్ల ఫాంహౌస్‌కు గోషామహల్‌కు ఏదో సంబంధం ఉంది’’
‘‘సర్’’
‘‘చేవెళ్ల ఫాంహవుస్ దీపక్‌చంద్ ఎందుకు కొనాలని అనుకున్నాడు?’’
శ్రీ్ధర్ వౌనం.
‘‘అంటే దీపక్‌చంద్‌ను దోషిగా భావించవచ్చా?’’
‘‘కష్టం సర్! ఆయన ప్రవర్తనలో ఎట్టి అనుమానాస్పద అంశమూ కన్పడటం లేదు’’
‘‘పోనీ పార్థూను అనుమానించ వచ్చునా?’’
‘‘అతనిపై ఒక కన్ను వేసి ఉంచాము సార్’’
‘‘నిరీక్షణానంద స్వామి ఆశ్రమా నికి దీపక్‌చంద్ వెళ్తుంటాడు. విరాళాలు ఇస్తుంటాడు’’
‘‘దీపక్‌చంద్ ఎన్నో సంస్థలకు విరాళాలు ఇచ్చాడు. హుస్సెనియా ఆలం కమాన్ వద్ద ఓ వికలాంగుల పాఠశాల వాళ్ళ నాన్నగారు రతన్‌సింగ్ పేరు మీద నడుపుతున్నాడు’’
‘‘వికలాంగుల పాఠశాలలు, అనాథాశ్రమాలు నడిపేవారంతా దేవతలు కారు. బిజినెస్‌లో ఇదొక భాగం కావచ్చు. లేదా టాక్స్ తప్పించుకోవడం కోసం విరాళాలు ఇస్తుంటారు’’
‘‘సర్’’
‘‘నిరీక్షణానంద ఆశ్రమం సెక్రటరీ మరణానికి, చేవెళ్ల ఫాంహవుస్‌కు ఏదో సంబంధం ఉంది. నీవు పార్థూను వెంట తీసుకొని మఫ్టీలో వెళ్లు. ఏవైనా క్లూలు దొరకవచ్చు’’
‘‘యస్ సార్’’
‘‘విష్ యు బెస్ట్ ఆఫ్ లక్’’ అని షేక్ హాండ్ ఇచ్చాడు అధికారి.
శ్రీ్ధర్ తన పై ఆఫీసర్ చెప్పినట్లే పార్థు ను వెంట తీసుకొని చేవెళ్ల వెళ్లాడు.
పార్థూ శ్రీ్ధర్‌ను ప్రశ్నించాడు -
‘‘నేను ఏం చేయాలి? ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు?’’
‘‘నీవు ధైర్యవంతుడివి. బాలీవుడ్‌లో అమితాభ్ బచ్చన్‌లాగా పెద్ద హీరోగా కావాలని అనుకుంటున్నావు. అందుకని మనం ఇరువురం కొంత డిటెక్షన్ చేయాలి’’
‘‘అసలు పాయింట్ ఏమిటి?’’
‘‘మొదటిది నిరీక్షణానంద స్వామి వారి ఆశ్రమం కార్యదర్శి ఎందుకు చని పోయాడు?’’
‘‘ఎందుకేమిటి? దయ్యాలు చం పాయి’’
‘‘ఆ దయ్యం నిన్ను, నన్ను ఎందుకు చంపలేదు?’’
‘‘ఎందుకంటే వాటికి ఆయన ముద్దొచ్చాడు’’
‘‘సరే - ఇక రెండవది, ఫాంహవుస్ కొనా లని అనుకున్నవారు ఎందుకు చని పోతున్నారు?’’
‘‘దాని వాస్తు బాగాలేదు అందుకని’’
‘‘ఆ సంగతే తేల్చాలి’’
‘‘ఎలా తేలుతుంది?’’
‘‘నీవు దీపక్‌చంద్ కుమారుడివి కాబట్టి ఆశ్రమంతో నీకు సన్నిహిత సంబంధం ఉంది. అందుకని నిన్ను ఎవరూ అనుమానించరు’’
‘‘మరీ మీ సంగతి ఏమిటి?’’
‘‘నన్ను మీ బంధువని చెప్పు’’
‘‘అలాగే! ఆ తర్వాత ఏం చేయాలి?’’
‘‘లాస్ట్‌టైం గోడ్బోలేతో వెళ్లినప్పుడు కారులో నిరీక్షించావే అలాగే నిరీక్షించాలి’’
‘‘నేను గోడ్బోలేతో వెళ్లిన విషయం మీకు తెలుసా?’’
‘‘మేము సిఐడిలం. మాకు అన్నీ తెలుస్తాయి’’
పార్థు ఆశ్చర్యపోయాడు.
‘‘పార్థూ! ఇక్కడ ఒక శిథిలాలయం ఉంది. దానిలో గుప్తనిధులున్నాయని ప్రతీతి’’
‘‘అంటే ఏమిటి?’’
‘‘నిజాం రాజులను అసఫ్‌జాహీలు అంటారు. ఆ కాలంలో వారి ఏలుబడిలో ఎందరో సామంతులు ఉన్నారు. ఇక్కడ పటాన్‌చెరువు అని హైదరాబాద్ సమీపంలో ఉంది కదా దానికి పొట్లచెరువు అని ప్రాచీన నామం. ఇక్కడ చాలా జైనమందిరాలు ఉండేవి. అవి సుమారు వెయ్యేళ్లకు పూర్వం నాటివి. రామనాద శివలింగం ఉన్నట్లు పాల్కురికి సోమనాథుడు రచించిన బసవపురాణంలో ఉంది’’
‘‘ఇదంతా మీకెలా తెలుసు?’’
‘‘మా పనే ఇది. ఆర్కియాలజీ శాఖవారి సహాయంతో ఈ సమాచారం సేకరించాము. ఈ చేవెళ్ల శిథిలాలయం క్రింద బంగారం ఉన్నదని కొందరు త్రవ్వకాలు జరిపారు. ఆలయం దగ్గరికి వెళ్లి గడ్డపార, పలుగు పట్టిన ప్రతివాడూ నెత్తురు కక్కి చచ్చిపోతున్నాడు. దానితో ప్రజలకు భయం పట్టుకుంది. ఈ గుడిలో ఐదు పడగల నాగు ఉండేదని మరొక వార్త’’
‘‘ఎవరైనా చూచారా?’’
‘‘చాలా వార్తలు ముఖతః వ్యాపిస్తూ ఉంటాయి’’
‘‘ఔనౌను. మా కంపెనీకి ఒక జాబు వచ్చింది. అందులో శ్రీసాయిబాబా శరణు అని నూరు కార్డులు వ్రాసి వందమందికి పోస్టు చేయాలిట. అలా వ్రాయకపోతే నెత్తురు కక్కి చనిపోతారని అందులో బెదిరించారు’’
‘‘మరి వ్రాశారా?’’
‘‘మా అసిస్టెంటు విశ్వనాథ్ గోడ్బోలే చేత వ్రాయించాను. ఈ నూరు కార్డులు నూరు మందికి చేరుతాయి. వాళ్లు మళ్లీ రాస్తారు. అలా ఇదొక సర్క్యులేషన్ చైన్‌లాగా వ్యాపిస్తూ ఉంటుంది.’’
‘‘ఇదంతా భక్తేనంటావా?’’
‘‘కాదు భయం - జనాలను భయపెట్టడంలో కొందరికి పాశవికా నందం ఉంటుంది. ఇదిగో ఇలాంటి ఉత్తరాలు ఆ కోవకు చెందుతాయి’’
పార్థు తాను శ్రీదేవి పక్కన హీరోగా నటించాలని అనుకుంటున్న విషయం చెప్పాడు.
పార్థూతో శ్రీ్ధర్ ఇలా చెప్పాడు -
‘‘నీ కోరికలు సహజమైవేనా? ఈనాడు యువకలకు క్రికెటర్ కావాలని, షాహ్‌రుఖ్ ఖాన్ కావాలని అనుకోవడం జరుగుతున్నది. మీ నాన్న మాత్రం సంత్ కబీర్ లాగానో, భద్రాద్రి రామదాసులాగానో ఆశిస్తున్నాడు. మీ నాన్న కష్టపడి సంపాదించిన డబ్బుతో తన కుటుంబ అవసరాలకు మించి ఉంచుకోవడం లేదు.

- ఇంకా ఉంది

ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్