డైలీ సీరియల్

పతనానికి హేతువు అహంకారమే! (శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మ విష్ణు రుద్రులు శాశ్వతులు కారు. శాశ్వతుడు పరమేశ్వరుడు ఒక్కడే!
నందీశ్వరుడు సనత్కుమారునికే కాక ఒకసారి దేవతలకూ, మరోసారి మార్కండేయ మహర్షికీ కూడా శివపురాణాన్ని వినిపించినట్లు వ్యాస విరచిత శివపురాణం తెలుపుతోంది.
నందీశ్వరుడు సనత్కుమారునికి తెలిపిన ‘అరుణాచల’ లింగోద్భవాన్ని గురించి శౌనకాది మహర్షులకిలా తెలుపసాగాడు సూత మహాశయుడు.
‘‘శౌనకాది పుణ్య మహర్షులారా!
నందీశ్వరుడు వివరించిన జ్యోతిర్మయ అగ్ని లింగ ఆవిర్భవాన్ని గూర్చి తెలుపుతాను. వినండి.
ఒకానొకప్పుడు సృష్టికర్త అయిన బ్రహ్మని అహంకారం ఆవహించి ఉండగా ఆయన విష్ణు దర్శనానికి వెళ్ళాడు. ఆ మాయలో వైకుంఠాన ఆదిశేషుడిపై పవళించి గరుడాది భక్తుల సేవలందుకుంటున్న ఆయన లేచి వచ్చి తనను స్వాగతించలేదని ఆయనపై ఆగ్రహించాడు. సృష్టికర్త అయిన తాను అధికుడననీ, తననాయన అవమానించాడనీ తలచి తండ్రితోనే యుద్ధానికి తలపడ్డాడు.
ఆ యుద్ధం చాలాకాలం కొనసాగి దేవతలెందరో మృతులయ్యారు. అప్పుడు మిగిలిన దేవతలు ఈశ్వరుడిని శరణు జొచ్చి వారి యుద్ధాన్ని ఆపమని ప్రాధేయపడ్డారు. వారి ప్రార్థనకు కరిగి ఈశ్వరుడు పార్వతీదేవితో కలసి యుద్ధ స్థలానికి వేంచేసాడు. కానీ ఆయన వారిని వారించే లోగానే బ్రహ్మదేవుడు మహేశ్వరాస్త్రాన్నీ, విష్ణుమూర్తి పాశుపతాస్త్రాన్నీ ఒకరిపై ఒకరు సంధించుకోవటం జరిగింది. అంతటి మహత్తర శక్తిగల అస్త్రాలు ఢీ కొంటే జరిగే విధ్వంసాన్ని గ్రహించిన పరమేశ్వరుడు వెంటనే వారి నడుమ ఒక అగ్ని స్తంభాకారమైన లింగరూపంలో ఉద్భవించాడు. బ్రహ్మ విష్ణువులు సంధించిన బాణాలు రెండూ ఆ ‘అనల’ స్తంభంలో లీనమై శక్తి హీనాలైపోయాయి. బ్రహ్మ విష్ణువులిద్దరూ ఆకాశాన్ని కూడా అధిగమించిన ఆ లింగ ఔన్నత్యానికీ, లోతుకీ ఆశ్చర్యపడుతూండగా, మహేశ్వరుడు వారిని దాని ఆద్యంతాలు కనుక్కురమ్మని వారిని పంపించాడు. వెంటనే బ్రహ్మ హంసాకృతిలో ఆదిని కనుక్కోటానికి పైకీ, విష్ణుమూర్తి కోరలు గల శే్వత వరాహంగా మారి నీళ్ళను తొలచుకుంటూ భూమి క్రిందికి లింగ అంత్యాన్ని కనుక్కోటానికీ బయలు వెడలారు. కానీ ఆ ప్రయత్నంలో సఫలీకృతులు కాలేక ఇరువురూ తిరిగి తాము బయలు దేరిన స్థలానికి చేరుకున్నారు. తిరిగి వస్తున్న బ్రహ్మ తాను అధికుడనని నిరూపించుకోవటానికి తాను లింగపు ఆదిని కనుగొన్నానని అసత్యం ఆడాడు. అక్కడ కనిపించిన ఒక మొగలి పూవుని తాను లింగపు ఆదిని చేరగా అది చూసినట్లు దానినిఅబద్ధపు సాక్ష్యం చెప్పమని బ్రతిమాలి ఆ పనికి ఒప్పించి తనతో తీసుకు వచ్చాడు. అబద్ధాన్ని సాక్ష్యంతో సహా చెప్పిన అతని మాటలు నమ్మి విష్ణువు బ్రహ్మను తనకంటే అధికుడిగా ఒప్పుకోవటానికి సిద్ధపడ్డాడు.
కానీ సాక్షాత్తూ పరమేశ్వర అంశుడైన ఈశ్వరుడు బ్రహ్మ చేసిన మోసాన్ని యావత్తూ గ్రహించి వారి ఎదుట ప్రత్యక్షమై బ్రహ్మకు ప్రతిష్ఠిత ఆలయాలు లేకుండా అయేట్లూ, ‘కేతకీ’ అనగా మొగలి పుష్పం పూజార్హత కోల్పోయేట్లూ వారికి శాపాలీయటమే కాక తన మూడవ నేత్రం నుండి భయంకర స్వరూపుడైన ‘కాలభైరవుడి’ని ఉద్భవింపజేసాడు.
శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మ ఐదో వదనమైన ఆయన మధ్య శిరస్సుని ఖండించాడు. అప్పటి నుండీ బ్రహ్మ చతుర్ముఖుడవటమే కాదు ప్రజల చేత పూజనీయార్హత కూడా కోల్పోయాడు. కేతకీ పుష్పానికి పూజార్హత శూన్యమయింది. ఆ సమయాన ఈశ్వరుని రౌద్రాకారం చూసిన బ్రహ్మ వణికిపోసాగాడు. పుత్రుడిపై జాలిగొన్న విష్ణుమూర్తి ఈశ్వరుడిని ప్రార్థించగా ఎట్టకేలకు ఆయన శాంతించాడు.
ఈశ్వరుడు బ్రహ్మను మన్నించి ఆలయాలు లేకున్నా యజ్ఞాలలో ఆయన పూజింపబడేటట్లూ, కేతకీ పుష్పానికి ఒక్క శివపూజకు తప్ప అది ఇతర దేవతల పూజకి పనికి వచ్చేటట్లూ శాపావకాశమిచ్చాడు. అంతేకాక,
ఇంకా ఉంది

శ్రీమతి గౌరీ గార్లదిన్నె