డైలీ సీరియల్

దూతికా విజయం-6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంత ప్రసాదించినా, ఇంకా ఆ దైవం సహాయపడలేదని మానవుడు వాపోవడం అతని దురాశనూ, అసంతృప్తినీ, సోమరితనాన్నీ, అవివేకాన్ని, అల్పత్వాన్నీ సూచించటమే అవుతుందని నీకు అనిపించటంలేదా?
రాణి దిమ్మెరపోయింది. తర్క్భూయిష్టమైన సరస్వతి మాటలకు ఎదురాగడల సావకాశమే ఆమెకు లేకుండాపోయింది. సత్యానికి తలవంచటమంటే అది వ్యక్తిగత పరాజయమే ఐనప్పటికీ సత్యానికి జయమే కనుక మానవాళి దాన్ని సాధించేందుకే ప్రయత్నించటం ఉచితం కదా!
‘‘నాకు తెలియక అడుగుతాను- రుూ పూజలూ, వ్రతాలూ, కట్టడులూ స్ర్తికేనా? పురుషునికి అవసరం లేదా? దంపతులు సంతానాన్ని పొందలేనప్పుడు స్ర్తి వ్రతాలు చేసి, సంతాన గోపాలస్వామిని సేవించి తరించాలని ప్రయత్నించే విధంగానే పురుషుడు కూడా యజ్ఞయాగాదులు చేయడేమి? పూర్వం దశరథుడు పుత్రకామేష్టి చేశాడని విన్నాం.
మరి మన రాజు అలాంటిదేమీ తలపెట్టరేమి? ఆయన ఎంతకూ భౌతికమైన ప్రక్రియవ శరణుజొచ్చుతారెందుకని? కాయకల్ప చికిత్స మొదలూ, వీర్యవృద్ధి ఔషధ సేవలవరకూ, అత్యద్భుత ఫలితాలు ఇస్తాయనే మందు మాకులనుంచీ, హిమాలయ యోగింపుంగవుని లేహ్యాలవరకూ సేవిస్తారే కానీ కంటికి కనిపించని దైవాన్ని యాచించే కర్మకాండ జోలికి పోరేమి? ఎందుకంటే కఠినమూ అనుమానాస్పదమూ ఐన ప్రక్రియల్ని స్ర్తి జాతికి కేటాయించి తేలికైనవీ, భౌతికశాస్త్ర సిద్ధాంతాలకు అనుగుణంగా ఉండేవీ నిస్సందేహంగా ప్రక్రియల్ని పురుషుడు తాను పంచుకున్నాడు!
భర్త సౌఖ్యానికీ, ఐశ్వర్యానికీ, దీర్ఘ జీవితానికీ భార్యకు ఇన్ని నోములూ వ్రతాలు ఉన్నవి కదా! మరి భార్య ఆయురారోగ్య ఐశ్వర్యాలను సాధించే వ్రతాలేమీ భర్త చేయడేమి? అసలు అలాంటివి వున్నవని మనం ఎన్నడన్నా విన్నామా? భర్త ప్రాణాలను తిరిగి యమపాశాలనుండి రక్షించిన సతీ సావిత్రి కథ ఉన్నది. శాపకారణంగా శోభ మందిరంలో ఎంత జాగ్రత్త వహిచినప్పటికీ సర్పదష్టుడై చనిపోయిన తన భర్త శవానికి ప్రాణాలు సాధించి ఇచ్చిన వకుళాదేవి కథ వున్నది. భార్య ప్రాణాలను తిరిగి తేగలిగిన పురుష పుంగవుని కథ ఏ పురాణంలోనైనా వున్నదా?
దీన్నిబట్టి స్ర్తి ప్రాముఖ్యత ఎలాంటిదని పురుషుడు భావించి ప్రపంచాదినుంచీ అమలు జరిపి ప్రదర్శిస్తున్నాడో నేరుగా చర్చించవలసిన పనిలేదు!’’
‘‘అదంతా స్వార్థచింత సరూ!’’
‘‘అలా గ్రహించు. మానవుడు స్వార్థపరుడు. మానవజాతిని స్ర్తిపురుష భాగాలుగా చేస్తే పురుషుని స్వార్థచింత, స్ర్తి స్వార్థచింతకు ఎన్ని వందల రెట్లు అధికంగా వుంటుందో చూడు! తన రాజ్యాధికారానికి ఏం దెబ్బ తగులుతుందోనని నీ తండ్రి రుూడు జోడుకాకపోయినా, కాకి ముక్కున దొండపండని తెలిసి కూడా, అవంతీ రాజ్యానికి రెండవ రాణిగా నిన్ను పంపి తన స్వార్థాన్ని నిరూపించాడు. తన సౌఖ్యానికి ఎవరు, ఎక్కడ, ఏ విధంగా బలయినప్పటికీ తనకేమీ పట్టలేదని నిరూపించేందుకు అవంతీ దేశాధిపతి వెనుకాడలేదు. తనకు మొదటి భార్య ద్వారా సంతానం కలగలేదని కదా, రెండవ భార్యగా నిన్ను స్వీకరించింది? మొదటి భర్త ద్వారా తాను గర్భవతి కాని భార్యకు రెండవ భర్త ద్వారా గర్భప్రాప్తి కలిగేందుకు ఏ శాస్తమ్రూ ఎందుకు ఒప్పుకోదు? భూసారాన్ని శంకించి ఫలవంతమని భావించిన భూమిమీద రెండవసారి విత్తులు చల్లి అవీ మొలకెత్తకుంటే మార్చవలసింది బీజమా? క్షేత్రమా? పురుషునివలెనే స్ర్తికి కూడా మరొక అవకాశం ఎందుకు ఇవ్వబడదు? ఇంత స్వల్ప విషయాన్ని కూడా పురుషుని స్వార్థపరాయణత్వం ఆలోచించే స్థితిలో లేదు. అందుకని కదా నాకు పురుషజాతి అంటేనే తగని ద్వేషం!’’
రాణి తీవ్రమైన ఆలోచనలో పడింది. ఒక విధంగా సరస్వతి సమస్యను చర్చిస్తూనే పరిష్కార సూచనను కూడా తెలిసో, తెలియకో చేసింది. అది ఆమోదనీయమో కాదో, ఒకవేళ అంగీకరయోగ్యమైతే ప్రయోగ సాధ్యమో కాదో రాణికి అంతుబట్టలేదు. కష్టదశలో ఆ కష్టానికి గురైనవారికన్నా, ఆప్తులైనవారి మెదడు సరైన ఆలోచనల్ని చేయగలదు. అందుకని తాను సరస్వతి తెలివితేటల మీదనే ఆధారపడటంలో ఎంతో రక్షణ వున్నది.
‘వీరభద్రుడు’ అన్నది రాణి గొణుగుతున్న విధంగా, సరస్వతికి అంతా ఆ క్షణంలోనే ఆకళింపయింది.
‘‘రాణీ! చాలా ప్రమాదకరమైన ఊహను సారవంతమైన మెదడనే భూమిలో నాటి మహావృక్షంగా రూపొందిస్తున్నావు. నేనేదో సామ్యానికి, మాటవరుసకన్నాను. ఎంత అన్యాయం మనకు జరుగుతున్నప్పటికీ మనం దాన్ని ఎదుర్కొని జయించగలమనే నమ్మకం లేనప్పుడు దానికి లొంగిపోవడమే ఉచితం. ఉన్నంతలోనే తృప్తిపడటం మంచిది. అందని పళ్ళకోసం అర్రులు చాచి బోర్లాపడటం వివేకం కాదు. ఏదో విధమైన అన్యాయం అందరికీ జరుగుతూనే వున్నది. రాజుగారికి అన్నీ ఉన్నా సంతానం లేదు.
కలుగుతుందనే ఆశ కూడా అంతరిస్తూన్నది. జీవసమాధిలాంటి రాణివాసంలో మీలాంటి అప్సరస బంధించబడింది. ఇంతకన్నా నరకయాతనలు అనుభవిస్తూ రాణిగా చలామణి అయేందుకు అనేకమంది రమణులు సిద్ధంగా ఉన్నారు. నా సంగతేమిటి? రుూ జీవితమంతా మీతోపాటే మీ దాసిగానే గడపాలి కదా విధి శాసించిన ప్రకారమే రుూ జీవితం గడుస్తోందని సరిపెట్టుకుంటున్నాను. ఇంతకన్నా పై మెట్టుకు ఎగబాకేందుకు ప్రయత్నించి బోర్లాపడటం దేనికి?’’
‘‘అతని పేరెలా తెలుసుకున్నావు? ఎవర్నడిగావు?’’ అన్నది రాణి.
రాణి తాను చెప్పే విషయాన్ని విననట్లే నటించిందనేది స్పష్టమైంది. తన ప్రతిపాదనకు అనుకూలంగావుండే విధంగా సంభాషణ మార్చాలని రాణి ప్రయత్నిస్తోందని సరస్వతి తెలుసుకోగలిగింది.
‘‘నేనంత తెలివితక్కువ దాన్ననుకున్నావా రాణీ! పోటీ నిర్ణేతల దగ్గరకు వెళ్ళి అప్పుడేవచ్చినదానివలె నటిస్తూ, ‘రుూ పోటీలో ఎవరు గెలిచారు?’ అని అడిగాను. నేనీ పోటీ అంతా చూసి ఉండనందువల్ల రుూ ప్రశ్న అడిగి ఉంటానని వారు అతని పేరు చెప్పారు’’ అన్నది సరస్వతి. ‘‘మానవుడు సాధించగలిగినదాన్ని దైవం నుంచి ఆశించటం అవివేకమన్నావే సరూ! ఎంత నిజమోననిపిస్తోంది!’’ - ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు