డైలీ సీరియల్

ఆకర్షణలు.. మనిషి (పురంజనో పాఖ్యానం - 2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనుక నేను ముందు పలుకరిస్తాను2 ఇలా మనసున అనుకొని నాలుగు అడుగులు వేసి ఆ కోమలి కంట్లో పడేట్లుగా పురంజనుడు నిల్చున్నాడు.
3కోమలీ మీరు దేనికోసమో వెతుకుతున్నట్టు ఉన్నారు. నేను మీకేమైనా సహాయం చేయగలనా2అన్నాడు పురంజనుడు.
కోమలి ఎంతో సంతోషంతో పురంజనుడి వైపు చూసి సిగ్గుల మొగ్గయై ముడుచుకొని పోయింది. కొద్ది సేపు తర్వాత మెల్లమెల్లగా సిగ్గుతో మీరు ... అంది అంతే పురంజనుడు ఇంకాస్త చొరవ చూపించి 3పూబోణీ! నీవు ఎవరి దానవు? నీకు భర్త ఉన్నాడా? తండ్రి నీడలో పెరుగుతున్నట్లుగా నాకు అనిపిస్తోంది. మీ తండ్రి ఎవరు? ఈ పది మంది సేవకులు నీ దగ్గరగా ఎందుకు నడుస్తున్నారు. ఈ హిమవత్పర్వత వీధుల్లో ఈ రాజ ప్రసాదం మీదేనా? ఈ పాము నీ కన్నా ముందు నడుస్తున్నదేమి? నేనెంతో భయపడ్డాను. కానీ నన్ను ఏమీ అనలేదు. బహుశా నీ కృపను నేను పొందానేమో అందుకే ఈ పాము నన్ను ఏమీ అనకుండా దూరంగా జరిగి ఉంది2అన్నాడు.
ఆమె మరింత హోయలు పోయింది. దానితో పురంజనుడు 3తరుణీమణి! నీ అందం నన్ను విచలితుడిని చేస్తోంది. నీవు పరమేశ్వరుని పార్వతి కన్నా, నారాయణుని పాదాలు వత్తే లక్ష్మీదేవి కన్నా నీ అందం ఎక్కువగా ఉంది. నీ కటాక్షవీక్షణాలు పొందని మనిషి నా తలంపులో మనిషే కాడు. న అనుగ్రహం నాపైన ప్రసరిస్తే నేను ఎంతో ధన్యుడిని2అని అన్నాడు.
ఆ కాంత సిగ్గులను తొలగించుకుని మిమ్మల్ను చూడగానే నా మనసు నా అదుపు తప్పిపోయింది. ఇంకా మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఏదోగా అనిపిస్తోంది. నేను కూడా మీ అనురాగం నాకు లభ్యమవుతుందా లేదా అని వేదన పడుతున్నాను2అంది.
అంతే పురంజనుని మనసు దివికి ఎగిసింది. ఆనందలోకాల్లో తేలియాడింది.
3ఓలలనా మణీ! నీ చూపు సోకగానే నా మతితప్పిపోయింది. నిన్ను చేపట్టకపోతే ఏమైపోతానో అనుకొంటూ నీ ముందుకు వచ్చాను. నీ కమనీయమైన కన్నులతో అమృతం లాగా ఉన్న నీ తీయని పలుకులతో సొగసులు విరజిమ్మే నీ మోమును ఎత్తి నా వంక చూడుము. లేకుంటే తుమ్మెదల బారు వంటి నీ కురుల అందం నీ మోమును కమ్మేస్తున్నది. ఒక్కసారి నన్ను చూడుము 1అని మరీ మరీ వేడుకున్నాడు పురంజనుడు.
అపుడు ఆ కోమలి కనులెత్తి 3ఓ పురుష వరేణ్యా! నీవెవరివో నేను అడుగను. నేను ఎవరినో నాకు తెలియదు. ఈ పురమంతా నాదే. నేను పడుకున్నపుడు ఈ పాము ఈ పురాన్ని సంరక్షిస్తూ ఉంటుంది. ఈ పురుషులు నా స్నేహితులు. వీరు కూడా నన్ను రక్షించడానికే ఎక్కువ కాలం వినియోగిస్తారు. ఈ స్ర్తిలందరూ నా చెలికత్తెలు. ఏ అభీష్టం కోసం ఇంత దూరం ఇక్కడి కి వచ్చారో నాకు తెలియదు. కానీ నన్ను మీరు కోరుకున్నట్లు అయితే వివాహం చేసుకోండి. నేను వరుని అనే్వషణలోనే ఉన్నాను. నన్ను వివాహం చేసుకొన్నట్లయితే పురానికి మీరు రాజు కావచ్చు . నేను మీ పట్టమహిషిని అవుతాను. నేను అందించే సుఖసంతోషాలను అనుభవిస్తూ మీరు నూరేండ్లు ఇక్కడే జీవించవచ్చు. నేనుకూడా మిమ్మల్ని నాథునిగా గ్రహించి మీరు అందిం చే సుఖభోగాలను సంతోషంగా అనుభవిస్తుంటాను.2అన్నది.
ఆమె అట్లా మాట్లాడగానే ఇక పురంజనునికి వెనుక ముందు తెలియలేదు. ఆలస్యం అమృతం విషం అని అంటారు కదా వెంటనే మనిద్దరం వివాహం చేసుకొందాం అన్నాడు పురంజనుడు.
అలా పురంజనునికి ఆ కోమలికి ఆ క్షణమే వివాహం జరిగింది. నవదంపతులిద్దరూ ఆ పురంలోకి అడుగు పెట్టారు. అక్కడ ఉన్న స్ర్తిలు, పురుషులు కలసి వివిధ వాయిద్యాలను మోగిస్తూ పాటలు పాడారు. నృత్యాలు చేశారు. అందరూ సంతోషంగా కాలం గడుపుతున్నారు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804