డైలీ సీరియల్

దేహమూ వాహకమే! ( వృత్రాసురుడు - 3)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపుడు శ్రీమన్నారాయణుడు ఈ విధంగా చెప్పాడు.
దధీచీ అనే మునిపుంగవుడున్నాడు. ఆయన మహిమాన్వితుడు. సాధు సంపన్నుడు. ఆయన దేహం నారాయణ కవచధారణతో అలరారుతూ ఉంటుంది. ఇతని దగ్గరకు అశ్వనీకుమారులు వెళ్లితే వారికి అశ్వశిరం అనే విద్యను వారికి బోధించాడు. త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుడు ఆయన శిష్యరికం చేస్తుండేటపుడు అమూల్యమైన నారాయణ కవచాన్ని బోధించాడు.దధీచి మహాత్యాగధనుడు. అతనిని యాచించిన వారికి లేదనకుండా ఇచ్చేవాడు. కనుక మీరంతా వెళ్లి మీకొచ్చిన కష్టాన్ని చెప్పి ఆయన వెన్నుముకను దానం అడగడండి. దధీచి మీకు తప్పక ఆయన దేహంలో ఉండే ఎముకలను దానం చేయగలడు. వాటిని తెచ్చిన తరువాత ఇంద్రుడు వజ్రాయుధాన్ని నిర్మింపచేస్తాడు. దానితో యుద్ధంచేసినపుడు వృత్రాసురుడు ఇంద్రుని చేతిలో ఓడిపోతాడు అని నారాయణుడు చెప్పాడు.
వెంటనే దేవతలంతా కలసి దధీచి మహర్షి దగ్గరకు వెళ్లారు. ఆయన్ను చూసి నమస్కరించారు. వారు వచ్చిన పనిని చెప్పలేక చెప్పారు. దధీచి వారిని సాదరంగా ఆహ్వానించి అతిధి మర్యాదలు చేశాడు. వారి కోర్కె విని ఎంతో సంతోషించాడు. ఈ దేహం ఉన్నపుడే ఏ పని యైనా చేయగలం. దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టుకున్నట్లుగా దేహం ఉన్నపుడే మంచి పనులుచేయాలి. ఏక్షణం వస్తుందో తెలియని మృత్యువు మన దరికి చేరినపుడు దేహం ఎంత పటిష్టంగా ఉన్నా కూడా మృత్యువు బారిన పడకమానము. అపుడు ఏంచేయాలనుకొన్నా చేయడానికి సమయం ఉండదు. కనుక మీరు విచార గ్రస్తులు కాకండి. మీవిచారాన్ని పోగొట్ట గలిగిన అదృష్టం నాకు వచ్చింది. అదే మహాద్భాగ్యం. కనుక నేను ఇపుడు యోగాగ్నిలో నా శరీరాన్ని దహించుకుంటాను. అపుడు మీరు నా నుండి నా వెన్నుముకను తీసుకొని వెళ్లండి ’అని ఎంతో సంతోషంగా దధీచి దేవతలకు చెప్పాడు.
అట్లా దధీచి శరీరం నుంచి గ్రహించిన ఎముకలతో సృష్టించిన ఆయుధాన్ని దేవతలు నిర్మించుకున్నారు. ఇక వృత్రాసురుని బాధ తీరిపోతుందని అనుకొన్నారు.
దేవతలంతా కూడా వారి వారి ఆయుధాలను పట్టుకొని ఇంద్రుని ముందుంచుకుని భీకరంగా అరుస్తూ శంఖాలు పూరించారు. వీరి యుద్ధోత్సాహం చూసి వృత్రాసురుడు వీరు ఏమి చేసి ఈ ఉత్సాహాన్ని పొందారు. నన్ను చూసి పారిపోయేవారు ఇపుడు ననే్న ఎదరిస్తామని వస్తున్నారు అంటే ఆలోచించాల్సిన విషయమే కానీ కాకున్నది కాక మానదు కదా.
మరి జంకు లేక జగడానికి సిద్ధం కావాలి అనుకొని పోరుకు సన్నద్ధమవమని రాక్షసులందరినీ సమావేశపరిచి వారిలో ఉత్సాహాన్ని నింపి రణరంగానికి వృత్రాసురుడు దారి తీశాడు. వృతాసురుని తోపాటుగా అనేక వేలమంది రాక్షసులు వచ్చారు. దేవేంద్రుని వృత్రాసురుని వల్ల దిక్కులేకుండా చేయవచ్చునని వారంతా ఎంతో ఉత్సాహంతో బయలుదేరారు.
వజ్రాయుధాన్ని సంపాదించిన దేవేంద్రుడు అమితోత్సాహంతో వృత్రాసురుని పైకి విజృంభించాడు. ఇక వృత్రాసురుని పీడ వదులుతుందని దేవతాగణాలు రుద్రగణాలు, మరుద్గణాలు, అశ్వినీదేవతలు, పితృదేవతలు, విశే్వదేవులు దిక్పాలురు, గరుడులు, కింపురుషులు, సిద్ధులు ఖేచరులు సాధువులు అంతా చేరారు.

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804