డైలీ సీరియల్

లక్ష్మీ కటాక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్మీదేవి కరుణలేనిదే ఏ ఒక్క పనిజరుగదు. ప్రతివారు లక్ష్మీదేవి కరుణ కావాలనే కోరుకుంటూ ఉంటారు. సరస్వతీ లక్ష్మీ దయ లేకపోతే మనిషిగా పుట్టినా కూడా ఏ ప్రయోజనాన్ని పొందలేరు. లక్ష్మీదేవి, సరస్వతీ వీరే కాదు ఏ దేవత అనుగ్రహం కలుగాలన్నా కూడా మనిషి ముందు జన్మలో మంచి పనులు చేసి ఉండాలి అంటారు. సుకృతమైన కర్మలు చేసి ఉంటే ఈ జన్మలో వారు తప్పక సంపదలను అనుభవిస్తారని పెద్దలు చెబుతారు.
అయతే పూర్వజన్మ గురించి తెలియదు మాకు. కానీ ఈ జన్మలో మాకు సిరి సంపదలు కలుగాలంటే ఏమి చేయాలి అనుకొనే వారు ఈలోకంలో ఉంటారు. ఎవరూ కూడా దారిద్య్రాన్ని కోరి అనుభవించాలని అనుకోరు కదా.
అటువంటి వారు తప్పక కనక ధారా స్తోత్రాన్ని చదివితే మాత్రం వారికి పూర్వజన్మ కర్మలన్నీ పటాపంచలు అయపోయ ఈజన్మలో అఖండమైన అపాఠమైన సిరిసంపదలు కలుగుతాయ.
ఇంతకుముందుకాలంలో గురుకులంలో భిక్షాటనం చేయాలనే నిబంధన శిష్యులకు ఉండేది. ఆకాలంలో శ్రీ ఆదిశంకరాచార్యులు భిక్షాటనం చేయడానికి ఒకరింటికి వెళ్లారట. ఆ ఇల్లాలి దగ్గరకు వెళ్లి భవతీ భిక్షాందేహి అని శంకరులు నిల్చున్నారట.
కానీ ఆ ఇల్లాలి దగ్గర భిక్షార్థి అయ వచ్చిన వానికి పెట్టడానికి ఏమీ లేదట. వారు రోజు యాచనకు వెళ్లి లేదా పౌరోహిత్యం చేసుకొని ఆపూట గడుపుకుని జీవించేవారట. ఈ రోజు ఈ శంకరులను చూసి ఆ తల్లి ఎంతో దుఃఖించిందట. పాపం ఈ బ్రహ్మచారి నా దగ్గరకు వస్తే నేను ఏమీ పెట్టలేకపోతున్నానే అని బాధపడి ఇల్లంతా వెతికి చివరకు ఒక ఎండిపోయన ఉసిరి కాయను తీసుకొని వచ్చి శంకరుల జోలెలో వేసి బాబు క్షమించు నా దగ్గర ఇంతకన్నా పెట్టడానికి ఏమీ లేదు అని అందట. ఆ తల్లి నిర్మలమైన మనస్సు చూసి ఎంతో సంతోషపడి శంకరులు అప్పటికపుడు వందే వందారు మందారం ఇందిరానంద కందలమ్ అంటూ లక్ష్మీదేవిని ప్రార్థించి ఆ ఇల్లాలికి పూర్వ జన్మలోని దుష్కర్మలను పోగొట్టి ఇపుడు నీ కటాక్షాన్ని సిద్ధింపచేయ. అని ప్రార్థించారట.
అంతే ఆ తల్లి బంగారు ఉసిరి కాయలను కురిపించిందట. అప్పట్నుంచి దారిద్య్ర బాధను అనుభవించేవారు ఎవరైనా సరే ఈ కనకధారస్తవాన్ని చదువుకున్నట్లయతే వారికి తప్పక సిరిసంపదలు కలుగుతాయని కలి యుగంలోను అంటారు.
కనక అందరూ శంకరాచార్యులను, లక్ష్మీదేవి ప్రార్థించి లక్ష్మీకటాక్షం పొంది ఈ జన్మలో మంచి హితకరమైన ధర్మాచరణ చేయాలి.

- చివుకుల రామమోహన్