డైలీ సీరియల్

విశ్వనాథ్ గోడ్బోలే-27

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను తంగిరాల శ్రీరామసిద్ధాంతిగారి ప్రబోధాల వల్ల ఎంతో ప్రభావితుడనైనాను. ఐతే ఆయన చెప్పిన ఆదర్శ సమాజం ఇవ్వాళ భారత్‌లో లేదు. ఇదొక అమెరికా కార్బన్ కాపీ. ఇక్కడ చైనా చప్రాసీలు, పాకిస్తాన్ డైలీవేజర్లు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఆత్మహత్య మహాపాపం. ఐనా ఎందుకు ఇండియా లో చాలామంది ఆత్మహత్య చేసుకుంటున్నారు??
ఒక్కసారి కాప్రాలోని సాకేత్ ప్రణామ్ టవర్స్‌కు వెళ్లి చూడండి. కీసర దగ్గర వయోవృద్ధుల ఆశ్రమాలు చూడండి. ఎనభై ఏళ్లు దాటిన వృద్ధులు కన్నీటి వరదల్లో ఈదుతున్నారు. వారిని కొడుకులు పట్టించుకోరు. కూతుళ్లు, కోడళ్లు ఆదరించరు. ఇది మానవ సమాజ మా? దండకారణ్యమా? మీ సంగీత విభావరులు, మీ చలన చిత్రోత్స వాలు, మీ దేవ్‌పార్టీలు, మీ భజనలు విధ్వంసక సృజనలు - మీ దేశాన్ని సమూలంగా నాశనం చేస్తున్నాయి.
మీ దేశంలో ఇరవై శాతం మీకు శత్రువులు. తక్కిన ఎనభై శాతం సోమరిపోతులు. మరి ననె్నందుకు దోషిగా నిలబెట్టారు?
మా దేశానికి మీ దేశంలో ఏయే నాయకులు, పారిశ్రామికవేత్తలు, మతాధిపతులు గూఢచారులుగా వ్యవహరిస్తున్నారో తెలిస్తే ముందు మీకు పిచ్చెక్కుతుంది.
వ్యక్తికి సమాజానికి సాహిత్యా నికి మతానికి కూడా ఆర్ద్రత ముఖ్యం.కరుణ లేని హృదయం కొండ గుహ లాంటిది.
క్రైస్తవం ప్రపంచవ్యాప్తం కావడానికి సేవాకార్యక్రమాలు, శిలువ త్యాగం, ఇది కాదనలేని సత్యం. దీపక్‌చంద్ ప్రతిఫలాపేక్ష లేకుండా సేవాకార్యక్రమాలు చేస్తూ విరాళాలు ఇస్తుంటే ఆయనపై ఆరోపణలు చేశారు. ప్రభాచంద్ ఏ పని చేసింది? ఆమెకు పుత్రశోకం కల్పించడం దుర్మార్గం - ఇది సభ్య సమాజ లక్షణం కాదు.
బతికిన నాలుగు రోజులూ అందరికీ సహాయపడుతూ బతికినవాడి జీవితం సార్థకం.
తంగిరాల వారు నాకొక శ్లోకం నేర్పారు -
చెట్లు తమ పండ్లు తాము తినవు
నది తన నీరు తాను తగదు
మేఘం కురుస్తుంది - ఆవు క్షీర భాగ్యం కల్పిస్తుంది.
సత్పురుషుడు మేఘం లాంటివాడు
ఈ సంస్కృత శ్లోకం నా జీవన గమనాన్ని మార్చివేసింది.
మనసా వాచా కర్మణా దీపక్‌చంద్‌ను సేవించాను. హనుమాన్ చాలీసా పారాయణం చేశాను.
నేను విద్రోహిని కాను. విధ్వంసకుణ్ణి కాను’’
విశ్వనాథ్ గోడ్బోలే పెద్దగా అరిచాడు. ఆ కేకలో కరుణ ఉంది. స్థితప్రజ్ఞత్వం ఉంది. సత్యసంధత ఉంది. ఎట్టి భయమూ లేదు.
‘‘కర్తార్ సింగ్ సమసమాజ సమితి (ఎస్.ఎస్.ఎస్) పేరుతో ఒక దొంగల ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. శ్రామికవర్గ విముక్తి వంటి నినాదాలిస్తూ ఆ ముఠా ఊరేగుతుంది. వీరికి విదేశాల నుండి సందేశాలు వస్తుంటాయి. విచిత్రమేమంటే విలాసజీవితం కోసం వీరు దారిదోపిడీలు చేయడం, రాత్రిళ్లు దొంగతనాలకు దిగడం జరుగుతున్నది. పెళ్ళిళ్లకు తీర్థయాత్రలకు పొరుగూరికి పోయిన ఇళ్లను పగటిపూట రెక్కీ చేసి గుర్తుంచుకుంటారు. రాత్రివేళ అక్కడ జూదం, పేకాట, తాగుడు, వ్యభిచారం వంటి నేరాలకు పాల్పడుతుంటారు.
చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, గాంధారి శంకరపల్లి ప్రాంతాలల్లో వీరు దొంగతనాలు చేయటం, అడ్డు వచ్చినవారిని రాళ్లతో తలపై మోదటం చేస్తుంటారు.
ఈ నేరస్థులలో ఎవరైనా పట్టుబడితే అతనిని ప్రజాసేవకుడుగా ప్రచారం చేసి విడిపించేందుకు కొందరు లాయర్లు సిద్ధంగా ఉన్నారు. వారు కూడా ఈ దొంగల ముఠాలో భాగమే.
అంతేకాదు ప్రణాళికాబద్ధంగా కొందరు దొంగలు ఎన్నికలలో పాల్గొని ప్రజాప్రతి నిధులుగా మారి ఈ ముఠాలకు రాజకీయ రక్షణ కల్పిస్తుంటారు. ఇదొక అంతర్జాతీయ పద్మవ్యూహం.
యువర్ ఆనర్!
కరుణామయుడు దీపక్‌చంద్‌కు పుత్ర శోకం తగునా?
మొక్కిన వరమీయని వేల్పులు-
ఏ హనుమాన్‌లు, సులేమాన్‌లు ఎందుకు ఆదుకోలేదు? ఈ ధర్మం, న్యాయం, దయ తాటాకులకూ, వేదపండితుల పెదవులకూ పరిమితమైన పదములా?
సమాజంలో ఎక్కడుంది ధర్మం? ఎక్కడుంది మానవత్వం? యువర్ ఆనర్! మానవ సమాజంలో ‘జంగిల్’లా ఉంది.’’
కోర్టు హాల్‌లో గందరగోళం - పోలీసులు ఇలా చెప్పారు.
‘‘ఈ గోడ్బోలే అసలు పేరు వాహిబ్ అబ్దుల్లా. ఇతడు హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం వచ్చి పేరు, మతం మార్చుకున్నాను. ఈ సమాచారం మా శాఖకు ముందుగానే తెలిసి ఇతనిని ట్రాన్స్‌పోర్టు కంపెనీలో గంజాయి- తుపాకులు ఎగుమతి దిగుమతులు చేసిన వివరాలు సేకరించవలసిందిగా కోరాము’’
‘‘వివరాలు అందించాడా?’’
‘‘అందించాడు యువర్ ఆనర్! అంతేకాకుండా దుబాయ సందేశాలు, చేవెళ్ళ రహస్యం కూడా వివరించాడు’’
‘‘ఇతడు గూఢచారి అయతే ఇలాంటి సహాయం భారత పోలీసు రహస్య విభాగానికి ఎలా చేయగలిగాడు?’’
‘‘అదే తెలుసుకుంటున్నాను యువర్ ఆనర్! ఇతనిని పోలీసు రిమాండ్‌కు అప్పగించవలసిందిగా కోరుతున్నాం’’
పోలీసుల కోరికను జడ్జి మన్నించి 14 రోజులు రిమాండ్ విధించారు. వాహిబ్ అబ్దుల్లాను పోలీసులు తమ వెంట తీసుకొని పోయారు. ఆయన భార్య ఆమ్రపాలి, బిడ్డ శైలజ కోర్టు హాలుక్ష్మిఊ పెద్దగా ఏడ్చారు.
‘నిజాయతీకి ఇదా ప్రతిఫలం?’ అని ఆమె రోదిస్తూ అన్నది.
ఆమ్రపాలిని దీపక్‌చంద్ ఓదార్చాడు.
***
ముందు లో వాహిబ్ అబ్దుల్లా అన్ని విషయాలు చెప్పాడు. భారతదేశంలో ఇస్రో అనే సంస్థ శ్రీహరికోట (ఎపి) నుండి పనిచేస్తున్నది.

- ఇంకా ఉంది

-ప్రొఫెసర్ ముదిగొండ శివప్రసాద్ చారిత్రక నవలా చక్రవర్తి