డైలీ సీరియల్

దూతికా విజయం-43

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజు నీచులెవర్నీ నమ్మే స్థితిలో లేడు. అందుకనే మంత్రినే స్వయంగా వెళ్లి రమ్మన్నాడు!
‘‘రక్షణ పర్యవేక్షణాధికారి ఎక్కడ?’’ అన్నాడు రాజు.
ఒక యువకుడు సమీపించి ధర్మపాలునికి నమస్కరించాడు.
రాజు అతన్ని తేరిపారజూచి ‘‘నీ పర్యవేక్షణ ఎంత బాగా నిర్వహించబడుతున్నదో వేరుగా విచారించవలసిన పనిలేదు!’’ అన్నాడు. ‘‘దీనికంతకూ నీవు పరోక్షంగా బాధ్యుడివి!’’
ఆ యువకుడు వొణికిపోయాడు.
‘‘క్షమించండి మహారాజా!’’
సరస్వతికి తెలుసు పరోక్ష బాధ్యత కొంతవరకే ఆ యువకునిదైతే మొత్తం రాజుదేనని! ఆ విషయం రాజుక్కూడా తెలుసు కనుకనే ఆ యువకుడ్ని క్షమిస్తాడని ఆమె అనుకున్నది.
‘‘ఊ’’ అని దీర్ఘం తీశాడురాజు. ‘వీడు- రుూ వీరభద్రుని ఇల్లెక్కడో తెలుసా?’’
‘‘తెలియదు, కాని కనుక్కుంటాను!’’ అన్నాడు ఆ యువకుడు, తన తల నేల రాలనందుకు ఆనందిస్తూ.
‘‘బహుశా సరస్వతికి తెలిసి ఉంటుంది. ఆమె చెప్పదు. ఆమె చేత చెప్పించేందుకు కొంత వ్యవధి కావాలి.. సరే- కనుక్కుని ఇల్లంతా వెదికి అక్కడ దొరికే వాటిని తక్షణం ఇక్కడికి జేర్పించు.. వెళ్ళు!’’
మృత్యుగహ్వరంలోంచి బైటపడినందుకు తన కులదేవతలందరికీ వందనాలర్పించి ఆ యువకుడు అప్పటికప్పుడే బయలుదేరి వెళ్ళాడు.
‘‘జయపాలా! సరస్వతిని గుర్తించగలవా?’’ అన్నాడు రాజు ఇక్కడి విచారణ సాగిస్తూ.
‘‘అదుగో ఆమే!’’ అన్నాడు జయపాలుడు సరస్వతిని చూపుతూ.
రాజు ఆజ్ఞనీయగా మరిద్దరు దాసీలు వచ్చి ఆయన ముందు నిలబడ్డారు.
‘‘వీరిద్దర్నీ గుర్తించగలవా? వీళ్ళ పేర్లేమిటో చెప్పగలవా?’’
‘‘నాకు తెలియదు మహారాజా!’’
‘‘రాణివాసంలో బహుశా నీకు ఏ స్ర్తి తెలియదనుకుంటాను?’’
‘‘తెలియదు ప్రభూ!’’
‘‘మరి సరస్వతి ఒక్కతే ఎలా తెలుసు? ఆమెకూ, నీకు పూర్వ పరిచయం ఉండి ఉండాలనుకుంటాను!’’
సుడిగాలికి లేచిన దుమారం తాలూకు దుమ్ము, ధూలి నేలవాలి అణిగిపోగా దృశ్యమంతా స్పష్టంగా కనిపిస్తూన్నట్లవుతోంది.
‘‘సరస్వతి పేరు అదివరకే విన్నాను ప్రభూ! ‘ఎవర’ని అడిగినప్పుడు ఆమె పేరు చెప్పింది.
‘‘ఇంకెవరైనా ఆమె పేరు చెప్పి ఉండొచ్చు కదా! అప్పుడామె సరస్వతో కాదో నిర్థారణ ఎలా?’’
జయపాలుడు తెల్లమొహం వేశాడు.
‘‘నమ్మాను ప్రభూ!’’ అన్నాడు.
‘‘సరే- ఈ వీరభద్రుడు రాణివాసంలోకి ఎలా ప్రవేశించి ఉంటాడంటావు?’’ అన్నాడు రాజు.
‘‘నాకెలా తెలుస్తుంది ప్రభూ! బహుశా పగలే ఆడవేషంలో సరస్వతితోపాటే కోటలోకి వచ్చి ఉండొచ్చు!’’ జయపాలుడు తడబడుతున్నాడు. ఏదో విధంగా అందర్నీ తప్పుదారి పట్టించేందుకే జయపాలుడు గట్టి ప్రయత్నం చేస్తున్నాడు.
‘‘అలా అనే అనుకొందాం. కాని అర్థరాత్రి దాటేవరకూ సరస్వతి వీరభద్రుణ్ని ఎక్కడ దాచి ఉంటుంది? ఉద్యానవనంలోనా? అసంభవం! ఎవరికంటా పడకుండా మాయచేసే శక్తి ఆమెకు ఉంటే ఈ వీరభద్రుడు నీకంటా పడేవాడు కాదు కదా! ఇక రాణివాసంలోనే ఉంచుతుందా? మిగతా స్ర్తిలకు ఎవరికీ తెలియకుండా ఎలా? తన బంధువని పరిచయం చేస్తుందా?.. ఏమో!.. ఎవరైనా ఇంతకుముందు రుూ ఆడవేషాన్ని చూశారా?’’ అన్నాడు రాజు దాసదాసీలనుద్దేశించి.
‘‘లేదు ప్రభూ!’’ అని అందరూ ఏకకంఠంతో జవాబిచ్చారు.
పట్టుకొమ్మ జారిందని జయపాలుడుగ్రహించాడు.
‘‘ఇంకేమైనా మార్గాలున్నాయా?’’ అన్నాడు రాజు జయపాలుణ్ని ఉద్దేశించి.
రాజు కంఠస్వరంలో ఇపుడు ఉద్రేక ఉద్వేగాలే ధ్వనించటంలేదు. నిర్లిప్తంగా ఉండి నిజాన్ని తెలుసుకుందామనే తహతహ మాత్రమేకనిపిస్తూన్నది. రాజును ఇప్పటికీ మోసం చేసే అవకాశమున్నదని జయపాలుని లాంటి బుద్ధిహీనులు అనుకోవచ్చు. అదే వాళ్ళ చివరి ఆశ కూడాను. ఆ తొందరలో సమయ సందర్భాలను పాటించకుండా అమాయకత్వాన్ని నటిస్తూనే, మాటల్లోనే తేలిగ్గా దొరికిపోతారనే జ్ఞానం జయపాలుని లాటివాళ్లకు కలుగదు.
‘‘బహుశా కోటగోడ దూకి ఉండొచ్చు ప్రభూ!’’ అన్నాడు జయపాలుడు.
‘‘నీ అంత తెలివిగలవాడికి మంత్రి పదవి ఏనాటికైనా లభ్యమవుతుంది. అదీ తెలుసుకుందాం. ఎవరక్కడ?’’’
ముగ్గురు భటులొచ్చి రాజు ముందు తలలు వంచి నిలబడ్డారు.
‘‘కరదీపికలు తీసుకొని వెళ్ళండి. దక్షిణ ద్వారానికి ఆవలా, రుూవలా గోడవారగా పరిశీలించండి. ఏదైనా నిచ్చెన కాని, లేదా గోడ ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా ఉండేట్లు అమర్చబడిన తాడులాంటిది కాని ఉన్నదేమో చూడండి. బహుశా గోడకు అవతల ఏదన్నా మూట ఉన్నదేమో చూడాలి!’’’ అన్నాడు రాజు ఆజ్ఞాపూర్వకంగా.
భటులు పరుగులెత్తారు.
ఇంతలో మంత్రి తిరిగి వచ్చాడు.
‘‘కుడ్యదీపిక గోడలోనే యథాస్థానంలో ఉన్నది ప్రభూ! చుట్టుప్రక్కల ఎక్కడా నేలమీద పచ్చి కానీ, మొక్కలు కానీ కాలిన సూచనైనా లేదు!’’ అన్నాడు మంత్రి.
‘‘‘నేను మరిచిపొయాను ప్రభూ! అసలు కుడ్యదీపికనే నేను కదల్చలేదు. ఆ వెలుగులోనే నేను వీళ్ళను స్పష్టంగా చూశాను!’’ అన్నాడు జయపాలుడు పుచ్చ కాచుకునే తొందరలో.
‘‘అబద్ధాలాడవలసిన పని నీకు లేదు. నిజం చెప్పకపోతే కఠిన దండన తప్పదని నీకు తెలుసు.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు