డైలీ సీరియల్

దూతికా విజయం-8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అంత పెద్ద మాటలనకు రాణీ! నాకు భయం.. చాలా పొద్దుపోయినట్టున్నది ఇక ప్రసాదానికి వెళ్దామా?’’
‘‘అలాగే.. రుూ రాత్రి తీయని కలలతో గడపగలుగుతాను. నిర్జీవమైపోయిందనుకున్న రుూ జీవితానికి అమృత భాండమే లభ్యమవబోతున్నదనే ఊహే చాలు- చిగిర్చి, పుష్పించి శోభాయమానంగా రూపొందేందుకు-’’
సరస్వతి బరువైన అడుగులను రాణి ఉత్సాహపూరిత పాదాలు అనుసరించినవి.
ఆ పూర్వకాలపు రోజుల్లో ఐతే హంస సందేశాలూ, మేఘ సందేశాలూ ఉండేవి. సందేశం సక్రమంగా జేరినా, జేరకపోయినా రుూ విధానాన్ని ప్రయత్నించిన వారికి ప్రాణభయం మాత్రం ఉండేది కాదు.
ఇప్పుడు ఆ పాత గాథల్లో ఏ భాగమూ పనికివచ్చేది లేదు. ప్రతిదీ స్వయంగా తెలివిగా, మెలకువగా సమయస్ఫూర్తితో సాధించాలి. రాణీకి హృదయపూర్వకంగా ప్రాణాలొడ్డయినా సరే సేవచేసి తరించాలనే సరస్వతి నిర్ణయించుకున్నది.
రాణి కమ్మని కలలు కంటానన్నది. తనకు ఎలాంటి కలలకూ అవకాశం లేదు. ఎందుకంటే అసలు నిద్రపడుతుందా అనే విషయమే అనుమానం.
సరస్వతి లోతులకు పోయి తీవ్రంగా ఆలోచించసాగింది. ఏ చిన్న పొరపాటైనా జరిగిందో మొత్తం పథకమంతా తల్లకిందులవుతుంది. జరిగిన పొరపాటును ఏవిధంగానూ సరిదిద్దుకొనే అవకాశం ఆవగింజంతైనా లేదు. ఎందుకంటే ఇదొక జీవన్మరణ సమస్యే కనుక ఎటో అటు తేలిపోతుంది!
ఇంత గురుతర బాధ్యతను రాణి తన భుజస్కంధాలమీద మోపినందుకు, ఒక పక్క తన గొప్పకు సరస్వతి గర్వించినా, రాణి మెప్పును పొందటం సామాన్య విషయంగా తోచటంలేదు.
ఎలా సాధించాలనే విషయమే ఆమె బుర్రలో తిరుగుతూ, మరొక ఆలోచనను దరిజేరనివ్వటంలేదు. ప్రతి స్వల్ప విషయాన్ని రుూ పథకంలో సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలించవలసే ఉన్నది.
గుంపులు గుంపులుగా వచ్చే ఆలోచనలతో సతమతవౌతూ తెల్లవారు జాముకు కాని అలసిన తన శరీరాన్ని తనకు తెలియకుండానే నిద్రాదేవికి అప్పగించలేకపోయింది సరస్వతి!
సాయంత్రమే అటుగా వెళ్లి వీరభద్రుని ఇల్లు బాగా గుర్తుంచుకోబట్టి, చీకటైనా ఇల్లు గుర్తించడం సరస్వతికి కష్టం కాలేదు. తాను తెలుసుకున్నదాన్ని బట్టి వీరభద్రుడు రుూ రాజ్యంలోనివాడు కాదు. కనుక అతన్ని తెలిసినవారు కొద్దిమందే ఉండి ఉంటారు. అంటే నలుగురి దృష్టిలోనూ పడకుండా అనామకుడిగా ఉన్నవాడి రహస్యాలు అంత త్వరగా బహిరంగమవవు. ముఖ్యంగా తానే స్వయంగా వెళ్లి అతన్ని కలుసుకోవటంలో ప్రమాదం తక్కువ.
రాత్రి సమయం, అందునా చీకటీ, వానవచ్చే సూచనలూ, ఊరు మాటు మణిగిన సమయం కనుక తననెవరూ గమనించరు. ఎవరైనా గమనిస్తున్నారేమోనని ఎన్నో జాగ్రత్తలు తీసుకోవటంవల్ల తనకు తగినంత రక్షణ ఉన్నది.
పోతే- అతను రుూ పోటీల నిమిత్తమే రెండు మాసాల ముందే అవంతీ పట్టణానికివచ్చాడు. బ్రహ్మచారికి చిన్న గది ఐతే సరిపోయేదే కానీ, అది దొరకక అద్దె కాస్త ఎక్కువైనప్పటికీ పెద్ద లోగిలి తీసుకున్నాడు. పోటీలు ఐపోయినా తన రాజ్యానికి తిరిగిపోక ఇక్కడ ఎక్కడైనా ఉద్యోగం, లేదా కొలువు దొరుకుతుందనే ఆశతో మరికొన్ని రోజులు ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాడు.
దీన్ని బట్టి ఆర్థికంగా చాలా వెనుకబడినవాడై ఉండాలి. శరీర వ్యాయామం చేసేవాడు కనుక కాస్తో కూస్తో తిండి చాలదు. అంటే డబ్బుతో కొనుక్కోవటం కూడా అతన్ని లొంగదీసుకొనే అవకాశాల్లో ఒకటి.
ఈ లోగిలిలాంటి ఇంటికి మరో గొప్ప వీలున్నది. ఇంటి ముందుభాగం రాజబాట వైపున్నది. వెనుక భాగం ఒక సందులో వున్నది. ఆ సందులో రాజవీధికి అభిముఖంగా వున్న ఇళ్ల తాలూకు దొడ్డి భాగాలే వరుసగా వున్నవి. అంతేకాదు ఆ తరువాత వీధితాలుకు దొడ్డి తలుపులు కూడా వీటికి ఎదురుగా వరుసలో ఉన్నవి. పగలే ఆ సందులో జన సంచారం ఉండదు. పందుల మందలకు ప్రత్యేకించబడిన భూభాగమది. మురుగు గుంటలూ, పుల్లిస్తరాకులూ, వరాహాల వీరవిహారం- ఇవే ప్రమాదాలు. ఐతేనేం తనలాంటి స్ర్తిలు ఎవరి దృష్టినీ ఆకర్షించకుండానే ఏ ఇంటిలోకైనా జొరబడే సావకాశం వున్నది. అదేవిధంగా బైటపడటం కూడా ఎంతో తేలిక.
ఐతే పరిచయమన్నా లేకుండానే దొడ్డిదోవన వెళ్లి ప్రయోజనం లేదు. తను తలుపు తట్టినా అతనికి వినిపించకపోవచ్చు. అదీగాక దొడ్డి వాకిలిగుండా ప్రవేశించే వ్యక్తి కోసమై నిరీక్షిస్తూండే ఏర్పాటు ఏమీ లేదు కనుక, వీధి వీధంతా గుమికూడేవరకూ తను వీరభద్రునికి ఎరుకపరచుకునే అవకాశంలేదని సరస్వతి గ్రహించింది.
రాచకొలువులో వున్న తన దూరపు బంధువైన చిన్నాన్న ద్వారా ఆయనకు ఎలాంటి అనుమానమూ కలుగకుండా, నవరాత్రీ ఉత్సవాల విషయం ప్రస్తావిస్తూ వీరభద్రుని గూర్చిన వివరాలు తాను సేకరించింది. ఇక మిగతా వివరాలను తనకు తానై అనే్వషించి, పరిశోధించి కేవలం తన తెలివితేటలతో, నిశిత బుద్ధితో గ్రహించింది.
ఇంతవరకూ పరిస్థితులు తన రాణికి అనుకూలంగానే ఉన్నవనిపించింది. ఇక తన ప్రయత్నాలకు తోడు దైవ సానుకూల్యం కూడా ఉంటే తన రాజభక్తిని రుజువుచేసుకొని తరించవచ్చు! రాణి సంతానవతియై ఆమే తరిస్తుంది. ఈ ఉభయ తారకం కోసమే కదా రుూపడే శ్రమంతా.
వీరభద్రుని ఇంటిముందు సరస్వతి ఒక్క క్షణం ఆగి రాజబాటను అటు ఇటూ పరికించి చూసింది. ఎక్కడా జనసంచారం లేదు. వీధి కుక్కలు కూడా ఎక్కడన్నా తలదాచుకున్నవేమో! మిణుకు మిణుకుమనే వీధి దీపాలు గాలి వీచినపుడల్లా ఆరిపోవాలని నిశ్చయించుకున్నాయి. జీవన్మరణ సమస్యల్లో కొట్టుమిట్టాడే మానవ ప్రాణివలె ఎటూ కాకుండా ఊగులాడున్నట్లనిపిస్తున్నవి. సరస్వతి చప్పున ఎత్తయిన అరుగులమీదికి చప్పుడు కాకుండా పరుగెత్తింది.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు