డైలీ సీరియల్

దూతికా విజయం ( కొత్త సీరియల్ ప్రారంభం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ శతాబ్ది రచయిత
క్రమశిక్షణ..
మానవత్వం..
రాజీలేని తత్త్వం..
చెయ్యిచాచని గుణం..
స్వేచ్ఛా జీవితం..
ఇలాంటి లక్షణాలన్నీ ఒకే మనిషిలో కనిపిస్తాయి. ఆయనే ధనికొండ. ఇవే కాదండోయ్.. ఆయనకు
మరి కొన్ని లక్షణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే..
కాలానికి ముందు నడిచే రచయితగా..
ఫ్రాయిడ్ మానవ మనస్తత్వాన్ని అంతర్లీన దృష్టితో అర్థం చేసుకోవడమే కాకుండా.. మనసు పొరల్లో దాగిన
విషయాల్ని సూటిగా, సుత్తిలేకుండా, అలతి అలతి పదాలతో సున్నితంగా చెప్పగల ఘనాపాఠి..
వస్తువుతో పాటు సంవిధానం విషయంలో కూడా నూతనత్వాన్ని అనుసరిస్తూ.. సరళంగా,
సంభాషణా చాతుర్యంతో.. రచనా వైదుష్యంతో సాగుతాయి ఆయన రచనలు..
ఆయన రచనా శిల్పం ఆదర్శనీయం..
కథకుడిగా..
నవలాకారుడిగా..
నాటక రచయితగా..
వ్యాస రచయితగా..
అనువాద రచయితగా..
ఇలా.. ధనికొండ సాహిత్య సృజనకు ఎన్నో మాధ్యమాలు..
ఎన్నో.. ఎనె్నన్నో రచనలు..
ఒకదాన్ని మించి ఒకటిగా..
అంతేకాదు..
ధనికొండ హనుమంతరావుగారు..
పత్రికా సంపాదకుడిగా..
పత్రికా వ్యవస్థాపకుడిగా..
ముద్రాపకుడిగా..
ఆయన కృషి, సేవలు అమోఘం..
బహుశా..
బహుముఖ ప్రజ్ఞాశాలి అనే పదం వీరికి అన్వయించడం సరికాదేమో..
ఆయన రచనల్లాగే ఆయన వ్యక్తిత్వం కూడా అధునాతనమైనది. ‘మీటూ’ అంటూ నేడు ధైర్యంగా ముందుకు వస్తున్న మహిళలను చూస్తున్నాం. కానీ ఆనాడే.. అలాంటి ధైర్యాన్ని స్ర్తిలకు తన కథల ద్వారా నూరిపోశారు. మచ్చలేని వ్యక్తిత్వం ఆయన సొంతం. ఆయన రచనలు చదివినప్పుడు సమాజానికి సంబంధించిన మనోవేదన మన మన్ఫఃలకాన్ని తాకుతుంది.. ఆలోచింపజేస్తుంది.. ఆచరణ సాధ్యం చేస్తుంది.. అందుకే ధనికొండ 21 శతాబ్దపు రచయిత కూడా.. అలాంటి మహోన్నత రచయిత కలం నుంచి జాలువారిన ‘దూతికా విజయం’ ఆంధ్రభూమి పాఠకులకు ప్రత్యేకం.. *
==========================================================

జాము పొద్దెక్కినా చిన్నరాణి మాధవీదేవి నిద్ర నుంచి మేల్కొనలేదు. పరిచారికలకు ఏమీ పాలుపోలేదు. ఆమెకు నిద్రాభంగం చేసే సాహసం ఎవ్వరికీ లేదు. రాణికి ఎంతో సన్నిహితంగా వుండే ప్రియ చెలి సరస్వతే ఎంతో ఆందోళనకు గురైంది.
తీరా నిద్రలేచాక ఇంత పొద్దెక్కేదాకా తనను గాఢ నిద్రలో ఉంచినందుకు చిన్నరాణి ఏమంటుందో? మేల్కొల్పితే ఏం చికాకుపడి కోపం చేస్తుందో? సేవికలందరూ ఎటూ తోచక కొట్టుమిట్టాడుతున్నారు.
అందునా ఇవాళ నవరాత్రీ ఉత్సవాల ఆరంభ దినం. ఈ దినాన అవంతీ పట్టణమంతా కోలాహలంగా ఉంటుంది. ఏవో కొత్త శక్తులు ఆవహించిన విధంగా పౌరులందరూ ఎంతో ఉద్విగ్నంగా ఉంటారు. కానీ, ఈ తొమ్మిది రోజులూ రాత్రింబవళ్ళు రాజవంశంలోని ఆబాలగోపాలమూ ఉత్సాహంగా గడుపుతారు.
ఎన్నడూ లేనిది ఇలాంటి పర్వదినానే చిన్నరాణికి రుూ బద్ధకమంతా ఎలా వచ్చి పడిందో ఎవ్వరూ ఊహించలేకుండా ఉన్నారు. మధ్యాహ్నం భోజనాలయ్యాక ఇవాళనుంచీ ప్రతిరోజూ సాయంత్రందాకా అనేక వినోదాలకు రాజధానిలో ఏర్పాట్లు జరుగతవి. వివిధ కళలలో పోటీలు నిర్వహించబడుతవి. బలప్రదర్శన, పరుగు పందాలూ, గుర్రపు స్వారీ పందాలు, కత్తియుద్ధాలూ, నృత్యాలూ- ఒకటేమిటి కళామతల్లి రూప విశేషాలన్నిటా పోటీలే!
దేశ దేశాలనుంచీ అనేకమంది ప్రవీణులు వచ్చి పోటీలలో పాల్గొని అవంతీ రాజ్యాధిపతి ధర్మపాలుని మెప్పుకోళ్ళతోపాటు విలువైన బహుమతులు కూడా అందుకోవాలని ఉవ్విళ్ళూరుతుంటారు. మైదానం మీద తొణకకుండా మందగమనంతో ప్రవహించే మహానదికి జలపాతం ఎదురైనప్పుడు దూకే వేగంలాంటిది ప్రతి పౌరునిలోనూ ప్రస్ఫుటవౌతూండే ఈ తొమ్మిది రోజులూ అవంతీ రాజ్యంలో మరువలేనివి. మళ్ళీ సంవత్సరం దాకా ఇలాంటి అవకాశం రాదని అందరికీ తెలుసు. సంవత్సరంపాటు చూపిన ఓర్పుకు ప్రతిఫలం ఈ వేడుకలు!
ఇలాటి పుణ్యకాలంలోనే చిన్నరాణిని ఆవహించిన నిద్రాదేవిక్కూడా మెలకువ రాలేదంటే ఏమనుకోవాలి? ఒకవేళ ఆమె ఆరోగ్యం బాగాలేదేమో? జ్వరం వచ్చిందేమో? ఆమె శరీరాన్ని తాకి ఉష్ణం చూసే సాహసం ఎవరికీ లేదు. అలసిపోయి ఆదమరచి నిద్రిస్తున్న ఆమె, మేల్కొనమని చెప్పే ఈ అయోమయావస్థ పరిచారికలకు తప్పదు.
క్షణాలు గడుస్తున్నకొద్దీ పరివారంలోని ప్రతి ఒక్కరి ఆతృతా అధిగమిస్తోంది. చనువూ, సౌహార్ద్రమూ వున్న సరస్వతే ఏదైనా ఉపాయం ఆలోచిస్తే తప్ప ఈ అపాయం గడవదు. ఈ సత్యం అందరికీ తెలుసు. ఎందుకంటే సరస్వతి చిన్న రాణికి ఆంతరంగికురాలు. చిన్నతనం నుంచీ సేవకురాలనే ధోరణిలోనే గాక, హోదా మినహా మిగతా అన్నిటా చిన్నరాణితో సమానురాలుగానే పెరిగింది. పెళ్ళయి అత్తవారింటికి కాపరానికి వచ్చేటప్పుడు పుట్టింటివారిచ్చిన సారె అంతా ఒక ఎత్తయితే, సరస్వతి ఒక్కతే ఒక ఎత్తుగా చిన్నరాణి భావించింది. భరణమొచ్చిన చెలికత్తె తప్ప తదితరులు రుూ సమస్యను పరిష్కరించే సామర్థ్యం లేనివారే!
కనుసన్నలతోనే అందరూ సరస్వతిని అర్థించారు. ఒక్కమాట కూడా మాట్లాడకుండానే పరిస్థితిని అందరూ సింహావలోకనం చేశారు. వేళకు వినోద కార్యక్రమాల్లో పాల్గొనకపోతే ధర్మపాలుని నుంచి మాట వస్తుంది. రాచరికానికే మచ్చ వచ్చినంతగా రాజు బాధపడితే, అంతకు వంద రెట్లు బాధ దాస దాసీ జనానికి ప్రతిఫలమై తీరుతుంది.
సరస్వతి సాహసించక తప్పలేదు. అడుగులో అడుగు వేసుకుంటూ పిల్లివలె చిన్నరాణి శయన మందిరంలో ప్రవేశించింది. ఏ విధమైన శబ్దమూ కాకుండానే కిటికీలకు దించబడిన తెరలను మెల్లిగా తొలగించింది. బాల భానుని కిరణాలు సరాసరి చిన్నరాణి శయ్యమీదికి జొరబడినవి. ఎర్రగా కాల్చిన ఇనుప చువ్వలు మొహంమీద పెట్టినంతగా ఉలిక్కిపడి చిన్నరాణి మాధవీదేవి పక్కకు ఒత్తిగిల్లింది.
కళ్ళు తెరవకుండానే ‘‘సరూ! నేను మేలుకొనే ఉన్నానే!’’ అన్నది చిన్నరాణి.
ఇక ఆమె అనారోగ్యమే బద్ధకానికి కారణమై ఉండొచ్చని సరస్వతీ, ఆమెతోపాటు ఇదంతా గమనిస్తున్న పరివారమూ భావించారు.
ఇదే నిజమైతే రుూ సంవత్సరం జరిగే నవరాత్రీ ఉత్సవాలకు చిన్నరాణితో పాటు తామంతా నీళ్ళధార వదలవలసే ఉంటుందనే దిగులు దాస దాసీ జనానికి పట్టుకుంది. మెలకువ వచ్చినా చిన్నరాణి బడలికతో మంచానికి కరచుకుపోవటం ఎందుకనో?

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు