డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-26

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీ స్వస్థలం?’’
‘‘హైదరాబాద్, బేగంబజార్’’
‘‘లేదు యొవర్ ఆనర్! ఇతడు పాకిస్తానీ పౌరుడు’’
‘‘గోడ్బోలే! నిజం చెప్పు’’
‘‘నిజమే యొవర్ ఆనర్! నేను పాకిస్తానీ జాతీయుడినే. కాని ఇండియాకు వచ్చి చాలా సంవత్సరాలు దాటిపోయాయ. హిందూమతం పుచ్చుకున్నాను. హిందువును వివాహం చేసు కున్నాను. నా కుమార్తె శైలజ కూడా హిందువే’’
‘‘అబ్జక్షన్ యొవర్ ఆనర్! ఇతడు పాకిస్తానీ గూఢచారి. ఇక్కడి సమాచారం కనుగొని చేరవేస్తున్నాడు’’
‘‘నిజమేనా గోడ్బోలే?’’
‘‘నిజమే యొవర్ ఆనర్! మొదట్లో కొన్నాళ్ళు అలా చేశాను కానీ నాకు దీపక్‌చంద్, మాణిక్‌చం ద్, తంగిరాల శ్రీరామశర్మ అనే ముగ్గురు మహాపురుషులతో పరిచయం ఏర్పడింది. వారి వలన ఈ దేశం గురించి, ఇక్కడ సంస్కృతి గురించి చాలా తెలుసుకున్నాను. రామనామం తాతయ్య కథ మా తంగిరాల వారు చెప్పారు. మాటే మంత్రంగా మారే మహాపురుషులు, తపస్వులు ఈ దేశంలో ఉన్నారు. వారి ప్రభావంతో నేను మారిపోయాను యొవర్ ఆనర్’’
ఈ వాదాన్ని పోలీసులు అంగీ కరించలేదు.
‘‘కర్తార్‌సింగ్‌తో నీకేమిటి సంబంధం?’’
‘‘అతడు ఒక హమాలీ మాత్రమే’’
‘‘అతడు చైనా ఉగ్రవాదులతో చేతులు కలిపాడని, ఆయన స్వస్థలం కలకత్తా నీకు తెలుసా?’’
‘‘తెలియదు యావర్ ఆనర్’’
‘‘అతనికి ఉద్యోగం ఎవరిచ్చారు?’’
‘‘నేనే నియమించాను. నాకు మా ప్రొప్రయటర్ దీపక్ చంద్ సర్వాధికారాలు ఇచ్చారు.
‘‘ఒక విద్రోహికి ఉద్యోగం ఇవ్వటం తప్పుకాదా?’’
‘‘అతడు చైనా గూఢచారి అని నాకు తెలియదు. ఈ దేశంలో ఒకవైపు అంతులేని సంపద పోగుపడి ఉంటే మరొకవైపు ఆకలి ఆక్రందనలు ఉన్నాయ. ఇది అమానుషం. అందుకే విప్లవ శక్తులు పుట్టుకొస్తున్నాయ’
‘‘గోడ్బోలే ! నీవు బహిరంగంగా విద్రోహాలను బలపరుస్తున్నావా?’’
‘‘లేదు యొవర్ ఆనర్, కేవలం ప్రజల దైన్య పరిస్థితి వివరిస్తున్నాను.
పోలీసులు గోడ్బోలే మాటలు నమ్మలేదు. దానితో గోడ్బోలే ఆవేశానికి లోనైనాడు. ఏడ్చాడు. అవి కన్నీళ్ళు కావు - రక్తాశ్రువులు.
‘‘చూడండిరా! కళ్ళు తెరిచి సమాజాన్ని చూడండి! ఇటు ఆకలితో కేకలేస్తున్న ఆదివాసీలను చూడండి. అటు తాగి విలాస జీవితాలు గడుపుతున్న సినీతారలను చూడండి. మత కక్షల్ల్లో కొడుకును కోడలును పోగొట్టి ఏడుస్తున్న తల్లిదండ్రుల ఆక్రందనాలు చూడండి. సమసమాజ నిర్మాణం పేరుతో చైనా ఉగ్రవాదుల ఏజెంట్ల చేతుల్లో చనిపోయన శ్రీకాకుళంలోని అమాయకులను చూడండి. ప్రజాప్రతినిధులను హత్య చేస్తే సమసమాజ నిర్మాణం ఎట్లా జరుగుతుంది??
రాముడు కాని రహీం కాని దేశ ప్రజలను చంపండి అని చెప్పాడా? చూడండిలా చూడండి! కన్నతల్లి గుండెలు బాదుకుంటూ ఎలా రోదిస్తున్నదో! ఆమె కొడుకు సరిహద్దులల్లో దేశ రక్షణ కోసం, పాకిస్తాన్ సైనికుల చేతుల్లో దారుణంగా మరణించారు. మరొకణ్ణి కిడ్నాప్ చేసి ముక్కలు ముక్కలుగా నరికి పార్శిల్ చేసి ఇండియాకు పంపించారు.
ప్రజలకు తిండి లేదంటే ప్రవచనాలు విని కడుపు నింపుకోండి అంటున్నారు. జనం శిశిరంలో ఆకుల్లా రాలిపోతుంటే నాయకులు వినాయకుల్లా బొజ్జలు పెంచుకొని వెకిలి నవ్వులు నవ్వుతున్నారు. నెత్తిమీద బట్ట నెత్తికింద పొట్ట - ఈ నరరూపరాక్షసుల కోసం ఎందుకు అమాయకులు, అన్నార్తులూ త్యాగాలు చేయాలి?
వేదాంగాలు వేదాంతాలు నాశనమైపోను. మీ కొంగ సిద్ధాంతాలు చాలు. మనుషుల్ని కనీసం బతకనివ్వండి. ముఝే జీనోదో!!
‘‘ముంబాయిలోని నిర్మాతలకు, దుబాయి, షార్జాలలోని అండర్‌గ్రౌండ్ డాన్స్‌కు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. ఇదొక ఇంటర్‌నేషనల్ మాఫియా బిజినెస్. క్రమంగా హైదరాబాదుకు, తిరువనంత పురానికి ఈ జబ్బు వ్యాపించింది. వీరి వెనుక అంతర్జాతీయ టెర్రిస్టులున్నారు. కళ, కాకరకాయ కేవలం ఒక ముసుగు మాత్రమే.
అక్కడ మెరిసేదంతా బంగారం కాదు. రంగురంగుల కలలను అమ్మి సొమ్ము చేసుకొనే గుంపు దానిని నమ్మి వచ్చి ఊబిలో దిగి ఆత్మహత్యలు, హత్యలు చేసుకొనే అభాగ్యుల సమూహం కొంత -
యువర్ ఆనర్! ఈ మనీట్రాన్‌స్రాక్షన్ ఛానల్స్ మీకు కన్పడలేదా?
నేను చెబితే తప్ప తెలియదు అంటే మీ ఇంటలిజెన్స్ ఎంత బలహీనంగా ఉందో తెలుస్తున్నది కదా!
మా దేశం నుండి ముడుపులు తీసుకొనే బడా బడా వ్యక్తుల పేర్లు చెప్పమంటారా యువర్ ఆనర్? చెప్పినా మీరేమీ చేయలేరు. ఎందు కంటే వారికి ప్రత్యక్ష సాక్ష్యాధారాలు మీ కోర్టు ఆవరణలో నిరూపించాలి అంటారు. ఈ లోపల నాలాంటి వాళ్లను వాళ్లు లేపేస్తారు’’
కోర్టులో గందరగోళం.
‘‘ఆర్డర్ ఆర్డర్’’
‘‘మీ దేశంలో ఎన్ని వందల షెల్ కంపెనీలున్నాయో మీ నాయకులకు తెలుసా? యువర్ ఆనర్! తెలిసినా తెలియనట్లు నటిస్తున్నారా? లేక వీళ్లూ అందులో వాటాదారులా?
యువర్ ఆనర్! నేను మీకు శత్రువును కాను. మీ శత్రువులు ఈ దేశంలోనే ఉన్నారు.
నాలాంటివారు మరికొందరు జమ్మూ కాశ్మీర్‌లో, అవధ్‌లో, ఛత్తీస్‌గఢ్‌లో, లైనాడ్, మల్లాపురం ప్రాంతాల్లో ఉన్నారు. ఒకడి పేరు జ్ఞానానందం కాని అతడు జాన్ పాల్ అనే హోస్టన్ గూఢచారి. సేవాకార్యక్రమాల పేరుతో ఆదివాసీలను విదేశీపౌరులుగా మారుస్తు న్నాడు. భారత ప్రభుత్వం అట్టివారికి ప్రశంసా పత్రాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఇవి సేవా కార్యక్రమాలు కావు యువర్ ఆనర్! జాతీయ విధ్వంసక కార్యకలాపాలు.
నేను మరణానికి తెగించి అలాంటివారి జాబితాను ఇవ్వగలను. కాని వారిపై చర్య తీసుకొనే సంకల్పం మీ నాయకత్వానికి లేదు.
- ఇంకా ఉంది

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలా చక్రవర్తి