డైలీ సీరియల్

ప్రస్తుతమే భవితకు నాంది ( సగరుడు -1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకానొక కాలంలో బాహకుడు అనేరాజు ఉండేవాడు. ఒకసారి బాహకుడు యుద్ధంలో తన సేననలంతా నష్టపోయాడు. ఇక యుద్ధంలో గెలవలేనని అనుకొని రాజ్యాన్ని శత్రువులకు అప్పగించి తాను తన భార్యలతో కలసి అడివికి వెళ్లిపోయాడు. భృగుప్రసరణగిరి అనే ప్రదేశానికి వెళ్లారు. అక్కడ నివసించే ఔర్వ మహర్షి దగ్గరకు వెళ్లి తాను శత్రువుల చేతిలో ఓడిపోయానని, తనకు తన భార్యలకు ఆశ్రయం ఇవ్వమని అడిగాడు.
కాల మహిమ వల్ల నీకు పరాజయం కలిగింది. దీనికి నీవు బాధపడకుండా దైవధ్యానంలో గడుపు. నీ కుమారుడు శత్రుంజయుడు అవుతాడు అని చెప్పాడు అని ఔర్వమహర్షి చెప్పాడు. బాహకుడు తనకు పుట్టబోయే కుమారుడు తన వంశానికి కీర్తి తెస్తాడని శత్రువులను జయస్తా డని ఎంతో ఆశతో జీవించేవాడు. కాని కొద్ది రోజులకు బాహకుడు చనిపోయాడు.
ఆయన భార్య సహగమనానికి సిద్ధపడింది.
‘అమ్మా కాళిందీ! నీకొడుకు నీ భర్తకు, మీ వంశానికి కీర్తి తెచ్చేవాడు అవుతాడు. ఇపుడు నీవు గర్భవతి కనుక నీవు సహగమనం చేయాల్సిన అవసరం లేదు. నీవు జీవించి ఉండి నీ బిడ్డకు జన్మనివ్వు’అని ఔర్వమహర్షి చెప్పాడు. దానితో ఆమె సహగమనం చేయడం మానుకొంది.
నెలలు నిండుతుండడం బాహకుని ఇతర భార్యలు చూశారు. వారిలో ఈర్ష్యాసుయలు పుట్టాయి. బాహకుని భార్యకుమాత్రమే కొడుకు పుట్టి రాజమాతగా ఉంటుంది. పుట్టేవాడు మనలను చూస్తాడో లేదో కనుక మనమే వానిని ఈ భూమిమీదకు రాకుండా చేద్దాం అనుకొన్నారు. అందరూ కలసి బాహకుని భార్యకు పాయసం లో విషం కలిపి ఇచ్చారు. ఆమె తెలియకుండా దానిని తినివేసింది. ఈ విషయం ఔర్వుడు కనుగొన్నాడు. వారి ఈర్ష్యాసుయలను తూలనాడి విషం మింగినా కూడా జీవించి ఉండే బిడ్డ పుట్టాలని ఆశీర్వదించాడు.
కొన్నాళ్లకు కాళిందికి కొడుకు పుట్టాడు. బాహకుని కొడుకు పైగా విషాహారాన్ని జీర్ణించుకుని పుట్టాడు కనుక అతనికి సగరుడు అన్న నామధేయాన్ని ఔర్వమహర్షి పెట్టాడు.
ఔర్వమహర్షి ఆశ్రమంలోనే ఆ సగరుడు పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఆ మహర్షి దగ్గరే సర్వవిద్యలను నేర్చుకున్నాడు.
పెరిగి పెద్దవాడు అయ్యాక తన తండ్రిని పరాజితులను చేసిన వారిపైన పగ పెంచుకుని హైహవ వంశీయులపై యుద్ధాన్ని ప్రకటించాడు. సగరుని వీరత్వమూ దైవబలమూ కలసి ఆయనకు విజయం సిద్ధించింది. తన తల్లిని తన పెద్దతల్లులను అందరినీ తీసుకని ఔర్వమహర్షి అనుమతితో తాను గెలుచుకున్న రాజ్యానికి వెళ్లి రాజుగా అభిషిక్తుడయ్యాడు.
రాజైన తరువాత అశ్వమేధ యాగాలను చేస్తూ తన రాజ్యాన్ని సుభిక్షంగా శత్రు భయంలేకుండాను పరిపాలన సాగించాడు.
సగరుడు తన భుజశక్తితో శత్రువులను అణిచి సూర్యచంద్రుల కాంతి ప్రసరించేటంత మేరగల భూమండలాన్ని చేజిక్కించుకుని ధర్మంగా రాజ్యాన్ని పరిపాలించాడు. సగరుని ధర్మపరిపాలన చూసి దేవతలు కూడా ప్రస్తుతించేవారు.
అయోధ్యాపట్టణాన్ని తన రాజధానిగా చేసుకొని సగరుడు తన పాలన కొనసాగించాడు. ఇతని మేరునగధీరత్వము, సత్యనిరతి, ధర్మపాలన చూసి మనుష్యులతో పాటు దేవతలు కూడా సగరుడిని కీర్తించేవారు.
- ఇంకా ఉంది

డా. రాయసం లక్ష్మి