డైలీ సీరియల్

దూతికా విజయం-17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకో కోర్కె తీరేందుకు ఎనె్నన్ని ఎత్తులు! ఎనె్నన్ని వేషాలు! ఎంతెంత నటనలు! ఇంత కష్ట సాధ్యం కనుకనే ఆ అనుభవం కూడా అంత విలువైనదీ, సామాన్యులకు సుదూరాన ఉండేదీ, చాలా సందర్భాలలో అసామాన్యమూ ఐనదిగా ఉండిపోతోంది.
అయితే తనలో ఉండే ఆడ లక్షణాలే తనకీ సమయంలో గొప్ప రక్షణను సృష్టిస్తవి; అజ్ఞాతవాసంలో అర్జునుణ్ణి కాపాడినవి రుూ ఆడ లక్షణాలే కదా! అందుకని ఆడవేషంలో తాను ఒప్పించి, మెప్పించగలగటమే ధన్యతగా అతను భావించక తప్పలేదు.
‘‘నీ అభిప్రాయమేమిటి?’’ అన్న విధంగా సరస్వతి వైపు ప్రశ్నార్థకంగా చూశాడతను.
‘‘వేషం వేసి చూడాలి. మీకు కుండలాలు ఉండటంవల్ల ఆ రంధ్రాల్లోనే కర్ణ్భారణాలు అమర్చవచ్చు. నాశికాభరణానికి అనువుగా, ముక్కులకు చిన్నచిన్న బొక్కలు వేయించుకోరాదా?’’ అన్నది సరస్వతి పైకి నవ్వితే వీరభద్రుడు కుమిలిపోతాడేమోనని, నవ్వుతో కడుపుబ్బుతున్నా గొప్ప ప్రయత్నం మీద సంభాళించుకొని.
‘‘ఎట్లా? మగాడ్ని.. నాశికా రంధ్రాలకోసం కంసాలి దగ్గరికి వెళ్తే.. ఎందుకని అడగడా?’’
‘‘ఆడవేషం కట్టాలని చెప్పండి!’’
‘‘ఎవరైనా నమ్మేమాటేనా? రుూ కండలు తేరిన శరీరంతో నేను ఆడవేషం వేయదలిచానంటే నా మూర్ఖతకు కంసాలి కూడా కడుపుబ్బ నవ్వడా? ఇంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఉంటుందా? నీవే నా ముక్కులకు తాడు పోశావు కదా! ఇంకా రంధ్రాలు కూడా అవసరమంటావా?’’
దూతికా వృత్తిలో చాతుర్యం చూపగలిగి, వీరభద్రుని లొంగదీసుకున్నందుకూ, ముఖ్యం గా వీరభద్రుడే తన ఓటమిని తన నోటనే వెలిబుచ్చినందుకూ సరస్వతి తనను తాను అభినందించుకున్నది.
‘‘సరే- నాశికా రంధ్రాల విషయం వొదిలెయ్యక తప్పదు. మీరు సంతాన గోపాల క్రీడాభిరామంలో పాత్ర వహించే రోజు ఉదయమే క్షురకర్మ చేయించండి. ముఖ్యంగా మీ బోడిగుండు నున్నగా ఉండాలి. ఎందుకంటే జడవేసి పూలు తురిమి సిద్ధంగా వున్న శిరోజ కిరీటధారణ పరిపూర్ణంగా, బుర్రకు అతుక్కొనిపోయి ఉండాలి. వేషధారణలో జరిగే ఏ కొద్ది పొరపాటయినా మనసు పట్టి ఇచ్చేస్తుంది. అంటే అలాంటి లోపాలకూ, మన ముగ్గురి ప్రాణాలకూ కలిసిన ఒకటే లంకె- యమపాశం ఉన్నదనేది జ్ఞాపకం ఉంచుకోవాలి’’.
ఈ అనుభవానికి ఒప్పుకున్నాక అన్నిటినీ తలవంచక తప్పదు. అనుభూతికి చెల్లించే వెల అవమానమైనా ఓర్చుకోవచ్చు. కాని ప్రాణభయం నీడవలె వెన్నాడటం ఒక్కటే వీరభద్రునికి మనసులో కలుక్కుమంటోంది.
‘‘వేషధారణలో మిగతా విశేషాలో?’’’ అన్నాడు వీరభద్రుడు.
సరస్వతి మళ్లీ ముసిముసి నవ్వులు వొలకబోసింది.
‘‘ఒక్క లింగభేదం తప్ప మిగతా కోణాల్లో మిమ్ము ఎవరూ కనుక్కోలేకుండా చేసే బాధ్యత నాది!’’అన్నదామె.
‘‘నేను తీసుకోవలసిన జాగ్రత్తలు ఇంకేమి ఉన్నవి?’’ అన్నాడు వీరభద్రుడు.
‘‘నడిచేప్పుడు మృదువుగా అడుగులు వేయటం, ఆడదానిలాగు పిరుదులు ఊపుకుంటూ వయ్యారంగా నడవటం నేర్చుకోండి. కోటలో మీరు ముఖ్యంగా రెండు విషయాలు బాగా గుర్తుంచుకోవాలి. మొదటిది పెదవి కదల్చరాదు. మిన్ను విరిగి మీద పడుగాక మీ నోటి నుంచి మాట రారాదు. మొదటిమాట తాలూకు కంఠస్వరమే చాలు మీరు దొరికిపోయేందుకు. ఇక ఆ మాట ఏమిటో దేవుడికే తెలియాలి..’’
వీరభద్రునికి రుూ విషయం గుటకపడేందుకు సరస్వతి కొంచెం వ్యవధినిచ్చింది.
‘‘రెండోదేమిటి?’’ అన్నాడు వీరభద్రుడు- లోతులకు పొయ్యేకొద్దీ విషాదం ఎదురౌతోందనే సూచనను వ్యక్తపరుస్తూ.
‘‘ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎంత ప్రమాదం సంభవించనీ నడవాలే కానీ పరుగెత్తరాదు. మెడలో ఉరితాడు పడితే గుంజుకున్నకొద్దీ అది బిగుసుకుంటుంది కదా! అదేవిధంగా నడకను పరుగ్గా తొందరపడి మార్చడం జరిగిందో యమపాశం బిగిసినట్లే! పరుగువల్ల శబ్దవౌతుంది; శబ్దం నలుగురి దృష్టిని ఆకర్షిస్తుంది. రాత్రి సమయంలో ప్రశాంతత భంగమైతే ముందు వెనుకలు చూడకుండా కాపలావాళ్ళు వెంటాడుతారు. పరుగెత్తి మీరు బైటపడటం అసంభవం. తాటిఎత్తున నిటారుగా వున్న గోడ ఎక్కడం కానీ, దూకటం కానీ మీ తరం కాదు. ద్వారపాలకుని కటాక్షమొక్కటే మీ ప్రవేశ నిష్క్రణలను సాధించగలదు! అంతేగాక పరుగు తొందరపాటును సూచిస్తుంది. ఆ తొందరపాటు భయానికి లేదా ఏదో ప్రమాదానికి కనీసం అసామాన్య సంఘటనకు గుర్తు. అదేమిటో తెలుసుకునేందుకు కాపలవాళ్ళు మరింత వేగంగా వెన్నాడి చుట్టుముట్టుతారు. మీ నడకలో అనుమానం వస్తే ఎదుర్కొంటారు. ప్రమాదం మరింత సామీప్యవౌతోందని మీ పరుగు వేగం హెచ్చించినట్లయితే అంతకన్నా వేగంగా వాళ్ళ వాడి బాణాలూ, బల్లాలూ, మీ వీపులోంచి రొమ్ముల్ని దూసుకొని ముందుకు పొడుచుకుని వస్తాయ్.. తెలిసిందా?’’
తెలియకేం.. అంతా కళ్ళముందు కట్టినట్లే తెలుస్తోంది.. బక్కచిక్కిన శిక్షకుని కర్రపోటును భరించడంకన్నా నీరసంగా తలూపే గంగిరెద్దు వలె వీరభద్రుడు తలవూపాడు.
‘‘కోటలోకి ప్రవేశించడం దగ్గర్నుంచి మాలో మాకు సాంకేతిక భాష ఉన్నది. దానితోనే అనేక సూచనల ద్వారా ఏమేం జరుగుతున్నదో, ఎలా నడుచుకోవాలో మేము నిర్ణయించుకుంటూ తదనుగుణంగా ప్రవర్తిస్తుంటాము. మీరు కూడా కేవలం సంజ్ఞల ద్వారానే మీ అభిప్రాయాలను తెలియజెప్పాలి. అంతేకాని మాటలు మాత్రం పెదవులు దాటరాదు. చీకట్లో మిమ్ము తీసుకొని, నడిపించుకుంటూ రాణి మందిరానికి జేరుస్తాను. దక్షిణ ద్వారానికి రాణి పడకటింటికీ మధ్యలో ఉద్యానవనం ఉన్నది. ఆ ఉద్యానంలోని ఒక ఇరుకు బాటగుండా వెళ్తాము...’’
‘‘రాణి శయనాగారంలో కూడా చీకటేనా?’’
వీరభద్రుడు ఎంత నీరసించిపోతున్నాడో సరస్వతి గ్రహించింది. అయినప్పటికీ వాతావరణమంతా ముందుగా పరిచయం కావటం, ఏది ఎలా జరగాలని సిద్ధాంతీకరించబడిందో విపులంగా తెలియజెప్పటం తన విధి. గాభరాపడి తప్పుదారి పట్టాడో అందరి ప్రాణాలకు ముప్పే కదా!

- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు