డైలీ సీరియల్

త్యాగమే పరమోన్నతం ( వృత్రాసురుడు - 5)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మాటలకు మరింత ఆశ్చర్యపోతూ దేవేంద్రుడు వృత్రాసురుడిని చూశాడు. తన అనుచరులంతా పారిపోతున్నా, తాము ఓడిపోతున్నా, నా చేతిలో సంహరించబడుతాడని తెలిసినా కూడా ఎందుకింత ఆనందంగా ఉన్నాడు. తనకు ప్రాణం పోతుందని భయం లేదా? అనుకొన్నాడు ఇంద్రుడు.ఇంద్రుని మనోగతాన్ని తెలుసుకొన్న వృత్రాసురుడు ‘దేవేంద్రా! నీకు నా సంగతి ముందు తెలుస్తుందిలే ఇకనైనా జాగు చేయక వజ్రాయుధంతో నన్ను కడతేర్చు’అంటూనే తన కరవాలాన్ని ఎత్తాడు. దేవేంద్రుడు కూడా వృత్రాసురుని కరవాలాన్ని తప్పించుకుంటూనే తన వజ్రాయుధం దెబ్బను వృత్రాసురునిపైకి గట్టిగా తగిలేలా వేశాడు. కానీ ఆ దెబ్బనుంచి తప్పించుకుంటూ వృత్రుడు పెద్దగా నోరు తెరిచాడు. భూమ్యాకాశాలన్నీ ఆ నోట్లో ఇమిడిపోతాయేమో అన్నంత పెద్దగా నోరు తెరిచి ఐరావతంతో సహా దేవేంద్రుడిని మింగడానికి ముందుకు వచ్చాడు. దాన్ని చూసి అమరులంతా హాహాకారాలు చేశారు. కానీ ఉన్నట్టుండి ఐరావతంపై కూర్చున్న ఇంద్రుడిని ఒక్క సారిగా వృత్రుడు మింగివేశాడు.
వృత్రుని కడుపులోకి వెళ్లిన ఇంద్రుడు కోపాన్ని విడిచిపెట్టలేదు. భయపడలేదు. మహావిష్ణువును మనసున తలుచుకున్నాడు. నారాయణకవచాన్ని పఠించాడు. అమితోత్సాహంతో వృత్రుని ఉదరాన్ని కోసివేశాడు. సూర్యప్రకాశంతో ఐరావతంతో సహా ఇంద్రుడు బయటపడ్డాడు. అప్పటిదాకా చీకట్లు కమ్ముకున్న ప్రపంచం సూర్యుని వెలుగు సోకినట్లుగా మిరుమిట్లు కొలిపేకాంతితో వెలిగింది. సూర్యచంద్రులు, సాధువులు, సజ్జనులు అందరూ ఇంద్రుడిని చూసి సంతోషించారు. తన చేత ఉన్న వజ్రాయుధాన్ని గిరగిరా తిప్పి వేగంగా వృత్రునిపైకి ఇంద్రుడు విసిరాడు.
వేగంగా వచ్చే వజ్రాయుధానికి తలవంచి నమస్కరిస్తూ వృత్రాసురుడు నిల్చున్నాడు. అక్కడున్న అందరూ ఆశ్చర్యచకితులై చూస్తుండగా వజ్రాయుధం వృత్రాసురుని మెడను నరికివేసింది. ఆయనలోంచి దేదీప్యమానంగా వెలిగే ఓ దివ్యజ్యోతి బయటకు వచ్చి శ్రీమన్నారాయణుని హృదయంలో ఐక్యమైంది. దేవేంద్రునిపైన దేవతలు పుష్పవృష్టి కురిపించారు.తామస రూపుడైన వృత్రాసురుని కి నారాయణునిపై ఎట్లా నిశ్చలమైన నమ్మకం , భక్తి ఎలా కుదిరాయో తెలుసుకోవాలనుకొన్నారు. చివరకు ఆ వృత్రాసురుని నుంచి వచ్చిన దివ్యజ్యోతి నారాయణునిలో ఐక్యం అవడానికి ఆశ్చర్యపడిన వారు వృత్రాసురుని గూర్చి తెలుసుకోవడానికి కైలాసం వెళ్లారు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804