డైలీ సీరియల్

శ్రీసూక్త విశిష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదమే అన్నింటికీ మూలమని హిందువులు భావిస్తారు. అందులో పురుషసూక్తం, శ్రీసూక్తం వేదసూక్తాల్లో సుప్రసిద్ధమైనవి. ఆర్షధర్మాన్ని ప్రతిష్ఠించడానికి, వేద సంస్కృతిని సంరక్షించడానికి, జ్ఞాన సముపార్జనకి, సకల ఐశ్వర్యసిద్ధికి వేదసూక్త పఠనం తప్పని సరి అని పెద్దలు చెబుతారు.
శ్రీ సూక్తం ఎంతో మహిమాన్వితమైనది. ఐశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాన్ని పొందాలంటే శ్రీ సూక్తాన్ని మించిన వేదసూక్తం మరియొకటి లేదు. నిత్య పూజాక్రియల్లో శుభకార్య నిర్వహణలో ఈ సూక్త పఠనానికి ప్రాధాన్యత ఉంది. నిజమైన సిరి జ్ఞానమే అని శ్రీ సూక్తం ద్వారా అమ్మవారిని జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించడమే శ్రీసూక్తంలోని అంతరార్థం.
శ్రీ సూక్తంలోని మంత్రాలన్నీ విలువైనవి. ఒక మంత్రంలో జేష్టాదేవి దరిచేరకుండా చేయమనే ప్రార్థన ఉంటుంది. దారిద్య్రం అంటే మానవుని లో దురాలోచనలు ఆరంభమైతే అది దారిద్య్రానికి దారితీస్తుంది. అందుకే లోకాన్ సమస్తాన్ సుఖినోభవన్తు అన్నారు. అందరి మేలును మాత్రమే వాంఛించాలి. పరాయ సొమ్మును పాముతో సమానంగా చూడాలి. భావదారిద్య్రాన్ని వూహల్లోకి కూడా రానీయకూడదు. అమ్మవారిని పూజించేటపుడు ఉన్నతమైన ఆలోచన్లు కలిగి ఉంటే అమ్మవారు సంప్రీతియై కోరిన కోరికను ఈడేరుస్తుంది. జ్ఞానమే నిజమైన సంపద అని ఈ సూక్తం తెలుపుతుంది. దేవతలను ప్రార్థించే మంత్రాలను ఋక్కులని వ్యవహరిస్తారు. అటువంటి కొన్ని ఋక్కులు కలిసి ఒక సూక్తము అని వ్యవహరిస్తారు. గోసమృద్ధిని, వాక్కులో సత్యాన్ని మనస్సు నిండా సంతోషాన్ని , ఆనందాన్ని ప్రసాదించమని సిరిసంపదలకు ఆది దేవతయైన శ్రీ మహాలక్ష్మి కృప ఎల్లప్పుడూ ఉండాలనే ధ్యానం చేయడమే శ్రీసూక్త విశిష్టత.
పద్మాసనురాలైన లక్ష్మీ మాతను పుత్రుల్ని, పౌత్రుల్ని వాహనాదుల్ని ఇవ్వమని ఆయుష్మంతులుగా చేయమని భక్తులు కోరుకుంటారు. అంతేకాక సూర్యుని వంటి తేజస్సు, చంద్రునిలో ఉండేటటువంటి ప్రకాశమూ కూడా మాలో ఉండాలనీ కోరుకుంటారు.
సర్వమంగళ స్వరూపిణియైన శ్రీ మహాలక్ష్మికి సర్వవేళలా మనతో వసించాలని భక్తితో ప్రార్థిస్తే చాలు - క్షీర సముద్రంలో పుట్టిన, మహావిష్ణువుకు ప్రియమైన మహాలక్ష్మిమనకు తోడునీడగా నిలుస్తుంది. ముక్తిని, మోక్షాన్ని, కార్యసిద్ధిని కలుగ చేస్తుంది.
శే్వతవస్త్రాలంకరణతోను భాసిల్లే తల్లి గాను, తులసిమొక్కగా , విష్ణువుకు ప్రియసఖిగా ఉన్న లక్ష్మీదేవిని ఉపాసిస్తే లేమి ఉండదు. సిరిసంపదలకు కొదువ ఉండదు.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి