డైలీ సీరియల్

కొత్త స్నేహితులు- 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘కిటికీ బయట కోతులేమైనా ఆడుతున్నాయా? తలుపు వేసి రాకుండా ఆ చూపేవిటి వెర్రివాడిలా!’’ అంది సామ్రాజ్ఞి తనన్న మాటలకు స్పందించకుండా నిర్నేమేషంగా కిటికీలోంచి బయటకు చూస్తోన్న భర్తనుద్దేశించి.
తమ ఇంటి పక్కన అద్దెకు ఉండేవాడిగానే తప్ప, అంతకుముందు ఎటువంటి పరిచయమూ లేనివాణ్ణి.. తాళికట్టినవాణ్ణి.. అందునా తొలి రాత్రి.. తన స్వేచ్ఛకేదో భంగం కలిగించినట్టుగా.. ఆ విధంగా చిన్నబుచ్చిన సామ్రాజ్ఞి మనస్తత్వం ఎందుకో భయం కలిగించిందతడి మనసులో. సాలెగూట్లో చిక్కుకున్న పురుగులా గిజగిజలాడిందతడి మనసు.
తనకు వెనె్నలంటే ఇష్టం. ఆమెకు చీకటంటే మక్కువ. తమ వైవాహిక జీవితం ఎంత అద్భుతంగా ఉండబోతోందో తెల్సుకుందుకు ఈ మాత్రం సూచన చాలదూ?!
తొలిరాత్రి.. అంత మొరటుగా ప్రవర్తించే భార్యలు కూడా ఉంటారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతోందతడి మనసు.
అన్యమనస్కంగానే లేచి కిటికీ తలుపులు వేసి తడుముకుంటూ వచ్చి మంచంమీద కూర్చున్నాడతడు. కాస్సేపు నిశ్శబ్దం! అతడు సరేసరి! ఆమె కూడా ఏమీ మాట్లాడలేదు.
అలా అయిదు నిమిషాలు గడిచాక, ‘‘పక్కకొచ్చి దగ్గరగా పడుకోమని కూడా నేనే చెప్పాలా?’’ అందామె ఉరుములేని పిడుగులా. స్వరం పెద్దగా లేకపోయినా మాటల్లో ఈసడింపు, అసహనం మాత్రం స్పష్టంగా ధ్వనించాయతడికి.
ఆడదానికైనా, మగాడికైనా మనసుకు మాత్రమే సంబందించిన విషయాన్ని, ఏదో భౌతికమైన చర్యలా భావించి తనను అంత భావరహితంగా దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తోన్న సామ్రాజ్ఞికి అసలు మనసనేది ఉందా? అనిపించిందతడికి. మొదటిరోజే ఈమెతో ఇలా ఉంటే.. భావి జీవితం ఎలా ఉండబోతోందో అనే దిగులు అంతకంతకూ పెరిగిపోసాగిందతడిలో.
తను నోరు విడిచి దగ్గరకు రమ్మని పిలిచినా అతడిలో చలనం లేకపోవడంతో అసహనం హద్దులు దాటిందామెకు.
‘‘ఒడ్డూ, పొడవూ ఉండి అందంగా, ఎర్రగా ఉన్నానని మురిసిపోవడమేనా? చేతలు కూడా ఏవైనా ఉన్నాయా?’’ అందామె కంఠంలో విసుగును ధ్వనింపజేస్తూ.
తనూ ఆమె ధోరణితోనే మాట్లాడి ఆమెను చిన్నబుచ్చలేక తనను తాను తమాయించుకుంటూ, తాత్కాలికంగా చిలిపిదనాన్ని బలవంతంగా గొంతులోకి అరువు తెచ్చుకుని, ‘‘అన్నీ నువ్వే చూసుకుంటావని చెప్పారు మా స్నేహితులు మరి!’’ అన్నాడు అమాయకత్వం నటిస్తున్నానని మురిసిపోతూ.
‘‘నా పిచ్చిగానీ.. ఏబ్రాసి వాళ్లకు ఏబ్రాసివాళ్లు కాక బుద్ధున్నవాళ్ళు స్నేహితులుగా దొరుకుతారా? ఈ రాత్రి ఏం చేయాలో తెలియకపోతే.. అదిగో ఆ బల్లమీద పెట్టారు.. పళ్లూ, ఫలహారాలూ.. వాటిని పీకలదాకా ఆరగించి, కడుపునిండిన తర్వాత మంచంమీద పడుకుని తెల్లవారే వరకూ దున్నపోతులా నిద్రపోండి..’’ అందామె కసిగా.
ఇంతమాత్రానికే అంత కోపం తెచ్చుకుంటే ఎలా సామూ! ఊరకే నిన్ను ఆట పట్టించేందుకు అన్నానంతే! అని మంచంమీద పడుకుని వున్న ఆమె మీద చేయి వేయబోయాడు సామ్రాట్.
అతడి చేతిని విదిల్చికొట్టి, ‘‘అంటే.. అంటే.. నాకు పూర్వానుభవం ఏమైనా ఉందేమోని నన్ను పరీక్షిస్తున్నారా?’’ అందామె గొంతు పెంచి.
‘‘్ఛ.. ఛా.. అవేం మాటలు సామూ.. ఏదో సరదాగా ఉందామని అలా అన్నానంతే! నీకిష్టం లేకపోతే.. ఆ విషయం మర్చిపోదాం.. నువ్వు కొంచెం జరిగితే నేనూ పడుకుంటాను మరి’’ అన్నాడు సామ్రాట్ ఆ చీకట్లోనే మంచంమీద చేయి వేసి తడుముతూ.
‘‘మీ పనికిమాలిన స్నేహితులేదో చెప్పారని మొదటి రాత్రి అనైనా చూడకుండా నన్నింత అవమానించిన తర్వాత కూడా నా పక్కన పడుకుందామని ఎలా అనుకుంటున్నారు? మీరు. మీ స్నేహితులూ బేషరతుగా నాకు క్షమపాణ చెప్పిన తర్వాతే మన సంసారం’’ అందామె.
ఆమె ఒకందుకు అలా అన్నా, ఆ రాత్రి మనసు చంపుకుని ఆమెతో పడక పంచుకోవలసిన అవసరం తప్పినందుకు మనసారా సంతోషించాడు సామ్రాట్.
***
రెండో రాత్రి గదిలోకి ప్రవేశించగానే కిటికీ తలుపులు మూసి, ట్యూబ్‌లైట్ స్విచ్ ఆఫ్ చేసి బెడ్‌లాంప్ వెలిగించాడు సామ్రాట్. సామ్రాజ్ఞి గదిలోకి ప్రవేశిస్తూనే, ‘‘నాక్కళ్లెలా కనిపిస్తాయనుకున్నారు ఆ గుడ్డిదీపపు వెలుతుర్లో!’’ అంది అసహనంగా.
‘‘సారీ సామూ.. లైటుంటే నీకిష్టం ఉండదు కదా అని..’’ అంటూ కూర్చున్న చోటినుంచి లేచి లైటు స్విచ్ ఆన్ చేశాడు సామ్రాట్.
ఆమె ఒక్క క్షణం అతడివైపు చూసి మూతి మూడు వంకర్లు తిప్పుతూ, ‘‘ఏదైనా పనిచసే ముందు కాస్త అవతలివాళ్ల వైపు నుంచి కూడా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి’’ అంది.
‘‘నీ గురించి ఆలోచించే కదా నీకిష్టమని నేనా పని చేసింది?’’ అనబోయి, ‘‘ఊ..’’ అన్నాడు వెర్రి నవ్వు నవ్వుతూ సామ్రాట్.
‘‘అలా పళ్లన్నీ కనిపించేలా నా దగ్గర నవ్వితే నవ్వారు గానీ ఇంకెవరిముందూ అలా నవ్వకండి’’ అంది సామ్రాజ్ఞి ఆజ్ఞాపిస్తున్నట్లుగా.
‘‘చిత్తం మహారాణీ తమ ఆజ్ఞ!’’ అన్నాడు సామ్రాట్ ఆమెను ప్రసన్నం చేసుకున్నట్టుంటుందని.
‘‘నాటకాలేసేవాడిలా ఆ డైలాగులేమిటీ రోతగా! నేను మహారాణినైతే మీరు నాకు సేవకుడా?’’
‘‘నిజం సామూ.. నిన్ను చూస్తోంటే నాకెందుకో అలానే అనిపిస్తోంది’’
‘‘ఇటువంటి మెరమెచ్చు మాటలకు లొంగిపోయి నేను మీకు దాసోహమనుకుంటున్నారేమో! అటువంటి కలలు కనడం మానేసి మామూలుగా ఉండటం నేర్చుకోండి..’’
‘‘నిజంగా నువ్వెంతో అందంగా ఉన్నావు సామూ..’’ అన్నాడు సామ్రాట్ ఆమెకు దగ్గరగా వస్తూ.
‘‘కొత్త మోజు కదా! అలానే అనిపిస్తుంది కొన్ని రోజులు. ఇవే మాటలు ఓ ఏడాది గడిచాక చెప్తే అప్పుడాలోచిద్దాం’’.
‘‘ముందు ముందు నువ్వే చూస్తావుగా.. ఇహ పడుకుందామా?!’’

-ఇంకాఉంది

సీతాసత్య