డైలీ సీరియల్

సర్వం జగన్నాథం (చిత్రకేతువు - 5)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డమరుకం, మృదగం వాయిద్యధ్వనులకు అనుగుణంగా భృంగి నాట్యమాడుతున్నాడు. ప్రమధగణాలు శివుని గొప్పతనాన్ని కేకలు వేస్తూ చెబుతూ తమలో తాము ఆనందంతో తన్మయులౌతున్నారు.
వీరందరి మధ్యలో పరమేశ్వరుని అంకపీఠంపై పార్వతీ దేవి ఆసీనులరాలై ఈ చిత్రకేతువుకు కనిపించాడు. మితిలేని ఆనందాన్ని అనుభవించాడు. ఆతరువాత పరమేశ్వరుని కౌగలించుకుని కూర్చున్న అమ్మవారిని చూసి పట్టలేక నవ్వాడు. ఇదేమిటి చోద్యం, యోగిపుంగవులు, మహాతప్పసంపన్నులు, బ్రహ్మవేత్తలు, భృంగి, ప్రమథ గణాలు సకలురు వేంచేసి ఉన్న సమయంలోతొట్రుపాటు లేకుండామగని కౌగించుకుని పార్వతీదేవికూర్చుని ఉంది. సామాన్యమానవుని వలె శృంగార కార్యకలాపాలకు చాటులేకుండా ఇంతమందిలో ఇలా చేస్తున్నాడేమిటీ పరమశివుడు అని పకాలున చిత్రకేతువు నవ్వాడు. ఇదెక్కడి వింత పరమేశ్వరుడు మరీ ఇంత ప్రేమ వివశుడా.. నెచ్చలులతో కూడి సభలకు వస్తారా అని మరలా మరలా చిత్రకేతువు నవ్వాడు.
ఇలా నవ్వడం పార్వతీదేవి చూసింది. ఆమెకు ఆగ్రహం కలిగింది.
‘ఏమి ఇతని గర్వాంధకారం? ఏ అర్హత ఉందని ఇలా వాగుతున్నాడు వీడు. భృగు, నారద, కపిల మహర్షి వంటివారే మమ్ములను పరిహసించలేదే? పరాత్పరుని స్వరూపాన్ని తెలుసుకోలేక వేదాలు వాదులాడు తుంటాయో ఏ పరాత్పరుని కరుణాకటాక్షం కోసం లోకాలన్నీ ఎదురుచూస్తుంటాయో అటువంటి పరమేశ్వరుడు, ధీరోదాత్తుడు, నిత్యకల్యాణుణ్ణి ప్రేమ వివశుడు అని గేలి చేస్తున్నాడు. సిగ్గులేకుండా నేను పరమేశ్వరుని దగ్గర ఉన్నానంటూ ప్రల్లదాలు పలుకుతున్నాడు. వీడు తప్పక శిక్షార్హుడే. తప్పనిసరిగా వీనికి దండన విధించాల్సిందే . సర్వమంగళాలకు మూలకారణమైనది, సజ్జనులు సేవించేది అయిన విష్ణుదేవుని పాదపద్మారాధనానికి వీడు పనికిరాడు. ‘ఓరుూ! నీవు రాక్షసజాతిలో జన్మించు. ఇకముందైనా ఎవరినీ నిందించకు. మహానుభావులను అవమానించకు’ అని గట్టిగా పార్వతీ దేవి చిత్రకేతువును శపించింది.
ఆ పలుకులను చిత్రకేతువు విన్నాడు. వెంటనే తన దివ్య విమానం నుంచి దిగి పార్వతీ పరమేశ్వరులకు సాష్టాంగ నమస్కారం చేశాడు.
‘ ఓ జగజ్జననీ తల్లీ నేను నీ శాపాన్ని శిరసావహిస్తున్నాను. తల్లీ మోహాంధకారంలో పడి కొట్టుకునే జీవులందరూ వారి వారి ఇష్టానుసారం జీవించడంలేదుకదా. వారంతా అస్వతంత్రులు. భగవంతుని మాయలో లోకాలను సృష్టిస్తాడు. జీవులకు రాగద్వేషాలు కల్పిస్తూ వారిని సుఖదుఃఖాలను అనుభవించేటట్లు చేస్తుంటాడు. తాను మాత్రం వీటికన్నింటికీ అతీతంగా ఉంటాడు. సర్వత్రా విష్ణువే ఉన్నపుడు ఇక నేను ఎక్కడి వాడినమ్మా. కానీ నేను నిన్ను నిందించిన పాపానికి భయపడుతున్నాను. నన్ను మీరిద్దరూ క్షమించండి. అని తిరిగి వారిద్దరికీ సాష్టాంగ నమస్కారం చేశాడు. పార్వతీ దేవి చిత్రకేతుని మాటలతో ప్రసన్నురాలైంది. ఆమె చిరునవ్వు నవ్వడం చూసి చిత్రకేతువు తిరిగి నమస్కరించి అక్కడ్నుంచి తన దివ్యవిమానమెక్కి వెళ్లిపోయాడు.
ఆ తరువాత పార్వతీ దేవి పరమేశ్వరునితో ఇదేమి వింత? ఇతడిని నేను శపిస్తే ఆ శాపాన్ని స్వీకరిస్తాను అని చెప్పి నమస్కరించి వెళ్లిపోయాడేమిటి? అటువంటి వాడు మనలను చూసి పరిహసించాడెందుకు అని అడిగింది.
దానికి పరమేశ్వరుడు అతడు శ్రీహరి భక్తుడు. హరి భక్తులంతా సర్వాన్ని కృష్ణమయంగానే చూస్తారు. కనుక అతడికి నీవు రాక్షస జన్మ ఇచ్చినా అక్కడా అతడు శ్రీహరి నామానే్న జపిస్తాను కదా. ఎక్కడుంటే ఏమిటి శ్రీహరి నామోచ్చారణకు అని అనుకొన్నాడు అని చెప్పాడు. వారికి సర్వమూ శ్రీమన్నారాయణ స్వరూపంగానే ఉంటుంది. వేరు అయినది ఏమీ లేదు. సర్వమూ జగన్నారాయణుడే అయితే ఇందులో రాక్షసత్వమూ, దైవత్వమూ ఏముంది? మేమంతా కూడా నారాయణుని అంశలోని వారిమే అని పరమేశ్వరికి పరమేశ్వరుడు చెప్పాడు.
అయితే అని అడుగబోతున్న పార్వతీ దేవితో పరమేశ్వరుడు ఏమీ లేదు. ఈ చిత్రకేతువే త్వష్టప్రజాపతి చేసే యాగంలో వృత్రాసురునిగా పుడతాడు. ఇంద్రుని వజ్రాయుధంతో సంహరించబడి తిరిగి వాసుదేవుని సన్నిధిని చేరుకొంటాడు అని చెప్పాడు. ఇదిగో ఇదన్నమాట చిత్రకేతువు వృత్రాసురుల కథ.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804