డైలీ సీరియల్

నిర్గుణుడు నిటలాక్షుడు( శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమ శివుని ఆదేశంతో నందీశ్వరుడు అక్కడికి వచ్చి నాకు ముక్తి సాధనకు మూలమైన శివ చరిత్రాన్నీ, ఆయన విశిష్ట తత్వాన్నీ బోధించాడు. సత్య వస్తువు మహేశ్వరుడొక్కడేననీ, ఆయనను శ్రవణ మనన కీర్తనలతో ఆరాధించమనీ తెలిపి నన్ను తరింప జేసిన గురుతుల్యుడాయన. నీవు కూడా ఆ అనుష్ఠానానే్న చేసి తరించు’’ అని ఆదేశించి తన నివాసానికి మరలి వెళ్ళాడు. మా గురువుగారు ఆ ప్రకారమే సాధనలు చేస్తూ శివపురాణాన్ని రూపొందించారు.’’ అని సూతులవారు తెలుపుతూండగా శౌనకాది మహర్షులు తమ మీమాంసను ఆయన ముందుంచారు.
‘‘సూత మహాశయా! వినటానికి సులభంగా తోస్తున్న ఈ సాధన ఆచరణలో సామాన్య మానవులకి కష్టతరమే కదా! మీరు తెలిపిన శ్రవణ మనన కీర్తనాలు చేయలేని మానవులకి ముక్తి లభించే మార్గం వేరొకటి లేదా?!’’ అని వారడిగిన ప్రశ్నకి సూతుల వారిలా మార్గాంతం తెలిపారు.
‘‘ఆ మూడు సాధనాలూ చేయలేని మానవుడు శివలింగమును గానీ విగ్రహమును గానీ స్థాపించి పూజిస్తే భవ సాగరాన్ని సులువుగా దాటగలడు. శివలింగ ప్రతిష్ఠతో సకల పాపాలూ తొలగి మనసు స్థిరమయి ఆ పరమేశ్వరునిపై నిలచిపోతుంది. అలాగే శంకరుడి, విగ్రహ ప్రతిష్ఠ కూడా అపార పుణ్యాన్నిస్తుంది’’ అన్నారు.
శౌనకాదులకి అప్పుడు మరో సందేహం కలిగింది. ‘‘మహాత్మా! ఇతర దేవతల వలె సాకార మూర్తిగా విగ్రహ రూపంలో ఆరాధింపబడుతూనే, వారెవరికీ లేని ప్రత్యేకతతో లింగ మూర్తిగా కూడా ఈశ్వరుడు పూజింపబడటానికి కారణమేమిటో కృపతో తెలుపండి’’ అని అభ్యర్థించారు మహర్షులు. సూతులవారెంతో ఆనందించి ఇలా తెలుపసాగారు.
‘‘పుణ్యాత్ములారా! శివలింగము శివుని నిష్కల (నామ మాత్రపు) స్వరూపము అనగా పరబ్రహ్మ స్వరూపమునకు ప్రతీక. విగ్రహము ఆయన సాకార రూపానికి ప్రతీక. పూర్వము సనత్కుమారుడు నందీశ్వరుడిని ఇదే విధంగా ప్రశ్నించాడు.
‘‘యోగీంద్రా! నందీశ్వరా! శివుడు లింగరూపుడెలా అయినాడు? ఆ లింగము యొక్క విశిష్ఠతను నాకు తెలుపగలరు. అలాగే ఆయన సాకార రూపాన్ని ముందుగా ఎవరు దర్శించారు?’’ అని అడుగగా నందీశ్వరుడు భక్తి పూర్ణుడై తెలిపిన ఉదంతాలే కాక నేను పూర్వము నా గురు ముఖమున విన్న విషయాలు కూడా మీకు తెలుపుతాను. బ్రహ్మ స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు మొట్టమొదటగా నిష్కళ లింగంగా బ్రహ్మ విష్ణువుల మధ్య ఆవిర్భవించాడు. మిగిలిన దేవతలందరూ సాకారులు మాత్రమే! పరమేశ్వరుని సృష్టిగా ఆవిర్భవించిన వారెవరూ నిత్యులు కారు. పరమేశ్వరుడొక్కడే శాశ్వతుడూ, చిత్ స్వరూపుడూ కూడా. ఆయన సాకార రూపంలో కనిపించినది మొదట విష్ణుమూర్తికి. ఆ తరువాత బ్రహ్మ విష్ణువుల తగవు తీర్చే సమయాన వారిరువురికీ ఆయన తన నిష్కల, సాకార రూపాలు రెండింటిలోనూ దర్శనం ఇచ్చాడు.’’ అని నందీశ్వరుడు తెలుపగా సనత్కుమారుడు శివలింగ ఆవిర్భావము గూర్చి తెలుపమని అర్థించాడు. శివలింగ ఆవిర్భావాన్ని గురించి ఒకప్పుడు బ్రహ్మదేవుడు నారదునికీ, నందీశ్వరుడు సనత్కుమారునికీ విపులంగా వివరించారు. ఆ విషయాలే నేను మీకు తెలుపుతాను’’ అంటూ పరమేశ్వరుడి నిష్కల, సాకార స్వరూపాలను గురించి శౌనకాదులకు వివరించసాగారు సూత మహర్షి.
3
శివలింగోద్భవము
వ్యాస విరచిత శివపురాణంలో శివ లింగోద్భవమును గురించి బ్రహ్మ నారద సంవాదంలోనూ, నందీశ్వర సనత్కుమారుల ప్రశ్నోత్తరాలలోనూ కూడా వివరించబడింది. బ్రహ్మ నారద సంవాదం శివ పురాణంలోని ‘రుద్ర సంహిత’లోనూ, నందీశ్వర సనత్కుమారుల సంవాదం ‘విద్యేశ్వర సంహిత’లోనూ లిఖించబడ్డాయి.
భూలోక సృష్ట్యాదిలో బ్రహ్మ విష్ణువుల మధ్య జరిగిన వివాదాన్ని పరిష్కరించటానికి ఈశ్వరుడు పరమలింగంగా, ఉద్భవించిన ఘటనే ‘శివలింగోద్భవ’ ఘటన.
బ్రహ్మ నారద సంవాద రూపంగా శివలింగ ఆవిర్బావాన్ని గూర్చి సూత మహర్షి శౌనకాదులకీ విధంగా తెలుపసాగారు.
నారద గర్వ భంగం
‘‘ముని సత్తములారా!
ఒకానొకప్పుడు నారద మహర్షి హిమవత్పర్వతాననున్న ఒక అందమైన వనానికి సమీపాన ఉన్న ఓ గుహను నెలవుగా చేసుకుని, పవిత్ర గంగానది తీరాననున్న ఆ గుహలో కఠిన తపస్సాచరించసాగాడు. అందరి తపస్సులకూ భంగం కలిగించే దేవేంద్రుడు మామూలు ప్రకారం ఆయన తపోభంగానికై రంభాది అప్సరసలను పంపించాడు.

ఇంకా ఉంది

శ్రీమతి గౌరీ గార్లదిన్నె