డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-25

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నువ్వెవరు? నిజం చెప్పు?’’ అని గద్దించాడు విశ్వనాథ్.
‘‘నేను చేవెళ్ల ముఠాలో సభ్యుణ్ణి. నన్ను వెంటనే హాస్పిటల్‌లో చేర్పించు, లేకుంటే చచ్చిపోతాను’’
విశ్వనాథ్ తాను దూరంగా ఉంచిన కారులోకి రైతును ఎక్కించుకొని ఉస్మానియా హాస్పిటల్‌కు బయలుదేరాడు. క్షణాల్లో ఈ వార్త కంట్రోల్‌రూంకు చేరింది.
సిఐడి బృందం ఉస్మానియా హాస్పిటల్ చేరింది.
ఒకవైపు రైతు కాలికి వైద్యం చేస్తూనే మరొకవైపు అతని నుండి సమాచారం సేకరించారు.
ఈ నాటకం పార్థూ, కర్తార్ సింగ్ కలిసి ఆడుతున్నట్లు సమాచారం అందించాడు రైతు.
‘‘వారెక్కడ ఉన్నారో చెప్పు?’’
‘‘అంశాపూర్‌లో దాక్కున్నారు’’
పోలీసు బృందం అంశాపూర్ చేరింది.
ఈ లోపల పార్థూ, కర్తార్‌సింగ్‌తో ఇలా అన్నాడు -
‘‘మన నాటకం వికటించింది. అనవసరంగా యాదగిరికి దెబ్బలు తగిలాయి’’
‘‘నాటకం కాదురా బేవకూఫ్! నిన్ను నేను నిజంగానే బంధించాను. నా పేరు కర్తార్‌సింగ్ కాదు, నేనొక గాంగ్‌లీడర్‌ను’’
పార్థూ ఆశ్చర్యపోయాడు.
‘‘అయితే నన్ను వదలిపెట్టవా? మా ఇంటికి పోనివ్వవా?’’
‘‘పోనివ్వను. నిన్ను యమపురికి పంపుతాను. ఎందుకంటే నీవు మాకు శత్రువువు’’
ఈలోగా పోలీసులు వచ్చి అంశాపూర్ ముట్టడించారు.
అప్పటికే కర్తార్‌సింగ్ తప్పించుకొని పారిపోయాడు.
వారికి పార్థు శవం దొరికింది.
***
‘‘శ్రీ్ధర్’’
‘‘బాస్’’
‘‘కద క్లైమాక్స్‌కు వచ్చింది’’
‘‘అలాగే అనిపిస్తున్నది బాస్’’
‘‘నల్గొండ జిల్లా మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించు’’
‘‘అలాగే సర్’’
‘‘కర్తార్ సింగ్ ఎక్కడున్నా పట్టుకొని తీరాలి’’
‘‘బాస్’’
‘‘ఇప్పుడు నీకు కూడా తెలియని మరో రహస్యం న్యూఢిల్లీలోని ‘రా’ (నిఘా) విభాగం నుండి అందింది.’’
‘‘అదేమిటి సర్?’’
‘‘వెళ్ళి విశ్వనాథ్ గోడ్బోలేను అరెస్టు చెయ్యి! వివరాలు అతని నోటితోనే చెప్పిద్దాము’’
తెల్లవారే లోపల పోలీసులు విశ్వనాథ్‌ను అరెస్టు చేశారు. దీపక్‌చంద్‌ను పిలిపించారు. ఆయన, భార్య ప్రభ కన్నీరు మున్నీరై విలపిస్తున్నారు.
‘‘క్షమించండి - ఇలా జరుగుతుం దనుకోలేదు’’
‘‘జోషీజీ! నేను దుఃఖిస్తున్నది కొడుకు పోయినందుకు కాదు, సత్పురుషుడైన విశ్వనాథ్ గోడ్బోలేనే అరెస్టు చేసినందుకు’’
‘‘దీపక్‌జీ! మీ మంచితనానికి కృతజ్ఞతలు. కానీ విశ్వనాథ్ మీరనుకున్నట్లు సత్పురుషుడు కాడు. ఇతడు పాకిస్తాన్ గూఢచారి. ఇతని స్వస్థలం కరాచీ పోర్టు’’
దీపక్‌చంద్ నివ్వెరపోయాడు. కొన్ని క్షణాలు అతని నోట వెంట మాట రాలేదు.
‘‘నమ్మలేను (నా ముమ్‌కిన్)’’
‘‘ఔను. మేమూ నమ్మలేదు. కాని ఇప్పుడు సాక్ష్యాధారాలు లభించాయి. ఇతడు చాలా దశాబ్దాల క్రితం ఇండియాలోకి ప్రవేశించాడు. భారతీయునిగా మారాడు. భారతీయ స్ర్తిని వివాహం చేసుకున్నాడు. మహా శివభక్తునిగా వేషమెత్తాడు. పాకిస్తాన్‌కు ఇక్కడి రహస్యాలు సేకరించి పంపిస్తున్నాడు.
మీ హమాలీ కర్తార్‌సింగ్ పెద్ద క్రిమినల్. ఇతని స్వస్థలం కలకత్తా. నేడో రేపో అతనిని పట్టుకుంటాము’’
‘విశ్వనాథ్ గురించి మీరు పొర పడుతున్నారు’’
‘‘లేదు. స్పష్టమైన ఆధారాలు దొరికాయి. కాకుంటే ఒక పరిణామం మా సిఐడి విభాగం గమనించింది. భ్రమరకీటకన్యాయం అని మీరు వినే ఉంటారు. నిరంతరం హనుమాన్ దేవాలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన వాహిబ్ అబ్దుల్లా అనే ఈ ఐఎస్‌ఐ గూఢచారి నిజంగానే విశ్వనాథ్ గోడ్బోలేగా మారిపోయాడు.
అందుకు ఆధారాలేమిటంటే ఇటీవలి కొన్ని సంవత్సరాల్లో గోడ్బోలే నుండి పాకిస్తాన్‌కు మెస్సేజెస్ వెళ్లడం లేదు’’
‘‘ఆ దుబాయ్ మెస్సేజెస్...’’
‘‘ఔను! అవి కర్తార్‌సింగ్‌కు దుబాయి ఉగ్రవాదులు పంపినవి. వారి స్థావరం ఒకటి పాతబస్తీలో ఉంది. వీరి ఆర్థిక లావాదేవీలు చేవెళ్ల ఫాంహవుస్ దగ్గర జరుగుతున్నాయి.
శిథిలాలయం కింద నిధులున్న మాట వాస్తవమే ఐతే అవి నిజాం జమానాలోవి కావు. నిరీక్షణానంద స్వామి ఆశ్రమ సెక్రటరీ దాచిపెట్టిన డబ్బు’’
దీపక్‌చంద్ స్పృహ తప్పి పడిపోయాడు.
***
నాంపల్లి కోర్టుకు ప్రాసిక్యూటర్ చేవెళ్ల కార్యదర్శి మరణ రహస్యం వివరించాడు.
కార్యదర్శి పాముకాటుతో మరణించినట్లు రిపోర్టు ఉంది.
‘‘యువర్ ఆనర్! ఈ ప్రాంతంలో ఒక పాములు పట్టేవాడున్నాడు. అతని పేరు సోనానాయక్. ఇతడు చేవెళ్ల సమీపంలో పాములు పట్టి పగటిపూట ఆడించుకుంటూ ఉంటాడు.
ఇతనిని కొందరు మాఫియాలు ఆయుధంగా వాడుకుంటున్నారు. అంటే శత్రువులను ఇతడు పాముతో కరిపించి చంపుతూ ఉంటాడు. అంతేకాదు, ఎన్నికల సమయంలో పాములకు సభలోకి వదులు తాడు. జనం భయతో లేచి పారిపోతారు. సభ భగ్నమవుతుంది. ఇలాంటి ఒక ముఠా శత్రు దేశాల ప్రేరణతో దేశవ్యాప్తంగా పని చేస్తున్నది’’.
కోర్టులో విశ్వనాథ్ గోడ్బోలేను ప్రవేశపెట్టారు. నాంపల్లి కోర్టులో విచారణ ప్రారంభమైంది.
‘‘నీ పేరేమిటి?’’
‘‘విశ్వనాథ్ గోడ్బోలే’’
- ఇంకా ఉంది

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్