డైలీ సీరియల్

ధర్మం ముందు బంధం వెలవెల( సగరుడు -2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదర్భదేశాధీశుడు తన కుమార్తె అయిన కేశిని అను కన్యను సగరునికిచ్చి వివాహం చేశాడు. కొన్నాళ్ల తరువాత సగరుడు సుమతి అను కన్యను కూడా వివాహం చేసుకొన్నాడు.
కానీ సగరునికి సంతానం కలుగలేదు. దీనితో ఇద్దరు భార్యలున్నా, రాజ్యాన్ని ధర్మయుతంగా పాలిస్తున్నా కూడా సగరునిలో సంతానం లేదన్న బాధ రోజురోజుకు ఎక్కువ అవుతుండేది.. తల్లి గర్భం లో ఉండగానే తనను రక్షించి, తాను పెద్దవాడు అయ్యేవిధంగా సర్వశాస్త్రాలను సర్వవిద్యలను నేర్చుకునే టట్లు చేసిన ఔర్వమహర్షినే తన బాధను పోగొడుతాడని ఒకరోజు సగరుడు నిశ్చయించుకున్నాడు. తన ఇద్దరు భార్యలను తీసుకొని భృగప్రసరణ గిరి కి వెళ్లాడు. మహర్షి కి ముగ్గురూ సేవ చేశారు. వీరి బాధను తెలుసుకొన్న ఔర్వమహర్షి సగరునికి సంతానం కలిగేలా వరం ఇవ్వదలిచాడు.
ఓ రోజు కేశిని, సుమతిని ఔర్వమహర్షి పిలిచాడు. మీ ఇద్దరిలో ఒకరికి ధర్మపాలన చేసేవాడు, వంశకీర్తిని పెంచేవాడు అయిన ఒక కుమారుడు, ఇంకొకరికి 60 వేలమంది పుత్రులు కలుగుతారు. మీలో ఎవరు ఏది కోరుకుంటారో తెలపండి అని అడిగాడు.
ఆ మాటలకు సగరుడు ఎంతో ఆనందించాడు. కేశిని తనకు ఒక్కకుమారుడే చాలు అంది. సుమతి అరవై వేలమంది కొడుకులు నాకు కావాలని కోరుకుంది. ఔర్వమహర్షి వారి కోరికను భగవంతుని దయవలన ఈడేరుతాయని చెప్పాడు.
కాలం నెమ్మదిగా సాగుతోంది. ఒక శుభమూహూర్తంలో కేశిని, సుమతి ఇద్దరూ గర్భవతులు అయ్యారు. నెలలు నిండి వారిద్దరూ బిడ్డలను పొందారు. సగరుడు ఎంతో ఆనందించాడు.
కానీ కేశినికి పుట్టిన అసమంజసుడు చిన్నప్పటి నుంచి దౌర్జన్యాలు చేసేవాడు. తన రాజ కుమారుడిని అన్న గర్వం అతనిలో ఉండేది. పైగా తనతో ఆడుకునే ఇతరుల పిల్లలను బాగా కొట్టి వారిని నదిలో ముంచేసి వారు గిలగిల కొట్టుకుంటూ ఉంటే అసమంజసుడు ఆనందిస్తూ ఉండేవాడు. తాను ఆడుకుంటూ ఇతరుల పిల్లలను నీళ్లల్లో ముంచివేసి వారి గిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఆనందించే సగరుని వల్ల కొంతమంది ప్రాణాలను కూడా కోల్పోయేవారు. ఆ ప్రాణాలను కోల్పోయిన పిల్లలందరినీ అసమంజసుడు పెద్ద అయిన తరువాత తన పూర్వజన్మ వాసనాబలం వల్ల బ్రతికించి తీసుకొని వచ్చేవాడు.
సుమతికి పుట్టిన అరవై వేలమంది పుత్రులు కూడా అత్యుత్సాహవంతులై ఎప్పుడూ ఏదో ఒక ఉపద్రవాన్ని తెస్తుండేవారు.
ఈ అసమంజసుడు పూర్వజన్మలో యోగి జీవితాన్ని గడిపేవాడు. కాని ఇతని దుష్ట సహవాసాల వల్ల అపుడు ఇతడు యోగభ్రష్టుడైనాడు. ఈ జన్మలో సగరునికి కుమారుడుగా పుట్టాడు. ఇతడు ఇట్లా చేయడం ఇతరుల పిల్లల తల్లిదండ్రులు ఓర్చుకోలేక పోయి వారంతా సగరునికి తన కొడుకు పిశాచ చేష్టలను గురించి చెప్పారు. అసమంజసునికి వివాహం చేస్తే బుద్ధికి కుదురు వస్తుందని సగరుడు అతనికి వివాహం చేశాడు. వివాహం చేసినా కూడా అసమంజసునిలో మార్పు ఏమీ రాలేదు.
ప్రజలను హింసిస్తున్నాడని సగరుడు ఎంతో బాధపడి ఇతరులకు బాధకలిగించేవిధంగా ప్రవర్తిస్తున్నాడనే కోపంతో సగరుడు అసమంజసుడిని నగర బహిష్కారం చేశాడు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804