డైలీ సీరియల్

దూతికా విజయం-60

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలు రేపు ఉదయం వెళ్ళేందుకే నిశ్చయించుకొని ఉంటావని మేమందరం అనుకున్నాం.. నా మాట విని.. రేపు ఉదయమే వెళ్ళవచ్చు!’’ అన్నాడామె దూరపు బంధువు.
‘‘వీలు లేదు. మీ ఆదరణకు కృతజ్ఞురాలిని. రాణి నాకోసం ఎదురుచూస్తూంటుంది. ఆలస్యమైనందుకే ఆమె ఆందోళన పడుతుంది. నేను వెళ్ళగలను. రాణివాసపు రమణిని- అందునా రాణి ప్రియసఖిని. ననె్నవరు అడ్డుపెడతారు? నాకేం భయం లేదు.. వెళ్ళక తప్పదు!’’
బంధువులు ఎదురాడలేకపోయారు.
‘‘కోటదాకా నేను తోడు వస్తాను’’ అన్నాడు ఇంటి యజమాని.
‘‘వద్దు. నాతోపాటు మరో పురుషుడు కూడా వుంటే చూసేవాళ్ళు ఏమన్నా అనుకుంటారు’’ అని ఆ లంపటాన్ని వదిలించుకున్నదామె.
‘‘ఐతే ఛత్రమన్నా తీసుకెళ్ళు’’తను పరుగెత్తవలసి వస్తే బరువైన ఈ వెధవ గొడుగొక అడ్డం!
‘‘్ఫర్వాలేదు.. అంతగా తడిస్తే బట్టలు మార్చేస్తాను. నాకు గొడుగు పట్టుకునే అలవాటు లేదు. కాస్త గాలి వీస్తే గొడుగుతోపాటు నేను కూడా తల్లకిందులుగా బోర్లాపడతాను. నేనది మొయ్యలేను. అదీగాక వాన నీళ్ళలో తడవడమంటే నాకెంతో సరదా!’’
ఈ వింత తత్వాన్ని ఆమె బంధువులు అవగాహన చేసుకుంటున్నారు. వాళ్ల ఆలోచనలకు వాళ్లను వదిలి చప్పున ఆమె వీధిలోకి నడిచింది.
ఒకసారి అటూ ఇటూ చూసిందామె. ఈసురోమంటూ వీధి దీపాలు అక్కడక్కడా వెలుగుతున్నవి. వెలుగు చీకట్ల సమ్మేళనంలో చీకటి పాలే పాలిస్తుంది. జనసంచారం బొత్తిగా లేదు. వాతావరణం తనకు అనుకూలంగానే ఉన్నదనిపించింది.
వేశ్యావాటిక జేరి మరోసారి వీధిన పరికించి చూసిందామె. ఒకళ్ళిద్దరు మనుషులు కనిపించారు. కాదు పెద్ద పెద్దగొడుగులు కదలటం లీలగా కనిపించింది. వాటి కింద వున్న మనుషులు ఆ గొడుగుల బరువుకు అణిగిపోయి ఉంటారు; తనను చూడాలంటే శ్రమపడి ఛత్రాన్ని పైకి ఎత్తాలి. అప్పటికీ స్పష్టంగా తాను కూడా అంతకన్నా ఎక్కువ అస్పష్టంగానూ కనిపిస్తుంది. తనంత జాగ్రత్త తీసుకోవలసిన అవసరం వాళ్ళెవరికీ లేదు కనుక తానసలు అదృశ్యరూపానే పయనించవచ్చు.
మేలిముసుగు సరిజేసుకున్నదామె. వానచినుకు కాస్తపెద్దదయింది. పూర్తిగా తడవకముందే గమ్యస్థానం జేరాలి. మరీ తడిస్తే ఆ బ్రహ్మచారి కొంపలో తనకు కట్టుకునేందుకు పొడికోక కాదు కదా అసలు కోకే దొరకదు!
ఈ రాత్రంతా ఈ తడి చీరతోనే ఉంటే తెల్లారేలోగా జలుబు చేసి జ్వరం రాక తప్పదు.
గమ్యస్థానం ఆమె భౌతిక మనోనేత్రాలు నాలుగింటికీ స్పష్టంగా కనిపిస్తున్నది. యమభటుల్లాంటి రాజభటులు చూపుమేర దూరంలో ఎక్కడా లేరని నిర్థారణ చేసుకొని, మేలి ముసుగు కళ్ళను కప్పకుండా జాగ్రత్తపడి, చివరికి మజిలీతో గెలుపు సాదించే పరుగు పందెపుగత్తెవలె, శక్తులన్నింటినీ కూడగట్టుకుని ఒక్క ఊపున వచ్చి వీరభద్రుని గృహ ప్రాంగణంలో పడిందామె.
అలసట తీర్చుకునేందుకు అరక్షణం ఆగిందోలేదో, ఎక్కువసేపు ఇక్కడ ఉండటం ప్రమాదకరమని తోచింది. అదీగాక తాను వేసిన కొత్త పథకాన్ని అనుసరించి కాలయాపన బొత్తిగా పనికిరాదు.
దడదడా తలుపు కొట్టిందామె. ఎంతో ఆత్రుత, ఏదో విపరత్కర పరిస్థితి, వెనువెంటనే చెప్పవలసిన వార్త ఏదో వున్నదనే సూచనలను క్షణం ఆలస్యం కాకుండా తలుపు తెరవాలనే హెచ్చరికను సూచించే శబ్దమది. వాన చప్పుడులో ఈ గృహంలోని వారికి తప్ప ఇరుగు పొరుగులకు ఈ శబ్దం వినిపించేందుకు వీలులేదు; వినిపించినా ఈ వానలో మరింత గొడవ భరించలేనిది జరిగితే కాని ఇటువైపువచ్చేందుకు ఎవ్వరూ సిద్ధపడరనే ధైర్యం ఆమెకు ఉన్నది.
క్షణాలు బరువుగా, భారంగా పెళ్లినడకలు నడుస్తూన్నట్ల నిపించిందామెకు. తిరిగి తలుపు బాదాలా, అక్కర్లేదా అని ఆమె ఇంకా తేల్చుకోలేదు. లోపలినుంచి బరువైన అడుగుల చప్పుడు విని, వీరభద్రుడే వస్తున్నాడని ఆమె ఊహించి ఆతృత తగ్గించుకొని, ముందు కార్యక్రమంలో తన పాత్రను సర్వసమర్థంగా నిర్వహించేందుకు సిద్ధపడి మేలిముసుగును తొలగించింది సరస్వతి.
ప్రశాంతత భంగపరిచిన కారణంగా తలుపులు హఠాత్తుగా కీచుమనే శబ్దాలతో బార్లా తెరువబడినవి. లోపలినుంచ దీపికా కాంతి చాలా బలహీనంగా ప్రసరిస్తూనే వున్నది. వీరభద్రుని ఆకారపు సరిహద్దులు మాత్రమే తనకు కనిపిస్తూన్నవి. తన ముఖం అస్పష్టంగానన్నా వీరభద్రునికి కనిపిస్తుందనే ఆశ వున్నది. తాను కోరేదీ అదే!
‘‘ఎవరూ?’’ కఠోరంగా, చిరాకుగా, చికాకుగా ఉన్నదా కంఠస్వరం. అతని భావాలను ముఖంలోనే చదివేందుకు వీలులేకున్నా ఆ కంఠస్వరంలో గ్రహించగలిగిందామె.
అలసటను నటిస్తూ ‘రక్షించండి.. శరణు..’’ అన్నదామె ఎంతో ఆత్రుతను మిళితం చేస్తూ.
‘‘ఎవరు నీవు? వేశ్యవా? విటుడు విసిరికొడితే ఇక్కడకొచ్చి పడ్డావా?’’
ఈ వీధిలో, ఈ సమయంలో కనిపించే ప్రతీ ఆడదీ వేశ్యగానే భావించబడటం సహజమే మరి! తాటికింద పాలుతాగిన చందమైంది!
‘‘కష్టదశలో ఉన్నాను..’’ అన్నది సరస్వతి తానెవరో చెప్పవలసిన సమయమిది కాదనే ధోరణిలో.
‘‘ఏమైందీ?’’ వీరభద్రుని కంఠస్వరంలో హఠాత్తుగా మృదుత్వమూ, సానుభూతీ, ప్రశాంతతా ఉట్టిపడినవి.
‘‘ఎవరో దుర్మార్గులు వెంటాడితే పరుగెత్తుకుంటూ వచ్చాను. దయచేసి లోపలికి రానివ్వండి!’’ అన్నదామె ప్రాధేయపూర్వకంగా.
ఆశరణుకోరింది తనకన్నా బలహీనురాలే అయి ఉండాలి కనుక తన ఆధిక్యతను గుర్తించాడు వీరభద్రుడు. ఇంతసేపు తాను వాకిలి అడ్డంగా నిలబడిన విషయమే గమనించలేదు. ఇప్పుడామె ప్రవేశానికి ప్రాధేయపడగానే, తన విధి జ్ఞాపకమొచ్చి, అతను పక్కకు తొలగుతూ ‘‘నీకేం భయలేదు. లోపలికి వెళ్లు.. వాళ్ళెవరో నేను చూస్తాను!’’ అని వీరభద్రుడు మెట్లు దిగి వీధిలోకి వచ్చి అటూ ఇటూ పరికించి చూసి పరిసరాల్లోకి నిశిత దృష్టిని సారించి ఎవ్వరూ లేరని నిశ్చయించుకున్నాడు.
తలుపు పక్కనే ఒత్తిగిలి నిలబడిన సరస్వతి తన పథకం పారినందుకు లోలోన ఆనందించింది. తేలిగ్గా ఎవరికంటా పడకుండా, సురక్షితంగా వీరభద్రుని ఇంట ప్రవేశం లభించటమేగాక, తన కాల్పనిక దురాత్ముల కారణంగా అతని సహాయ సానుభూతులను కూడా సంపాయించగలిగింది. బలాతిశయంతో విర్రవీగే మృగరాజు తాను పన్నిన వలలో మొదటి అడుగు వేయటం తన కార్య సాఫల్యతలో మొదటి మెట్టు ఎక్కినట్లనిపించిందామె.
‘‘ఎవరూ- ఎవ్వరూ లేరే!’’ అన్నాడు వీరభద్రుడు మెట్లు ఎక్క దరిజేరుతూ.
‘‘నేనిటు రావటం చూసి, తమలాంటి భుజబలుల సహాయం నాకు లభిస్తుందని భయపడి పారిపోయి ఉంటారు!’’ అన్నది సరస్వతి- అదంతా పట్టించుకోవలసిన అవసరం కాదనే ధోరణిలో.
‘ఉహఁ’’ అన్నాడు వీరభద్రుడు. ‘‘నేనెరో నీకు ఇదివరకే తెలుసన్నమాట!’’
తాను ప్రయోగించిన ‘్భజబలుడు’ అనే పదమే తనను పట్టి ఇచ్చింది. ఎంత జాగ్రత్తగా అబద్ధాలను ప్రయోగించినా తనకు తెలియకుండానే నిజం ఏదో సందు చూసుకొని బైటికి ఉరికేందుకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరో అసత్య వాక్యంవల్ల ప్రయోజనం ఉండదు సరికదా తానొక అబద్ధాల పుట్ట అని నిస్సందేహంగా రుజూచేసిటన్లు అవుతుంది.
- ఇంకాఉంది

-ధనికొండ హనుమంతరావు