డైలీ సీరియల్

మానావమానాలూ బంధాలే( వృత్రాసురుడు -1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వరూపుడు ఇంద్రుని చేత సంహరించబడ్డాడు. ఈ సంగతి త్వష్ట ప్రజాపతికి తెలిసింది. అతడు ఎంతో బాధపడ్డాడు. ఆగ్రహావేశాలతో విశ్వరూపుని చంపిన ఇంద్రుడు బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుందని ఎంతో విచారం పొందాడు.
త్వష్ట ఎంతో విచారించి పోయిన వానిని తిరిగి తీసుకొని రాలేము కనుక ఇంద్రుని పరాభవించడానికి ఇక ఇంద్రుడు కలలోనైనా భయపడే రీతిలో ఉండే కొడుకు తనకుకావాలి అనుకొన్నాడు. అన్ని ఆశలు, కోరికలు తీర్చేది ఒక్క యాగమే కనుక తన మనస్సును నియంత్రించుకుని మహాయాగం మొదలుపెట్టాడు. ఎంతో నియమనిష్టలతో, ఎంతో జాగ్రత్తగా యజ్ఞాన్ని ఆరంభించాడు. మనస్సులో కసి ఇంద్రుని చంపివేసే కుమారుడు తనకు కలగాలని కోరిక మిక్కుటమై ఉన్న త్వష్ట ఎంతో ఆవేదనతో రగిలిపోతూ యాగాన్ని ప్రారంభం చేశాడు. యజ్ఞ ఫలంగా త్వష్ట ప్రజాపతి కి ఎర్రని యజ్ఞజ్వాలల్లోంచి ఒక కుమారుడు లభించాడు. ఆ కుమారుడే వృత్రాసురుడు. ఎర్రని కనులు, పొడవైన దేహము,నల్లని కేశాలు పొడవైన కాళ్లు ఇలా చూడడానికే భయంకరంగా కనిపించాడు. వానిని చూడగానే త్వష్టకు చాలా ఆనందం వేసింది.
యజ్ఞకుండం నుంచి వెలుపలికి వచ్చి ‘తండ్రీ ఇప్పుడు నేను ఏమి చేయాలి?’ అని వృత్రాసురుడు అడిగాడు.
త్వష్ట ‘‘వృత్రాసురా! నాకు ఒక పెద్ద కోరిక ఉంది. నీవు వెంటనే తపోభూమికి వెళ్లి బ్రహ్మను గూర్చి తపస్సు ఆచరించు’’ అని చెప్పాడు. వెంటనే వెళ్లిపోతున్న తన కొడుకును చూసి ఎంతో ఆనందించి తిరిగి వృత్రాసురుడిని పిలిచి ‘నాయనా! నీకే విధంగానూ మరణం రాకుండా ఉండేలా వరాన్ని కోరుము. నీవే దేవతల రాజైన ఇంద్రుడిని సంహరించవలెను’ అని చెప్పాడు. వృత్రాసురుడు తల ఊపి వేగంగా తపోభూమికి తరలి వెళ్లిపోయాడు. నిశ్చలంగా, నిశ్చింతగా తపస్సు చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. మంచి ప్రదేశాన్ని చూసుకుని సుఖాసనం వేసుకొని నిశ్చలంగా బ్రహ్మను గూర్చి తపస్సు చేశాడు.
వృత్రాసురుని తపస్సు నిర్మలంగా సాగుతుంటే ఇంద్రునికి అతని అనుచరులకు చాలా భయం వేసింది. వీడు ఎన్ని అనర్థాలు కలిగిస్తాడో అని వారంతా దిగులు చెందారు.
ఓరోజు వృత్రాసురుని తపస్సు బ్రహ్మకు తెలిసింది. వృత్రాసురుని దగ్గరకు బ్రహ్మ వెళ్లాడు. ‘నాయనా నీకు ఏం కావాలని ఈ తపస్సు ఆచరిస్తున్నావు నీ కోరిక ఏమిటో నాకు చెప్పు’ అని అడిగాడు.
వృత్రాసురుడు తండ్రి చెప్పిన దానిని బాగా ఆలోచించి బ్రహ్మకు నమస్కరించి ‘తండ్రీ! నేను రాత్రిగాని, పగలుకానీ, పొద్దున గాని, సాయంత్రం గానీ, జీవమున్న దానితో కానీ జీవము లేని దానితో కానీ భూమి మీద కానీ జలములో కానీ నాకు మరణం సంభవించకుండా ఉండే వరం ఇవ్వాలి స్వామీ!’ అని అడిగాడు. బ్రహ్మ ‘తథాస్తు’ అన్నాడు.
ఎనలేని సంతోషంతో వృత్రాసురుడు తన తండ్రి దగ్గరకు వెళ్లాడు. నమస్కారం చేసి ‘తండ్రీ! మీరు కోరుకున్నట్టుగా నాకు మరణం సంభవించకుండా ఉండేవిధంగా బ్రహ్మ చేత వరాన్ని కోరాను. బ్రహ్మ నా తపస్సుకు ఎంతో సంతోషించి నేను అడిగిన వరాన్ని నాకు ఇచ్చారు అని చెప్పాడు,.
త్వష్ట తన కుమారుడిని చూసి ఎంతో సంతోషించాడు. వెయ్యేండ్లు చల్లగా ఉండమని దీవించాడు.

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804