డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-21

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతా నీరవనిశీధి. ఎవరో గేటు తీసిన శబ్దం - ఎవరో తిరిగి లోపలికి వచ్చిన శబ్దం’’
‘‘ఇంకేం మరి! ఇంత పెద్ద క్లూ దొరికితే ఏమీ తెలియదంటావేం?
బహుశా నీ గది తలుపుకు గొళ్లెం పెట్టి వుంటారు. నీవు బయటకు రావాలనుకున్నావు కానీ నేను చేసిన సూచన గుర్తుకు వచ్చి కళ్లు మూసుకొని పడుకున్నావు. ఇలలో కన్పడని సంపదలు కలలో కన్పడ్డాయి. అవునా?’’
‘‘అవును సరిగ్గా అలాగే జరిగింది’’ అన్నాడు పార్థు ఆశ్చర్యంగా.
‘‘పిచ్చివాడా! ఆశ్రమం సెక్రటరీ మిస్టరీ సాల్వ్ అయింది. ఇక ఇంటికి పోదాం పద’’
‘‘అంటే ఏమిటి?’’
‘‘వివరాలు సాక్ష్యాధారాలతో నిరూపిస్తున్నాము. నీవు నిశ్శబ్దంగా ఇంటికి వెళ్లు. అసలు ఏమీ జరుగనట్లే ప్రవర్తించు’’
‘‘అంటే?’’
‘‘ఇప్పటికి ఇంతే’’ అంటూ శ్రీ్ధర్ వెళ్లిపోయాడు.
పార్థు బీగంబజార్ చేరాడు.
శ్రీ్ధర్ వెళ్లి తన పై అధికారి జోషీని కలిశాడు.
‘‘సర్! మన ఊహలు చాలా వరకు నిజమైనాయి. అక్కడ ఒక మాఫియా గాంగ్ స్థావరం ఉంది. వారు స్మగ్లింగ్ చేస్తున్నారు. ఆ దేవాలయం కేంద్రబిందువుగా ఉంది. ఆ శిథిలాలయం దగ్గరికి ఎవరూ రారు. ఎందుకంటే అక్కడ పాము కుబుసాలున్నాయి. ముళ్ల కంచెలున్నాయి. ఎవరూ ఆ దేవాలయాన్ని పునరుద్ధరించలేదు. అందుకే ఆ ప్రదేశం వారికి చాలా సేఫ్‌గా ఉంది’’
‘‘సెక్రటరీని ఎందుకు చంపారు?’’
‘‘ఆయనకు ఈ మాఫియా గాంగ్‌తో సంబంధం ఉంది. పంపకాల విషయంలో తేడాలు వచ్చాయి. అందుకని అడ్డు తొలగించు కున్నారు. అతని మీద ఏదో విషప్రయోగం జరిగింది’’
‘‘మరి పార్థు సేకరించిన సమాచారం ఏమిటి?’’
‘‘అది కూడా చాలా విలువైనదే సర్! అక్కడి పనిమనిషి, వంట మనిషి ఈ గాంగ్‌లో సభ్యులు. రాత్రిపూట వారు ఇక్కడికి వచ్చి లావాదేవీలు నిర్వహిస్తున్నారు. వంటమనిషి నల్లచీర కట్టుకొని చీకట్లో దయ్యంలా తిరుగు తుంటుంది. ఎవరైనా పొరపాటున అటు వస్తే భయపడి పారిపోతారు’’
‘‘ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న గ్యాంగ్ లీడర్ ఎవరు?’’
‘‘అది తెలుసుకోవడానికి కొంచెం సమయం పట్టవచ్చు. కాని కలకత్తాకు ఈ ముఠాకు ఏదో సంబంధం ఉంది. అలాగే దుబాయి సందేశాలకు ఈ రహస్య ముఠాకు ఏదో కనెక్షన్ ఉంది’’
‘‘శ్రీ్ధర్! ఇదేదో ఇంటర్‌నేషనల్ నెట్‌వర్క్‌లా ఉంది’’
‘‘ఔను సర్! పాకిస్తాన్, చైనా దేశాలతో కూడా సంబంధాలున్నాయి. నేపాల్ నుండి మాదక ద్రవ్యం దిగుమతి జరుగుతున్నది. గంజాయి ఉత్పత్తులు ఇక్కడి నుండి బయటకు పోతున్నాయి.’’
‘‘ఇందులో దీపక్‌చంద్ ప్రమేయం ఉందా?’’
‘‘నిర్ధారించలేము కానీ ఈ ట్రాన్స్‌పోర్టు కంపెనీకి కలకత్తాకు ఏదో సంబంధం ఎస్టాబ్లిష్ చేయవచ్చు సార్’’
‘‘అంటే ఏమిటి? కలకత్తాకు ఫోన్ చేద్దామా?’’
‘‘అదంత సులభం కాదు సర్. అక్కడి ప్రభుత్వాధికారులు నిఘా విభాగం మనకు సహకరిస్తారనే నమ్మకం లేదు’’
‘‘సరే ‘‘రా’’ విభాగానికి నివేదిక పంపుదాం’’
***
రతన్‌చంద్ పాఠశాల వార్షికోత్సవం విలక్షణంగా ఉంటుంది.
ఆనాడు సర్వధర్మ సమ్మేళనం ఉంటుంది. పండిత సత్కారాలతోబాటు వికలాంగులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహింప జేస్తారు.
రతన్‌చంద్ రాజస్థానీయుడు. అతి పేదకుటుంబంలో జన్మించాడు. చిన్నప్పుడు ఎడారిలో ఒంటెలకు దాణా పెట్టే పని చేశాడు. ఆ తర్వాత జైపూర్ వచ్చి ఒక బట్టల కంపెనీలో కూలీగా పనిచేశాడు. బట్టలు భుజాన వేసుకొని వీధులు తిరిగి అమ్మేవాడు. ఆ తర్వాత తానే చిన్న దుకాణం పెట్టుకున్నాడు. రతన్‌చంద్ పెద్ద కొడుకు ఆ దుకాణానికి వారసుడైనాడు. రెండవవాడు అదృష్టాన్ని అనే్వషిస్తూ హైదరాబాద్ వచ్చి బీగంబజార్‌లో స్థిరపడ్డాడు. అతడే దీపక్‌చంద్. మార్వాడీ కమ్యూనిటీలో ఒక నియమం ఉంది. తమ కులస్థులు దరిద్రంలో మగ్గకూడదు అని కొంత మూలనిధిని ఏర్పాటు చేశారు. అందులో నుండి వడ్డీ లేకుండా పెట్టుబడి ఇస్తారు. వీలువెంట మూలధనం తీరిస్తే చాలు. దీపక్‌చంద్ ఈ విధంగా ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ మొదలుపెట్టాడు. ఆలిండియా పర్మిట్ తెచ్చుకొని జైపూర్, న్యూఢిల్లీ, రోహ్‌తక్, కురుక్షేత్ర వంటి ప్రాంతాలకు కూడా సర్వీసులు నడుపసాగాడు. ఇది లాభసాటి వ్యాపారమయింది.
రతన్‌చంద్ పోయిన తర్వాత ఆయన ఆస్తిలో దీపక్‌చంద్ భాగాన్ని ఆశించలేదు. తన రెక్కల కష్టం మీదనే తాను పైకి వచ్చాడు. ఏకలింగేశ్వరస్వామి (రాజస్థానీయుల దైవం) అనుగ్రహానే్న నమ్ముకున్నాడు. అతనికి రాణా ప్రతాప్ ఆదర్శం.
వార్షికోత్సవానికి హిందూ, ముస్లిం, క్రైస్తవ భేదాలు లేకుండా అందరినీ ఆహ్వానించాడు.
పండిత సత్కారం చేశాడు.
అందులో ఒకాయన అద్వైతి. నల్లకుంట నుండి వచ్చాడు.
జగన్మిద్య బ్రహ్మ సత్యం అంటాడు. ఇంకొకాయన ద్వైతి. జీవుడు వేరు దేవుడు వేరు అంటాడు. ఇంకొకడు విశిష్టాద్వైతి. జగత్తు సత్యం బ్రహ్మ సత్యం అంటాడు. మరొకాయన శైవుడు. శివుడే దేవుడు అన్య దేవతా నామోచ్చారణ కూడదు అంటాడు. వీరంతా బర్‌కత్‌పురా అశోక్‌నగర్, శంకర్‌పల్లి, షాద్‌నగర్ వంటి వివిధ ప్రాంతాల నుండి వచ్చారు.
ఒక వౌల్వీ వచ్చాడు. ఆయన సూరా అంటే ఏమిటో, ఆయాత్ అంటే ఏమిటో వాహిబ్ స్థితి ఏమిటో వివరించాడు.
ఒక క్రైస్తవుడు వచ్చి శిలువ త్యాగము ఎంత గొప్పదో చెప్పాడు.
కార్మిక నాయకుడు చంద్రం ప్రపంచంలో రెండే వర్గాలున్నాయని ఈ భేదం అనాది శాశ్వతం అని సిద్ధాంతీకరించాడు.
- ఇంకా ఉంది

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలా చక్రవర్తి