డైలీ సీరియల్

దైవశక్తితో దుష్టశక్తి అంతం (వృత్రాసురుడు - 2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక నీవు అమరావతిపై దండెత్తి ఆ గర్వాంధుడైన ఇంద్రుడిని పదవీ భ్రష్టుడిని చేయు. నీకు నేను చెప్పదల్చుకున్న పని అదే అని చెప్పాడు.
వెనువెంటనే వృత్రాసురుడు దేవతలపై దండెత్తి వెళ్లాడు.
వృత్రాసురుని పాదాలు పెద్దవి చేసుకొంటూ వడివడిగా నడుస్తూ వెళ్తుంటే దేవతలు వీని రాకను ముందే తెలుసుకొని ఎక్కడివాళ్లకి దాక్కుండిపోయారు. వృత్రాసురుడు తన నాలుక జాపి ఆకాశంలోని నక్షత్రాలను నాకుతూ వాటిని భూమిపైకి తీసుకొని వచ్చి తిరిగి వదిలేసేవాడు. మరొకసారి స్వర్గాన్ని అతలాకుతలం చేసేవాడు. వృత్రాసురుడు దేవతలు ఎక్కడ ఉంటే అక్కడ ఆ ప్రదేశాన్నంతా అతలాకుతలం చేస్తూ అక్కడ దాక్కున్న దేవతలు ఈడ్చి బయటకు తీసుకొని వచ్చేవాడు. ఎక్కడైనా ఎవరైన తపస్సులు చేస్తూ ఉంటేవారినంత భయభ్రాంతులను చేసి వారి తపస్సులను చెడగొట్టేవాడు. మునులకు నిలువ నీడ లేకుండా చేసేవాడు. సజ్జనులను, సాధువులను నానాహింసలకు గురి చేసేవాడు. వృత్రుని నామం చెబితెనే దేవతలు, సజ్జనులు భయపడి పోయేవారు
ఇలా ముల్లోకాలను అల్లకల్లోలం చేసే వృత్రాసురునికి కనిపించకుండా ఇంద్రుడు తిరిగేవాడు. ఒకసారి దేవతలంతా కలసి వృత్రాసురునితో యుద్ధం చేద్దానని యుద్ధరంగంలో నిలిచారు. వారంతా ఏకకాలంలో తమ తమ అస్త్రాలను వేశారు. వృత్రాసురుడు వాటి నన్నింటిని ఒక్కసారి నోరుతెరిచి తినివేసాడు. దానితో ఇక ఏమీ చేయలేక దేవతలంతా తలో దిక్కుకు పారిపోయారు.
ఒకరోజు దేవతలంతా కలసి రహస్య ప్రదేశంలో ఉన్న ఇంద్రుడిని కలుసుకొన్నారు. వారంతా ఇంద్రుడితో ఈ వృత్రాసురుని పీడ వదిలించుకోవడానికి ఏదైనా ఉపాయం ఆలోచించమని చెప్పారు.
వారంతా కలసి బ్రహ్మ దేవుని దగ్గరకు వెళ్లారు. బ్రహ్మదేవుడు కూడా వారిని చూసి ఏమి చేయాలో తెలియక నేను కూడా ఆలోచిస్తున్నాను. ఇక మనందరికీ ఆ పాలకడలిలోనివసించే పరంధాముడే దిక్కు పదండి అందరం అక్కడికి వెళ్దాం అని అన్నాడు.
బ్రహ్మదేవుని ముందుంచుకుని దేవతలంతా వైకుంఠానికి వెళ్లారు. పాలకడలిలో శేషతల్పం మీద మహావిష్ణువు శయనించి ఉన్నాడు. ఆయన పాద సేవ చేస్తూ శ్రీలక్ష్మి కూర్చుని ఉంది. వారిని చూసి దేవతలంతా స్తుతించారు. నారదాదులు లక్ష్మీనారాయణుల దగ్గర నిలిచి వైకుంఠ వైభవాన్ని కీర్తించారు.
శ్రీమన్నారాయణుడు దేవతలనంతా చూసి చిరునవ్వు చిందించారు. మీరెందుకు ఇంతగా విచారంగా ఉన్నారు. మీకు వచ్చిన కష్టమేమున్నది అని నారాయణుడే వారిని అడిగారు.
వారంతా ఏక కంఠంతో వృత్రాసురుని వల్ల వారు పడే బాధలన్నింటినీ ఏకరువు పెట్టారు. అంతు పొంతు లేని విధంగా విజృంభించి వృత్రాసురుడు మమ్ములందరినీ కష్టపెడతున్నాడు. మా ఆయుధాలన్నింటినీ మింగివేస్తున్నాడు.
ఆ వృత్రాసురుడు కేవలం ఎముకలతో నిర్మించిన వజ్రాయుధంతో మరణిస్తాడు కానీ మరేవిధమైన ఆయుధంతోను మరణించకుండా ఉండేటట్లు ఈ విధాత వానికి వరం ఇచ్చాడు కదా. మీరు వజ్రాయుధ నిర్మాణానికి కృషి చేయండి అని చెప్పాడు.
వారంతా ఏమి చేయాలో తెలియక చేతులు జోడించి ‘ప్రభూ! మీరే మాకు మార్గనిర్దేశకులై దారి చూపించండి. లోకకంటకుడైన ఈ వృత్రాసురుని పీడ దూరం చేయండి’అని వేడుకున్నారు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804