డైలీ సీరియల్

క్షణికములే సుఖదుఃఖాలు ( చిత్రకేతువు -1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకానొక కాలంలో చిత్రకేతువు అనే రాజు ఉండేవాడు. అతడు భోగభాగ్యాలలో, యజ్ఞాలు చేయడంలో ఇంద్రుడంతటివాడని పేరుతెచ్చుకున్నాడు. అపార ధనరాసులతో తులతూగే అతని రాజ్యంలో ధర్మపాలన చక్కగా సాగేది. ఆయన రాజ్యంలో అవిద్యాపరులు కాని, జారులు, చోరులు, అధర్మపరులు కానీ ఉండేవారు కాదు.
ఆయన పట్టపురాణి కృతద్యుతి. ఆ పట్టపురాణి కూడా రాజుగారి ధర్మపాలనకు తోడుగా ఉండేది. కానీ చిత్రకేతువు సంతానం లేదు. దానికారణంగా ఆయన అసంతృప్తితో జీవించేవాడు. సంతానం కోసం కృతద్యుతి, చిత్రకేతువు ఎన్నో పూజలు, వ్రతాలు చేసేవారు. యజ్ఞాలు కూడా చేసేవారు. కానీ వారికి మాత్రం ఒక్క పుత్రుడన్నా పుట్టలేదు.
ఓరోజు అంగీరసుడను మహర్షి చిత్రకేతువు దగ్గరకు వచ్చాడు. చిత్రకేతువు అతని భార్య ఆ మహర్షి అతిథి మర్యాదలు చేశారు. మహర్షి వారికి ఉన్న బాధను అర్థం చేసుకున్నాడు. ‘నాయనా చిత్రకేతూ! నీవు మగసంతానం కలిగేట్టుగా వరం ఇస్తున్నాను. మీకు త్వరలో బిడ్డపుట్టి మీ ఇద్దరినీ సంతోషింప చేస్తాడు’అని చెప్పాడు.
మహర్షి ఆ విధంగా చెప్పడంతో చిత్రకేతువు, కృతద్యుతి ఆనందం పట్టలేకపోయారు. లేక లేక పుట్టబోయే బిడ్డను తలుచుకుని రాజ్యం అంతా సంబరాలు చేశారు. పురజనులు కూడా చాలా సంతోషించారు. కృతద్యుతినే కాక చిత్రకేతువుకుఇంకా చాలామంది భార్యలుండేవారు.
వారు కూడా చాలా ఆనందించారు.
చివరకు ఒకనాడు శుభమూహూర్తంలో కృతద్యుతి గర్భం ధరించింది. నెలలు నిండి ఒక మగబిడ్డను ప్రసవించింది. అంబరాన్నంటే సంబరాలు చిత్రకేతువు చేయించాడు. చిత్రకేతువు తనను, తన వంశాన్ని ఉద్దరించే శిశువు ఉదయించాడని ఎంతో సంతోషించాడు. ఇక అప్పట్నుంచి మహారాజు ఎక్కువ సమయం కృతద్యుతి దగ్గరే గడిపేవాడు. అది మిగిలిన భార్యలకు నచ్చలేదు.
చిత్రకేతువు కుమారునికి జాతక కర్మలు చేయించాడు. దిన దిన ప్రవర్థమానమయ్యే కుమారుడిని చూసి తల్లిదండ్రులు సంతోషించారు.
రాచకార్యాలను కూడా మంత్రులకు అప్పగించి రాకుమారుని దగ్గరే ఎక్కువ సమయం గడుపుతున్న చిత్రకేతువు పైన కృతద్యుతి తప్ప మిగిలిన రాణులంతా కక్షకట్టారు. దీనికంతా కారణం ఆ కృతద్యుతికి పుట్టిన కుమారుడే కనుక అతడే లేకపోతే రాజు మనందరి దగ్గరకు వచ్చేవాడు. అందరినీ సమానంగా చూసేవాడు. ఇపుడు ఈ పిల్లవాని వల్ల కేవలం కృతద్యుతికే అన్నింటిలోను ప్రాధాన్యత హెచ్చింది.
ఇక ఆమె రాజమాత అవుతుంది. అపుడు మనలను పట్టించుకునేవారు ఎవరూ ఉండరు. కనుక ఆ పిల్లవాడిని ఈ లోకంలో లేకుండా చేసేయాలి అని అనుకొన్నారు. వారి మాత్సర్యం పెరిగింది. ఒకనాడు విషాన్ని కలిపిన పాలను ఎంతోప్రేమగా ఆ పిల్లవానికి పట్టించారు.
పాపం ఏమీ తెలియని ఆ పసికందు ఆ పాలను తాగేశాడు. అంతే నిద్రపోయిన పిల్లవాడు నిద్రపోయినట్టే మృత్యువు ఒడిలోకి జారిపోయాడు.
నిద్రలేచిన రాజు, రాణి తమ పనులను ఆరంభించబోయే ముందు తమ పుత్రరత్నాన్ని చూడాలని చూశారు. విగతజీవుడై పడి ఉన్న కొడుకును చూసి ఆ భార్యాభర్తలిరువురు మిన్ను మన్ను ఏకమైయ్యేట్టుగా రోదించసాగారు.
- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి