డైలీ సీరియల్

నామస్మరణే ముక్తికి మార్గం( చిత్రకేతువు - 4)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అపుడు చిత్రకేతువు లేచి ‘మహానుభావా! మీరు చెబుతున్నది అంతానిజమే. మీరు నాలో జ్ఞానాన్ని పుట్టించడానికే వచ్చారా? అసలు మీరు ఎవరు ఎందుకు నాకు ఇలాంటి జ్ఞానాన్ని బోధ చేస్తున్నారు’అని అడిగాడు.
‘‘చిత్రకేతూ మనుషులు, జంతువులు అసలు ప్రాణికోటి అంతా భగవంతుని ఆధీనంలో ఉంటాం.ఆయన నడిపించినట్టు నడుస్తుంటాం. మనకు ఇచ్చిన బుద్ధి ని ఉపయోగించి భగవంతుని తత్త్వాన్ని అర్థం చేసుకోవాలి.’’ అని అంగీ రసుడు చెప్పాడు.
‘‘చిత్రకేతు! నీకు నేను నారాయణ మంత్రాన్ని చెబుతాను. నీవు పరిశుద్ధమైన మనస్సుతో ఆ నారాయణ
మంత్రాన్ని అనుష్టించు. ఏడురోజుల్లో ఆ నారాయణుడు నీకు దివ్యదర్శన భాగ్యా న్ని కలుగచేస్తాడు. నీకు శుభం కలుగుతుంది’ అని నారదుడు చెప్పాడు.
చిత్రకేతువు మీరు చెప్పినట్లే చేస్తానని చెప్పి ఆ బాలునికి అంత్యక్రియలు చేసి నారదుని నుంచి నారాయణ మంత్రాన్ని ఉపదేశం పొందాడు.
నిర్మల మనస్కుడై నారాయణ మంత్రాన్ని జపించడానికి ఉద్యుక్తుడయ్యాడు. ప్రశాంత వాతావరణంలో నిశ్చలంగా కూర్చుని చిత్రకేతువు నారాయణ మంత్రాన్ని జపించసాగాడు. ఏడు రోజుల తరువాత చిత్రకేతువుకు విద్యాధర చక్రవర్తిత్వం లభించింది. ఇచ్ఛానుసారం ముల్లోకాలు తిరుగగలిగే దివ్యవిమానం కూడా ఒకటి లభ్యమైంది. అతడు ఎంతో సంతోషంతో వాటిని స్వీకరించి పరంధాముని చూడడానికి బయలుదేరాడు. కొంతదూరం తరువాత అతడికి నారాయణుడు పవ్వళించే ఆదిశేషువు కనిపించాడు.
ఆయన్ను స్తోత్రం చేశాడు. విద్యాధర చక్రవర్తి స్థానాన్ని పొంది చిత్రకేతువు చేసే స్తోత్రాన్ని విన్న ఆదిశేషు చాలా సంతోషించాడు. అతడు ‘ఓరుూ చిత్రకేతూ ! నీవు చాలా అదృష్టవంతుడివి. చాలామంది నరజన్మను ఎత్తి కూడా దాంపత్యబంధమనో తల్లిదండ్రుల సేవాబంధం అనో ఏదో ఒకపేరుపెట్టుకుంటూ అక్కడక్కడే తిరుగుతుంటారు. ఈ బంధమోక్షం జరిగిన తరువాత కానీ నన్ను గుర్తించరు. నీవీనాడు మోక్షార్హత పొందావు. నీకు అన్నీ శుభాలే జరుగుతాయి ’అని చెప్పి ఆ అనంతుడు అంతర్థానమై పోయాడు.
చిత్రకేతువు అనంతుడు మాయమైన దిక్కునే చూస్తూ వాసుదేవుని గూర్చి స్తుతించాడు. తనకు తెలిసిన భగవంతుని కథలు రమ్యంగా పాటలాగా పాడాడు. నర్తించాడు. భగవంతుని గుణగానం చేశాడు.
ఆ గానం వినడానికి గంధర్వులు, కింపురుషులు, సాధువులు అక్కడికి వచ్చారు. వారంతా కలసి కూడా విష్ణు సంకీర్తన చేశారు.
చిత్రకేతువు భగవంతుని నామోచ్చారణతోనే రోజులను సునాయాసంగా గడుపుతున్నాడు. ఒకరోజు కైలాసపర్వత ప్రాంతానికి వెళ్లాడు. అక్కడంతా మంచుకొండలు పరుచుకున్నాయి. శివుని విభూతియే అంతటా నిండి ఉందా అన్నట్టుగా మంచు కుప్పకుప్పలుగా పేరుకుని పోయి ఉంది.
అక్కడంతా గుంపుగుంపులు పరమేశ్వర దర్శనానికి వెళ్లేవారు చిత్రకేతువుకు కనిపించారు. తాను కూడా వారితో వెళ్లాడు.
అక్కడ బ్రహ్మాది దేవతలు పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. నారద తుంబరులు గానం తమ వాయిద్యాలను సరిచేసుకొంటూ శివనామ గానం చేస్తున్నారు.

- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804