డైలీ సీరియల్

ఇది అవసరమైనదేనా? ( పురంజనో పాఖ్యానం - 5)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురంజనుడు డస్సిపోయేదాకా కోమలి కోపాన్ని నటించి ఇక కాళ్లను పట్టుకొని తనను క్షమించమని కోరుకుంటే అపుడు కోపాన్ని తగ్గించుకుని పురంజనునికి కోమలి సంతోషాన్ని కలిగించింది. ఆమె చిరునవ్వే తనకు పదివేల రెట్ల బలాన్నిస్తుందని ఎపుడూ చిరునవ్వుతోనే ఉండమని తనని సేవకునిగా భావించిమని మరీ మరీ కోమలితో చెప్పాడు.
ఇలా వారిద్దరూ దాంపత్యసుఖాలను అనుభవిస్తూ కాలం గడుపుతున్నారు. ఇలా ఉన్న వారికి నూరుమంది కొడుకులు, నూటపదిమంది కూతుర్లు పుట్టారు. కొడుకులందరినీ మంచి వీరులుగా ఉండేలా చర్యలు తీసుకొని వారికి అన్ని యుద్ధవిద్యలను నేర్పించాడు. కొడుకులను కూతుర్లను ఎంతో గారాబంగా పెంచారు. కోమలి పురంజనుడు వారి పిల్లలకు తగిన యువతులను తెచ్చి వారికి వివాహాలు చేశాడు. కూతుర్లకు కూడా తగిన వరులను తెచ్చి వారికి వివాహాలు చేశాడు.
కొంతకాలం గడిచింది. పురంజనునికి కోడళ్లు మనుమరాళ్లు వస్తున్నా కోమలిపై వ్యామోహం తగ్గలేదు. వారిద్దరూ ఎంతో సంతోషంతో కాలం గడుపుతున్నారు.
పురంజనుని కొడుకులకు కూడా ఒక్కొక్కరికీ నూర్గురు కొడుకులు చొప్పున కలిగారు. అలా వారంతా కలసి తామర తంపగా పురంజనుడి వంశం వృద్ధి చెందింది. కాని రాను రాను వారి సంపద కరిగిపోయి చివరకు వారంతా ఇతరుల పైన పడి తినడం ఆరంభించారు.
అలా కొంత కాలం జరిగింది. చివరకు వారికి ఎక్కడా తిండి దొరకక తండ్రితో పాటు పురంలో ఉంటూ అక్కడే నీచ కార్యాలు చేస్తుండిపోయారు. నీచ కార్యాలు చేయడం వల్ల పురంజనుడికి బుద్ధి నశించింది. కోపం ఎక్కువైంది. ఆకలి ఎక్కువైంది. కోరికలు విజృంభించాయి. వాటి ధాటికి తట్టుకోలేక ఏమీ చేయలేక ముసలివాడై కదలలేక మెదలలేక దొరికింది తింటూ కాలం గడుపసాగాడు.
ఒకనాడు మృత్యువు ఆ పురంలో ప్రవేశించింది. ఆ మృత్యువు ధాటికి పురంజనుడికి జవసత్వాలు ఉడిగిపోయాయి. గొంతులో గుర గుర శబ్దం రావడం మొదలైంది. అపుడు కూడా దేహాబుద్ధి వదలలేకపోయాడు.
అయ్యో నాకు ఏదైనా జరగకూడనిది జరిగితే నన్ను వదిలి క్షణంకూడా ఉండలేని నా కోమలి ఏవౌతుందో కదా గట్టిగా రోదించాడు. కొడుకులు కోడళ్లు కూతుర్లు అల్లుడు మనుమలు మనమరాళ్లు వీరంతా నేను లేకపోతే ఏమైపోతారో నేను సంపాదించినది ఉంది కనుక ఈరోజుటి దాక తిని తినక కాలం గడుపుతున్నాం. రేపొద్దున నేను చనిపోతే నా భార్యాబిడ్డలకు దిక్కు ఎవరు అని వగచాడు.
కాని కాలకన్య చేతిలో చిక్కి ఒకనాడు చనిపోయాడు.
ఆ తరువాత పురంజనుడు యమసదనానికి చేరాడు. ఇంతకుముందు చేసిన కార్యాలన్నిటికీ యముని దగ్గర మూల్యం చెల్లించుకుంటూ ఎంతో కాలం దుఃఖితుడై ఉన్నాడు. ఎప్పుడూ భార్యనే స్మరిస్తూ ఆమె ధ్యాసలోనే ఉండిపోవడం వల్ల మరుజన్మలో విదర్భరాజ కుమార్తెగా పురంజనుడు పుట్టాడు.
విదర్భరాజు కుమార్తె - పురంజనుడు
విదర్భరాజు కుమార్తెగా పుట్టిన ప్పటి నుంచి ఎంతో గారంబంగా పెరిగింది. ఆమె యవ్వన వతి అయినపుడు అనుకోకుండా విదర్భదేశానికి మలయధ్వజుడు అన్న రాజు దండెత్తివచ్చాడు. అనుకోని యుద్ధ ప్రమాదం వల్ల విదర్భరాజు మలయధ్వజుని ఓడించలేకపోయాడు. ఓటమి పాలైన విదర్భరాజు తన కూతురిని మలయధ్వజునికి వీరశుల్కంగా ఇచ్చాడు.
అపుడు విదర్భరాజు కుమార్తెగా ఉన్న పురంజనుడు మలయధ్వజుని భార్యగా మారాడు. వారిద్దరూ అన్యోన్యత వల్ల వారికి కాల క్రమంలో ఏడుగురు కుమారులు పుట్టారు. ఒక కుమార్తె కూడా పుట్టింది.
ఆ సంతానం అంతా పెరిగి పెద్దవారు అయ్యారు. వారంతా ద్రవిడ దేశాన్ని పాలించారు. వారికందరికి మలయధ్వజుడు అతని భార్య ఇద్దరూ వివాహం చేశారు. మలయధ్వజుని కుమార్తెను అగస్త్యముని కిచ్చి వివాహం చేశారు.
- ఇంకాఉంది

- డా. రాయసం లక్ష్మి. 9703344804