డైలీ సీరియల్

మోక్షానందాన్నిచ్చేది శివపూజనే (శివ పురాణం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీవు కాశీలో మరణించే భక్తుల కుడి చెవిలో అవసాన దశలో దానిని ఊదుతూ వారికి ఉత్తమ గతులు సిద్ధింపజేయి’’ అని అతడిని దీవించాడు. బ్రహ్మ హత్యా పాతకాన్ని ఉద్దేశించి,
‘‘ఓ పాతకమా! కాశీకి చేరిన వెంటనే కాలభైరవుడిని వదలిన సూచనగా భస్మాన్ని రాల్చి నీవు వెనువెంటనే ఎక్కడ దుర్మార్గులూ, నాస్తికులూ, జూదరులూ, త్రాగుబోతులూ, కసాయి వాళ్ళూ చరిస్తూ ఉంటారో ఆ స్థానాలకి వెళ్ళి వసించు’’ అని ఆజ్ఞాపించాడు.
ఆ ఆజ్ఞానుసారం కాలభైరవుడు కాశీ చేరి మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి పునీతుడు కాగానే, భస్మాన్ని రాల్చి శ్రీహరి తనకిచ్చిన స్థానాలను వెదుకుతూ వెళ్ళిపోయింది బ్రహ్మహత్యాపాతకం. ఆయన చేతికంటుకున్న. కపాలమూ ఊడి క్రింద పడింది. కాల భైరవుడు తిరిగి తన దివ్య ధవళ వర్ణ దేహం పొంది, శివుడు తనని అభిషేకించగా కాశీపుర క్షేత్ర పాలకుడై సర్వుల పూజలూ అందుకుంటూ కాశీలో మరణించిన వారి కుడి చెవిలో తారకమంత్రోపదేశం చేసి వారిని తరింప జేస్తున్నాడు.’’ అని మునులతో తెలిపిన సూతుడు,
‘‘శౌనకాదులారా! ఈ కాలభైరవ చరిత్రాన్ని చదివినా, విన్నా వారికి పంచ మహాపాతకాలూ నశించి వ్యాధులూ బాధలూ నివారణ అవుతాయి. ప్రమాదాలు దరి చేరవు. గ్రహపీడలు అంతరించి ధర్మార్థ కామ్యాలు నెరవేరుతాయి. ముఖ్యంగా శనివారంతో కూడిన త్రయోదశి రోజు కాలభైరవుడిని నువ్వుల నూనెతో అభిషేకించి బెల్లముతో చేసిన నువ్వుల ఉండలనూ, టెంకాయనూ శని దోషాలు తొలగి పోవటమే కాక కళత్ర పుత్రపౌత్ర సౌఖ్యాలు కలుగుతాయి’’ అని ముగించారు.
శౌనకాది మునులందరూ కోరగా సూతులవారు కాశీ క్షేత్ర మహాత్మ్యాన్ని గురించి కూడా తెలిపారు.
కాలభైరవ స్తోత్రం
‘‘దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాళ యజ్ఞ సూత్రమిందు శేఖరం గుణాకరం
నారదాది యోగిబృందవందితం దిగంబరం
కాశికా పురాధినాధ కాలభైరవం భజే’’ ॥
కాల భైరవావతారం మార్గశిరమాసపు కృష్ణపక్ష అష్టమినాడు సంభవించింది. కనుక ఆ రాత్రి కాలభైరవుని సన్నిధిలో ఉపవాస జాగరాలు చేసి ఆయనను సేవించిన వారు సకల పాపాల నుండీ విముక్త్ఱువుతారు.
కాశీక్షేత్ర మహాత్మ్యము (కోటి రుద్ర సంహిత)
ఆసక్తిగా వింటున్న శౌనకాది ముని పుంగవులతో సూత మహర్షి ఇలా అన్నారు.
‘‘శౌనకాదులారా! మీరు వినగోరిన కాశీక్షేత్ర మహాత్మ్యాన్ని గురించి తెలుపుతాను. శ్రద్ధగా వినండి.
కాశీ పట్టణాన్ని వారణాసి అని కూడా వ్యవహరిస్తారు. పట్టణానికి రెండు వైపులా ‘వరుణ’, ‘అసి’ అనే నదులు పారుతూ గంగాజలాల్లో ఐక్యమవుతూ ఉండటం చేత దానికి ‘వారణాసి’ అనే పేరు కలిగింది. ఒక కల్పంలో బ్రహ్మ విష్ణువులలో ఎవరు అధికులో నిర్ణయించటానికి పరమేశ్వరుడు లింగరూపాన ఉద్భవించిన తరువాత, ఆ లింగానికి ఐదు క్రోసుల దూరం దాకా ఈ పట్టణం విస్తరించింది.
తరువాత తానక్కడ శివుని గూర్చి తపస్సు చేయటానికి అనుకూలంగా ‘వైశ్రవణుడ’నే అసలు నామం కలిగిన కుబేరుడు ఈ పట్టణాన్ని సుందరంగా పునః నిర్మింప జేసి మరింత విస్తరింప జేసా డని మా గురువుగారైన వ్యాస మహర్షి నాకు తెలిపారు.
కాశీనగరానికి ఆనంద కాననమనీ, మహాశ్మశానమనీ, అవిముక్తమనీ నామాంతరాలు కూడా ఉన్నాయి. ‘కాశము’ అనగా ప్రకాశము. పరమేశ్వ రుని ప్రకాశంతో వెలిగే చోటు కనుక కాశీ నగరం ఒక క్షేత్రమయింది. వెలుగు అనగా జ్ఞానం. కనుక కాశీ ‘జ్ఞాన క్షేత్రం’ అనబడింది. పార్వతీ పరమేశ్వరులు దీనిని ప్రళయ సమయాన కూడా విడిచి పెట్టని స్థలం కనుక దానికి ‘అవిముక్తము’, అనగా పరమేశ్వ రుని నుండి వేరు చేయలేనిది అనే నామం సంప్రాప్తించింది.
ఇక్కడి లింగం ‘అవిముక్త విశే్వశ్వర లింగంగా ప్రఖ్యాతి నొందింది. ప్రళయ సమయాన సైతం పరమేశ్వరుడు తన త్రిశూలాగ్రాన ఈ నగరాన్ని నిలిపి ఉంచి, ముక్తి పొందిన భక్తులను అక్కడ తన సామీప్యంలో ఉంచుకుంటాడు. బాల్య, యవ్వన, వృద్ధ దశల పిదప అన్ని జీవులూ చేరేవి శ్మశానానికే. కానీ ఏ శ్మశానంలో లీనమయి జీవుడు శాంతిని పొందుతాడో, పరమేశ్వరునిలో లయమవుతాడో ఆ ‘మహాశ్మశానమే’ కాశీ నగరం. అలాగే చుట్టూ ‘కాననము’ అంటే అరణ్యప్రాంతం కల ఈ ప్రదేశం జీవులకి శాశ్వతానందమైన మోక్షానందాన్ని ప్రసాదిస్తుంది కనుక దానిని ‘ఆనంద కాననము’ అని శాస్త్రం వ్యవహరించింది.
మునిజనులారా!
కాశీలో మరణించిన అర్హులైన భక్తులందరికీ కాలభైరవుడి వలన తారక మంత్రోపదేశమై మోక్షం సిద్ధిస్తుంది. అలాగే రామేశ్వరపు ఇసుకతో కానీ సముద్ర జలాలతో కానీ కాశీ విశే్వశ్వర లింగాన్ని అభిషేకించి, కాశీ గంగాజలాలతో రామేశ్వర లింగాన్ని అభిషేకించిన వారి సుకృతం వివరించనలవి కానిది. ఆ విధంగా మూడుసార్లు అభిషేకిస్తే సాక్షాత్తూ వారికి ముక్తి లభిస్తుంది.
శౌనకాదులారా! కాశీ యాత్ర చేసిన వారికి ఆ అన్నపూర్ణా విశే్వశ్వరుల అపార కృప లభిస్తుంది. విశే్వశ్వరాను గ్రహమూ, కాలభైరవుని కృపా ఫలితాల గానే తప్ప అన్యథా కాశీదర్శన భాగ్యం సిద్ధించదు.

శ్రీమతి గౌరీ గార్లదిన్నె