డైలీ సీరియల్

దూతికా విజయం-4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతను పాల్గొని విజయుడైనట్లయితే చిన్నరాణి ఇంకెంతగానో ఆనందించి ఉండేది. అతను ఓడినట్లయితే మధురమైన పదార్థాలు ఆరగించాక, సముద్రపు నీళ్ళు తాగినట్లుండేది. అందుకని వీరభద్రుడి విజయాలే చిన్నరాణి మనసులో చెరగని ముద్రగా ఉండిపోయినవి.
సూర్యాస్తమయ సమయానికి ఆ పగటి కార్యక్రమాలు ముగిసినవి.
చిన్నరాణి తన పరివారంతో రాణివాసానికి తిరిగివెళ్లింది. ఆమె ముఖంలో ఇప్పుడు మళ్లీ జీవకళ తాండవమాడుతోంది. ఎంతో ఆనందోత్సాహం ఆమెలో ప్రస్ఫుటవౌతోంది. తమ రాణి సంతోషంగా ఉన్నందుకు సేవికలందరూ సంతోషించారు.
రాత్రి కార్యక్రమాలు - నాట్యాలు, నాటకాలు, గానసభలూను.
చిన్నరాణి తన పరివారానికంతకూ ఆజ్ఞ ఇచ్చింది. తనకు కాస్త శిరోభారంగా వున్న కారణాన తాను ఆ కార్యక్రమాలకు హాజరవలేదు. దాసదాసీ జనమంతా వెళ్ళవచ్చు.
‘‘నీవు కూడాను!’’ అన్నదామె సరస్వతిని ఉద్దేశించి.
‘‘నాకు ఓపిక లేదు రాణీ!’’
తనకు ఇష్టంలేకున్నా పరివారానికి నిరుత్సాహం కలగకుండా వాళ్ళ ఆనందానికి అడ్డు రాకుండా చిన్నరాణి ఇచ్చిన ఆజ్ఞ అందర్ని ఆనందపరిచింది. కొద్దిసేపట్లోనే రాణివాసంలో మాధవీదేవి, సరస్వతి మాత్రమే మిగిలారు.
‘‘సరూ!’’ అన్నది చిన్నరాణి వొళ్ళు విరుచుకుంటూ.
సరస్వతి పలకుండా మునిపంటితో కింది పెదవి కొరుక్కుంది.
ఆ భావాన్ని మాధవీదేవి గ్రహించింది.
‘శిరోభారం!’ అన్నదామె.
‘‘కాస్త ఫలహారం చేసి వెనె్నల్లో ఉద్యానవనంలో వాహ్యాళి చేస్తే పోతుంది’’ అన్నది సరస్వతి.
‘‘అదే అనుకుంటున్నాను’’ అన్నది మాధవీదేవి.
3
సరస్వతి చుట్టుపక్కలంతా చాలా నిశితంగా పరిశీలించింది. పచ్చపువ్వుల్ని పరిచినట్లుంది వెనె్నల. వివిధ ఫల పుష్ప తరువుల నీడల్లో సక్రమంగా అమర్చబడిన పెద్ద చదరంగపు బల్లవలె ఉన్నదా ఉద్యానవనం. చంద్రకిరణాల్లో వికసించే పుష్పాల సౌరభం ఎంతో ఆహ్లాదంగా వున్నది. వెలుగునీడల మేలుకలయిక కన్నులవిందుగా వున్నది. సువాసనల గుబాళింపులు నాసికలను అమితానందాన్ని అందిస్తూన్నవి.
మాధవీదేవి చంద్రకాంత శిలావేదిక మీద వెల్లకిలా పడుకొని మేఘాలతో దోబూచులాడుతూన్న రేరాజును తిలకిస్తోంది. చంద్రకాంతికి చంద్రశిల కరుగుతుందంటారు. చిన్నరాణి కళ్లు చంద్రశిలలు కాకపోయినా, అవి చెమ్మగిల్లి క్రమంగా కొలకుల్లో రెండు మంచి ముత్యాలవలె నిలిచినవి.
‘‘రాణీ!’’ అన్నది సరస్వతి, మాధవీదేవి కనుకొలకుల్లోని మంచి ముత్యాలను తుడిచివేస్తూ.
మాధవీదేవి వేడి నిట్టూర్పుతో చలిచలిగా వున్న వాతావరణంలోనికి కాస్త ఉష్ణం ప్రవేశించింది.
‘‘ఏమిటీ దౌర్భాగ్య జీవితం!’’ అన్నది మాధవీదేవి.
వివరణ లేకుండా జీవిత సింహావలోకనం సాధ్యంకాదు కనుక సరస్వతి మాట్లాడలేదు. ఆమె కన్నులు దూరదూరాలను గుచ్చి గుచ్చి చూస్తూ పహారా కాస్తూన్నవి.
‘‘సరూ! మాట్లాడవేం?’’
‘‘ఏం మాట్లాడేది రాణీ! ఏం జరిగిందో తెలియకుండా ఏమనేది?’’
‘‘రాత్రి ప్రభువులు చాలా చికాకుపడ్డారు!’’
‘‘ఏ విషయంలో?’’
‘‘తన వంశాంకురం విషయంలో!’’
సరస్వతి తన స్థానాన్ని మరిచి పగలబడి నవ్వింది. రాణి ముఖంలోకి చూసి ఆ హెచ్చరికతో ఆమె హఠాత్తుగా నోరు మూసుకోగలిగింది.
‘‘క్షమించు రాణీ!’’ అన్నది.
‘‘పోవే! నేను రాణినీ, నీవు చెలికత్తెవూ అనేది ఆ రాణివాసంలోనే. ఇక్కడ ఇద్దరమూ ఏక హృదయులమైన స్నేహితురాండ్రమని ఎందుకు మరిచిపోతావు?’’
రాణి సహృదయతకు సరస్వతి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నది.
‘‘మరొక్క సంవత్సరమే మనకీ వైభోగం?’’ అన్నది మాధవీదేవి కంఠస్వరంలో దుఃఖ తరంగాలు గంతులు వేస్తూండగా!
‘‘అంతేనా? ప్రభువులు అలాగే అన్నారా?’’
జవాబు చెప్పలేక రాణి తల ఊపింది.
‘‘సంవత్సరం వ్యవధి వున్నది కదా!’’ అని సరస్వతి ఊరడించాలని చూసింది.
‘‘కాలం రెక్కలు కట్టుకొని ఎగిరిపోతూన్నది. ఆ పట్టమహిషికి పట్టిన గతి చూస్తే నా మనసు తరుక్కుపోతోంది. త్వరలోనే నేను కూడా ఆ అధోగతిలోకి, ఆ లోయలో పడి ముక్కలు చెక్కలైపోతాననే భయం వేధిస్తూన్నది’’.
కొద్ది క్షణాలు భరించరాని నిశ్శబ్దం ఆవరించింది.
‘‘మన చేతుల్లో ఏమున్నదనీ?’’ అన్నది మాధవీదేవి.
‘‘రాణీ! మీరు అన్యధా భావించకపోతే-’’
‘‘నిన్ను నేను అపార్థం చేసుకోవటమంటే నన్ను నేనే అర్థం చేసుకోలేకపోవటమనే విషయం నీకు తెలియదా సరూ!’’ అన్నది రాణి.
‘‘ఈ చట్టాలూ, కట్టడులూ- అధికారం చేతుల్లో వున్న మగవాళ్ళు తయారుచేశారు కనుకనే, అవన్నీ మగువల పాలిట మహాసర్పాలైనవి రాణీ! ఒక భార్య ద్వారా తనకు సంతానం కలగలేదని ప్రభువులు ఆమెకు ‘గొడ్రాలు’ అని ముద్రవేసి, మరో పెళ్ళిచేసుకున్నారు. మీకూ సంతానం కలగకుంటే మీకూ అదే ముద్ర పడుతుందనటంలో సందేహంలేదు. ఐతే రాజుగారి అసమర్థత, అరసికత, సంతానాన్నివ్వలేని నిస్సహాయతా విచారించేవారెవరు? అధికారమంతా ఆయనదే కనుక, తనను తాను అన్యాయం చేసుకునే న్యాయాన్ని ఆయన ఇవ్వరు. పరిపాలనలో సర్వసమర్థుడనీ, ప్రజలను న్యాయబద్ధంగా కన్నబిడ్డలవలె చూసుకుంటాడనే కీర్తి వున్న ప్రభువుల అత్యాచారాలను విచారించి శిక్ష విధించేవారెవరు?
సామంతుడు కనుక మీ తండ్రిగారిని బెదిరించి మిమ్ము చేపట్టగలిగారే కానీ, తనకు యోగ్యత ఉన్నదా లేదా అని ఎన్నడైనా ఆలోచించారా? రుూ రాజకీయ దాంపత్య బంధంలోకి మరొక ప్రాణిని తీసుకుని రాలేకపోయిన నేరం కేవలం మీ మీదనే రుద్దేందుకు సాహసిస్తే, ప్రపంచ న్యాయ చట్టాలకు అతీతులుగా వున్న ప్రభువులు రేపు సకల విశ్వానికి ప్రభువులైన ఆ భగవానుని ముందు ఎలాంటి సంజాయిషీ చెప్పుకోగలరు?’’
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు