డైలీ సీరియల్

అత్యుత్సాహమే అనర్థానికి మూలం ( సగరుడు -3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ తరువాత అతని భార్యకు అంశుమంతుడు అను కొడుకు కలిగాడు. అంశుమంతుడు చాలా బుద్ధిమంతుడు. ఇతడు తన తాత అయిన సగరుని వారసునిలాగా చక్కని బుద్ధి చాతుర్యంతోను పరాక్రమంతోను పెరిగి పెద్దవాడు అవుతున్నాడు.
సగరుడు ప్రజలకు తన కుమారుని వల్ల జరిగే బాధలను దూరం చేశానన్న సంతోషంతో తన సహజగుణంగా తిరిగి అశ్వమేథ యాగాలను చేయడం మొదలుపెట్టాడు.
ఒకసారి సగరుడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు. యాగాశ్వాన్ని వదిలి యాగాశ్వ రక్షణకోసం తన కుమారులైన 60 వేలమందిని పంపించాడు. యాగాశ్వం వెనుక ఈ అరవై వేలమంది నడుస్తున్నారు.
ఈవిషయం ఇంద్రునికి తెలిసింది. సగరుడు ఇలా అశ్వమేధ యాగాలు నూరు చేసేస్తే తనకు కష్టం కలుగుతుందని ఎలాగైనా అశ్వమేధ యాగానికి ఆటంకం కలిగించాలనుకున్నాడు.
అరవైవేల మంది రక్షణగా యాగాశ్వం నడుస్తుండడం ఇంద్రుడు చూశాడు. వెంటనే ఆ యాగాశ్వాన్ని తీసుకొని వెళ్లిపోయాడు. అలా వెళ్ళి ఇంద్రుడు యాగాశ్వాన్ని కపిల మహర్షి దగ్గర వదిలి పెట్టి వెళ్లి పోయాడు.
ఇదంతా సగరుని కుమారులకు కనబడలేదు. ఉన్నట్టుండి యాగాశ్వం కనిపించకపోవడంతో వారు ఆందోళనతో చుట్టుపక్కల అంతాతిరిగి చూసి వెతికి వేసారి తమ తండ్రి దగ్గరకు వెళ్లి యాగాశ్వం కనిపించలేదని చెప్పారు.
సగరుడు తన యాగానికి అశ్వం అవసరం కనుక వారిని నేల నలుచెరుగులా వెతకమని చెప్పారు. ఒకవేళ భూమండలం లో యాగాశ్వం కనిపించకపోతే పాతాళం వరకు కూడా వెళ్లమని చెప్పాడు. అంతే ఆ అత్యుత్సాహవంతులైన అరవై వేలమంది భూమండలాన్ని అంతాఅందరూ కలసి వెతకడానికి వీలుగా విభజించుకున్నారు. తమ తమ గోళ్లతో చేతులతో భూమిని పెళ్లగిస్తూ ఎక్కడ ఎక్కడ?
మా యాగాశ్వం?
ఎవరు దొంగలించారు? అని అరుస్తూ యాగాశ్వాన్ని వెతకనారంభించారు. వారికి ఎక్కడా యాగాశ్వం కనిపించలేదు. అలా వారు భూమిని పెళ్ళగించేటప్పుడు సరీసృపాలు ఎన్నో మృత్యువాతపడ్డాయి. ఎందరో తాపసులు చెల్లాచెదురయ్యారు. పాతాళ జీవులన్నీ అల్లోకల్లోలం అయ్యాయి.వారివల్ల బాధలు పడే జీవులన్నీ కలసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళాయి. దేవతలు మునులు అక్కడికి చేరారు. వారందరూ కలిసి సగర పుత్రుల దౌష్ట్యాన్ని తెలిపారు.
ఇదుగో వీడే యాగాశ్వాన్ని అపహరించింది. మన తండ్రి తీరని దుఃఖానికి కారణం ఇతడే అంటూ కనిపించిన వారినందరిని సగరపుత్రులు బాధిస్తూ చంపివేస్తున్నారని వారి బాధనంతా చెప్పుకున్నారు.
వారందరూ భూమిని ఛేదిస్తూ రసాతలానికి వెళ్ళారు. అక్కడ దక్షిణ దశలో వారికి మహాపద్మం అను దిగ్గజం, పశ్చిమ దిశ లో సౌమనస మహాగజం
ఉత్తర దిశలో భద్రగజం కనిపించాయ. వాటిని వారు నమస్కరించి తిరిగి తమ యాగాశ్వం కోసం వెతకనారంభించారు. వారంతా ఈశాన్యం వైపు కు తిరిగి వెతకడం మొదలు పెట్టారు. వారికి అక్కడే తపస్సు చేసుకొనే కపిలమహర్షి అనిపించారు.
ఆయనదగ్గర ఉన్న తమ యాగాశ్వాన్ని చూశారు.
అమితానందం చెందారు. తమ అజ్ఞానంతో ఈ కపిలుడే యాగాశ్వానికి అపహరించిఉంటాడని అనుకొన్నారు.
- ఇంకా ఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804