డైలీ సీరియల్

అపురూపమూ.. అద్భుతమూ (రామకథ - 1)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దశరథుడు ధర్మసంపన్నుడని ఖ్యాతి వహించాడు. ఆయన రాజ్యం అయోధ్యలో అవిద్య అన్నది లేకుండా ఉండేది. పౌరులంతా ఆనందంతో సుఖసంతోషాలతో కాలం వెళ్లదీసేవారు. దశరథుడు తన బాహు విక్రమ పరాక్రమంతో దేవతలకు రాక్షసులకు యుద్ధం ఏర్పడినపుడు దేవతల వైపు యుద్ధం చేసి వారి విజయానికి కారణమైయ్యేవాడు. అయో ధ్యలో కృషీవలురు ముక్కారు పంటలతో ఆనందించేవారు. దేశ విదేశాల నుండి వచ్చే యాత్రికులు క్రయ విక్రయాలతో సందడి చేసేవారు. రత్నాలు పొదిగిన ఇళ్ళు ఆకాశాన్నంటే గోపురాలు మామిడి అరటి లాంటి తోపులు, ఋతువులననుసరించి ఫలాలనందించే తోటలు ఉన్న అయోధ్య పాదాచారుల అలసటను పొగొట్టేది. శత్రు దుర్బేధ్యంగా అగడ్తలు, ఎతె్తైన కోట బురుజులు, ప్రాకారాలు అష్టాదశ పద్మాకారంలో ఉన్న రాజ ప్రాసాదాలు చూపులను ఆకట్టుకొనేవి. శత్రువులకు భీతి కలిగించేవి. చూసిన వారు మహేంద్రుని అమరావతిని పోలి అయోధ్య వెలుగుతోందని అబ్బురపడేవారు.
సాధువులు, సన్యాసులు, సిద్ధులు లాంటి వారంతా దశరథుడు వేయేండ్లు సుఖసంతోషాలతో పాలన సాగించాలని దీవించేవారు. అటువంటి దశరథుడు . కౌసల్య, సుమిత్ర , కైక అనే ముగ్గురినీ దశరథ మహారాజు వివాహం చేసుకొన్నాడు. ఎన్ని ఏళ్లు ఎదురుచూసినా వారికి సంతాన భాగ్యం కలుగలేదు. నేను నిస్సంతుగా అయిపోతానేమో, నా వంశం నాతో అంతరించి పోతోందేమో అని దశరథుడు అమితంగా బాధపడుతుండేవాడు.
అలాంటి కాలంలోనే ఋష్యశృంగుడను మహర్షి దశరథుని చేత పుత్రకామేష్ఠి యాగం చేయించాడు. శ్రీరామ, భరత, లక్ష్మణ, శత్రుఘు్నలను నలుగురు పుత్రులు కలిగారు. రాణులు, రాజు అమితానంద పడ్డారు. రాణీవాసంలో ఆ నలుగురు పుత్రులు అపురూపంగా పెరుగుతున్నారు. కాలక్రమంలో వారు పెద్దవారు అవుతూ యుద్ధవిద్యలు నేర్చుకునే సమయంలోనే విశ్వామిత్రుడు శరథుని దగ్గరకు వచ్చాడు. దశరథుడు ఆ మహామునికి స్వాగత సత్కారాలు చేశాడు. ఏదైనా పని నిమిత్తం వచ్చి ఉంటే తెలుపుమని దానిని నిర్వర్తిస్తానని మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారం తన పుత్రులైన రామలక్ష్మణులను విశ్వామిత్రుడు యాగరక్షణార్థం పంపమని దశరథుని కోరుకున్నాడు.
దశరథుడు ఎంతో వేదనతో వారిని వదిలి ఉండలేక, మహర్షికి ఇచ్చిన మాట వదలలేక ఆయనతో పంపించాడు. రామలక్ష్మణులిద్దరూ మహర్షి వెంట నడిచి ఆయన్ను మెప్పించి ఎన్నో గాథలను విని, అస్తశ్రస్త్రాలను మహర్షి ద్వారా గ్రహించి విశ్వామిత్రుడు తలపెట్టిన యాగాన్ని రక్షించారు. ఆ మహర్షి ఆశీర్వాదాన్ని పొందారు.
దారిలో మిథిలానగర ప్రవేశం చేసిన రామలక్ష్మణులు జనకుని దగ్గర ఉన్న శివధనుస్సును చూశారు. మహర్షి ప్రోత్సాహంతో రాముడు శివధనుర్భంగం చేశాడు. జనకుడు తన మాట ప్రకారం రామునికి తన కుమార్తె అయిన సీతమ్మను ఇచ్చి వివాహం చేస్తానని చెప్పగా రాముడు తన తండ్రి అభీష్టం మేరకు తాను వివాహం చేసుకొంటానని చెప్పాడు.
జనకుడు, ఆయన తమ్ముడు కుశధ్వజుడు దశరథుని వివాహం చేయడానికి ఆజ్ఞను పొందాడు. అపుడు దశరథుడు, జనకుడు, కుశధ్వజులు బంధువులు, పురప్రజలు ఇలా అందరి సహకారంతో రామలక్ష్మణ భరత శత్రుఘు్నలకు సీత, ఊర్మిళ, మాండవి, శుత్రకీర్తిలను ఇచ్చి వివాహం చేశారు.
కొన్నాళ్లకు దశరథునికి రాముని పట్ట్భాషేకం చేద్దామని తలంపుకు వచ్చాడు. కానీ విధివశాత్తు కైకమ్మకు దశరథుడు ఇచ్చిన రెండు వరాల వల్ల రాముడు వనవాసం చేయాల్సి వచ్చింది.
- ఇంకాఉంది

డా. రాయసం లక్ష్మి